ప్రపంచ ఉపకార దినోత్సవం సందర్భంగా గౌరవం మరియు సానుభూతిని ప్రదర్శించడం

నవంబర్ 13, 2023

ఈ రోజు ప్రపంచ ఉపకార దినోత్సవం, మనం ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌లో చేసె ప్రతి పనినీ గౌరవం, సానుభూతి, కరుణలతో నాయకత్వం వహించడంకంటే, సానుకూల ఆలోచనలను మరియు చర్యలను ప్రోత్సహించడానికి ఇంతకుమించిన సమయం మరొకటి ఉండదు. ఉపకారమనేది, Snap ఒక కంపెనీ విలువ. మన వ్యాపారానికి ఇది చాలా అవసరం, మరియు మన భద్రతా వ్యవహారాల్లో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, చాలావరకు ఆన్‌లైన్ భద్రతా సమస్యలు ప్రతికూల లేదా అంతగా సహకరించని ప్రవర్తనలతో ప్రారంభమవడం బాధాకరం.

దీనికి ఉదాహరణగా, ఏకాభిప్రాయంలేని దానిని సృష్టించి, సన్నిహితమైన ఊహాచిత్రాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవడం, ప్లాట్‌ఫామ్స్ మరియు సేవలన్నింటిలో పెరిగిపోతున్న దురదృష్టకరమైన ధోరణిని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

Snap, StopNCII యొక్క హాష్ డేటాబేస్ ఉపయోగించుకొని ఏకాభిప్రాయంలేని సన్నిహిత ఊహాచిత్రాన్ని (NCII), Snapchatపై వ్యాప్తిని నిరోధించండటానికి, ఇటీవల SWGfL యొక్క StopNCIIతో చేతులు కలిపింది. "హాష్-మ్యాచింగ్" ద్వారా జరిగే పిల్లల లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగానికి సంబంధించిన చట్టవిరుద్ధమైన ఫోటోలు మరియు వీడియోలను గుర్తించడం, తీసివేయడం మరియు రిపోర్ట్ చేయడానికి మేము దీర్ఘకాలంగా చేస్తూ మరియు కొనసాగిస్తున్న పని లాగానే, StopNCII NCII చిత్రాల "హాష్‌ల" యొక్క ప్రత్యేక డేటాబేస్‌ను అందిస్తుంది. ఈ హ్యాష్‌లకు వ్యతిరేకంగా చొప్పించడం మరియు స్కాన్ చేయడంద్వారా, ఉల్లంఘన మెటీరియల్ ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందడాన్ని నిలిపివేసేందుకు మరియు వారి అత్యంత ప్రైవేట్ మరియు డేటాపై నియంత్రణను తిరిగి పొందడానికి, బాధితులకు మద్దతు ఇచ్చేందుకు మేము సహాయపడతాము.

"StopNCII వద్ద ఏకాభిప్రాయరహిత సన్నిహిత చిత్రాలను ఆన్‌లైన్‌లో పంచుకోవడంలో జరుపుతున్న పోరాటంలో, Snap మాతో చేరడం మాకెంతో సంతోషకరం," అని UK-based NGO SWGfL యొక్క CEO డేవిడ్ రైట్ అన్నారు. "డిసెంబర్ 2021లో లాంచ్ చేసినప్పటినాటినుండి, బాధితులు నియంత్రణ తిరిగి పొందడానికి మరియు వారి భయాలను తొలగించడంలో మేము వారిని శక్తిమంతం చేస్తున్నాము. మరింత భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా బాధితులు భయపడటం తగ్గిపోవడానికి దారితీసే మా విజయం Snap వంటి ప్లాట్‌ఫామ్స్‌తో సహకారంపై ఆధారపడి ఉంటుంది."

Snap, NCIIను నిషేధిస్తుంది మరియు దీనిని మా బెదిరింపుల మరియు వేధింపు వ్యతిరేక నియమాలలో స్పష్టంగా తెలియజేస్తుంది. లైంగికంగా వ్యక్తపరచే, సూచించే లేదా నగ్న చిత్రాలను ఇతర వినియోగదారులకు పంపడంతో సహా "అన్ని రకాలైన లైంగిక వేధింపులకు" వర్తించేలా ఈ నిషేధాలు ఉంటాయని మా కమ్యూనిటీ మార్గదర్శకాలు నిర్ధిష్టంగా తెలియజేస్తాయి. మా ప్లాట్‌ఫామ్‌లో ఈ కంటెంట్ లేదా ప్రవర్తన అంగీకరించము; ఎందుకంటే, Snapchatను ఒక నమ్మకమైన వ్యక్తీకరణ యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి మరియు ఆస్వాదించే ప్రదేశంగా చేయడానికి తాను నిర్దేశించుకొన్న లక్ష్యంలో భాగంకాదు. ఏకాభిప్రాయరహిత సన్నిహిత ఊహాచిత్రాల ఉత్పత్తి, పంచుకోవడం లేదా పంపిణీలను, ఒకవేళ ఎవరైనా మా విధానాలను అవకాశమున్న ఉల్లంఘనలను అనుభవించినా లేదా గమనించినా వాటిని మాకు మరియు వీలైతే స్థానిక అదికారులకు వెంటనే రిపోర్ట్ చేయవలసిందిగా మేము వారిని ప్రోత్సహిస్తున్నాము.

కొత్త Snap పరిశోధన

మా అన్ని ప్లాట్‌ఫామ్స్ మరియు సేవలపై - కేవలం Snapchat మాత్రమే కాదు - జరిపిన తాజా పరిశోధన, ఈ సంవత్సర ఆరంభంలో 18 నుండి 24 సంవత్సరాల వయస్సులో ఉన్న 54% యువ వయోజనులు సన్నిహిత ఊహాచిత్రాలను చూశారని, మరియు వారిలో మూడవ వంతు (35%) మంది శృంగార ఫోటోలు లేదా వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేయాలని కోరబడ్డారని తెలిపింది. దాదాపు సగం మంది (47%), వారు అవాంఛిత శృంగార ఊహాచిత్రాలను అందుకొన్నారు మరియు 16% మంది అటువంటి కంటెంట్ షేర్ చేసినట్లు అంగీకరించారు. సన్నిహిత ఫోటోలు మరియు వీడియోలను అందుకున్న వారికంటే, షేర్ చేసుకొన్నవారు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నందున, అలాంటి చిత్రాలను వాస్తవంగా షేర్ చేసిన వారు, తమ ప్రవర్తనను తక్కువగా నివేదించి ఉండవచ్చు.

మా Snap డిజిటల్ వెల్ బీయింగ్ రీసెర్చ్‌లోని రెండవ సంవత్సరంనుండి తీసుకొన్న ఈ ఫలితాలు ఆరు దేశాలు - ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ది U.K, మరియు the U.S.ల నుండి తీసుకొన్నవి. వరుసగా రెండవ సంవత్సరానికి, మేము కౌమార దశ (వయస్సు 13-17), యువ వయోజనులు (వయస్సు 18-24 సంవత్సరాలు), మరియు 13 నుండి 19 సంవత్సరాల వయసున్న కౌమారుల తల్లిదండ్రులను వారి ఆన్‌లైన్‌ కార్యకలాపాలగురించి సర్వేచేశాము. ఈ సర్వే ఏప్రిల్ 28 నుండి మే 23, 2023 వరకు సాగింది. మేము మొత్తం 9,010 భాగస్వాములను కలిసి, వారి ఆన్‌లైన్ అనుభవాలను ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు తీసుకొన్నాము. మేము ఫిబ్రవరిలోని సురక్షిత ఇంటర్నెట్ దినం 2024 రోజున, ప్రపంచవ్యాప్త ఫలితాలను ప్రచురిస్తాము, కాని మేము ఈ డేటాను ప్రపంచ ఉపకార దినోత్సవ సందర్భంగా ముందుగా సమీక్షిస్తున్నాము.

వారు ఎవరితో పంచుకొన్నారు

టీనేజ్ మరియు యువత సన్నిహిత లేదా శృంగారపరంగా చూపించే చిత్రాలను ప్రధానంగా వారు నిజజీవితంలో తెలిసిన వారితో పంచుకొన్నట్లు మా పరిశోధనలు సూచించాయి. కాని, అది అనుకొన్న స్వీకర్తకు ఆవల అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని మనకు తెలుసు. సన్నిహిత చిత్రాలతో మమేకమైవున్న జనరేషన్ Z లోని ప్రతిస్పందన ఇచ్చినవారిలో 42% మంది (54% మంది యువ వయోజనులు మరియు 30% టీన్స్), దాదాపు ముప్పావుభాగం వారు (73%) ఈ చిత్రాలను నిజజీవితంలో వారికి తెలిసిన వారితో పంచుకొన్నారని, 44% మంది సన్నిహిత ఫోటోలు లేదా వీడియోలను వారికి ఆన్‌లైన్‌లో తెలిసిన వారికి మాత్రమే పంపారని తెలిపారు. మూడవవంతు (33%) సందర్భాలలో, ఈ మెటీరియల్ ఉద్దేశిత స్వీకర్త కానివారితో పంచుకోబడింది. క్రింద ఇవ్వబడిన ఫలితాల గ్రాఫ్, ఆన్‌లైన్‌ కాంటాక్టులతో పంచుకొన్నవారి వివరాలను తెలియజేస్తుంది.

పంచుకోకుండా ఉండటాన్ని వేడుక చేసుకోండి

మా అధ్యయనంలో, సన్నిహిత చిత్రాలను షేర్ చేసుకొండి అని అడగబడిన యువకుల నుండి వినదలిచాము, కాని, ఇది సునిశిత ఆలోచన మరియు ప్రతిస్పందనలను రేకెత్తించాలనే ఉద్దేశ్యంతో కాదు. వారికి చాలా కారణాలు ఉన్నాయి, ఇరు వయోవర్గాలవారు, పంచుకోవడం అసౌకర్యంగా ఉందని ప్రధానంగా చెప్పారు. అంతేగాక, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారిని కనుగొంటారని టీనేజర్లు ఇబ్బంది పడ్డారని, 18-24 సంవత్సరాల వయస్సు వారు, ఈ చర్యలు తమ భవిష్యత్ అవకాశాలపై అంటే కళాశాలలో చేరడం లేదా ఒక ఉద్యోగంలో ల్యాండ్ అవడంపై ప్రభావం చూపుతాయని ఎక్కువ భయపడ్డారు. పంచుకోకపోవడానికి స్పందించేవారు ఇచ్చిన ప్రధాన కారణాలపై:

  • ఈ చిత్రాలను పంచుకోవడం అసౌకర్యంగాఉంటుంది: యువ వయోజనులు: 55%, టీన్స్: 56%

  • చిత్రాలు బహిరంగంగా వెల్లడవుతాయని భయపడేవారు: యువ వయోజనులు: 27%, టీన్స్: 25%

  • ఇది వారి భవిష్యత్తు అవకాశాలపై చూపేప్రభావం (ఉదా., కళాశాల ప్రవేశం, ఉద్యోగాలు, సంబంధాలు): యువ వయోజనులు: 23%, టీన్స్: 18%

  • చిత్రం ఉద్దేశిత స్వీకర్తను దాటి వెళుతుందేమోనని భయపడేవారు: యువ వయోజనులు: 21%. టీన్స్: 20%

  • తల్లిదండ్రులు/సంరక్షకులు కనుగొంటారని భయపడేవారు: యువ వయోజనులు: 12%, టీన్స్: 20%


Snapchat టూల్స్ మరియు వనరులు

నేరపూరిత వ్యక్తులను బ్లాక్ చేయడానికి మరియు నిర్ధారిత Snaps (ఫోటోలు లేదా వీడియోలు) మరియు ఖాతాలను రిపోర్ట్ చేయడానికి Snapchat ఇన్-యాప్ టూల్స్ కలిగివుంది. Snapఛాటర్లు దానిని మాకు సులభంగా రిపోర్ట్ చేయడానికి ఏదైనా ఒక కంటెంట్‌ను నొక్కి పెట్టి చేయవచ్చు లేదా మా సపోర్ట్ సైట్ వద్ద ఉన్న ఈ ఆన్‌లైన్ ఫారం‌ నింపవచ్చు. ఈ ఫారంను ఎవరైనా, వారు Snapchat అకౌంట్ కలిగి ఉన్నా లేకపోయినా సమర్పించవచ్చు. (Snapchatపై రిపోర్టింగ్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకోండి.) నివేదికలను, ప్రపంచవ్యాప్తంగా రోజంతా 24/7 పనిచేసే Snap ట్రస్ట్ మరియు భద్రతా బృందాలు సమీక్షించి చర్యతీసుకొంటాయి. అమలుపరచడంలో ఉల్లంఘించినవారిని హెచ్చరించడం, అకౌంట్ నిలిపివేయడం లేదా అకౌంట్‌ను పూర్తిగా రద్దుచేయడంవంటివి ఉండవచ్చు.

మా సాధనాలను వినియోగించుకోవడంద్వారా, దీనినుండి పొందే లాభాలను కమ్యూనిటీ మొత్తానికి అందేలా తెలుసుకోవాలని మేము ప్రతివారినీ కోరుతున్నాము. సంఘటనలు రిపోర్టింగ్ దశకు చేరుకోరాదని మేము కోరుకొంటున్నాము - StopNCIIలో ఒక భాగం కావడానికి ఇదికూడా ఒక కారణం, అయితే, రిపోర్టింగ్ అనేది ఒక ముఖ్యమైన ప్రయోజనాన్ని అందించడానికి దోహదం చేస్తుంది.

లైంగికపరమైన టెక్స్ట్ సందేశాలను పంపడం మరియు నగ్నచిత్రాలను పంచుకోవడంపై మా కొత్త సేఫ్టీ Snapchat ఎపిసోడ్‌ను చూడవలసిందిగా, మేము యువకులను, మరియు Snapఛాటర్లు అందరినీ ప్రోత్సహిస్తున్నాము. యాప్‌లో "సేఫ్టీ స్నాప్‌షాట్"ను శోధించండి. లైంగికపరమైన ఇబ్బందులకు సంబంధించి మొత్తం నాలుగు కొత్త ఎపిసోడ్‌లను మేము ఇటీవలే చేర్చాము. వీటన్నింటినీ, U.S. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ మరియు ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ సమీక్షించి, విరామివ్వడం, ఎవరి ప్రేరణనైనా ప్రశ్నించడం, మరియు లోతుగా ఆలోచించడాన్ని ప్రముఖంగా చెప్పారు.

మా పరిశోధన మరియు Snapchatను ఒక భద్రమైన, ఆరోగ్యకరమైన, మరియు సృజనాత్మకత మరియు సంబంధాలకు మరింత ఆహ్లాదాన్ని పంచే వాతావరణంగా చేసేందుకు నిరంతరం కొనసాగే మా ప్రక్రియలను మీతో పంచుకోవడానికి మేము ఎదురుచూస్తున్నాము. అప్పటివరకు, ప్రపంచ ఉపకార దినోత్సవ శుభాకాంక్షలను అందుకొని, ఉపకారాన్ని కేవలం నవంబర్ 13న మాత్రమే కాకుండా, సంవత్సరమంతా కొనసాగించాలనే కోరుతున్నాం.

- Jacqueline Beauchere, గ్లోబల్ హెడ్, ప్లాట్‌ఫారమ్ భద్రత

తిరిగి వార్తలకు