డేటా గోప్యతా దినం: Snap యొక్క కొత్త గోప్యతా మరియు భద్రతా హబ్ మరియు గోప్యతా సెట్టింగ్లు గురించి మరింత తెలుసుకోండి

26 జనవరి, 2023

Snap వద్ద గోప్యతా మా DNA లోనే నడుస్తుంది. ప్రైవేట్ కమ్యూనికేషన్ మరియు సంభాషణ ద్వారా ప్రజలు తమ స్నేహాలను బలోపేతం చేసుకోవడంపై ప్రజలకు సహాయపడటంపై దృష్టి సారించడం అనేది మొదటి రోజు నుండీ Snapchat యొక్క నిర్దిష్ట అంశాలలో ఒకటిగా ఉంటోంది.

మేము ఎదుగుతూ మరియు అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మా ప్లాట్‌ఫామ్ తనకు తాను రెండు ప్రాథమికమైన ఐతే ముఖ్యమైన విలువలలో నిలవడం కొనసాగుతోంది: గోప్యత మరియు భద్రత. Snap చాటర్ లని క్షేమంగా మరియు సురక్షితంగా ఉంచడానికి స్పష్టమైన గోప్యతా నియమాలు ఉండటం చాలా అవసరం, మరియు Snap చాటర్ ల గోప్యతను రక్షించడానికి బలమైన భద్రతా పద్ధతులు సహాయపడతాయి. కాబట్టి, మేము అభివృద్ధి చేసే ప్రతి కొత్త ఫీచర్ సమగ్రమైన గోప్యతా మరియు భద్రతా సమీక్ష ద్వారా వెళుతుంది, మరియు ఒక కొత్త ఫీచర్ గనక పరీక్షలో ఉత్తీర్ణత సాధించకుంటే, మేము ముందుకు వెళ్లము.

అందుకనే డేటా గోప్యతా దినాన్ని పురస్కరించుకొని మేము ఇటీవల మా గోప్యతా మరియు భద్రతా హబ్ అయిన – values.snap.com – ని మా గోప్యతా మరియు భద్రతా సామాగ్రిని ఒకే కప్పు క్రింద ఉంచుకునే చోటుగా కొత్త ఏకైక ఆపుదల నిలయాన్ని ఇటీవలనే ప్రారంభించాము. ప్రజలు ఇప్పుడు ఈ హబ్ ను సందర్శించవచ్చు మరియు గ్రహించడానికి సులభమైన మార్గములో Snap యొక్క విశిష్ట విధానంపై తమకు అవగాహన కలిగించే సంక్షిప్త రూపములోని కంటెంట్‌ను కనుగొనవచ్చు. ఇంతకు మునుపు, మా గోప్యతా మరియు భద్రతా కేంద్రాలు వేరుగా ఉండేవి, మరియు సమాచారాన్ని క్రమబద్ధీకరించడం మరియు ఒక కేంద్ర స్థలాన్ని సృష్టించడం ద్వారా మరింత ఎక్కువ మంది వ్యక్తులు మా విధానాలు, వనరులు మరియు సాధనాలను అన్వేషిస్తారని మరియు మా ప్లాట్‌ఫామ్‌ పైన వ్యక్తులను రక్షించడానికి Snap ఏమి చేస్తున్నదో మరియు తమను తాము రక్షించుకోవడానికి తాము ఏమి చేయగలరో బాగా అర్థం చేసుకుంటారనీ మేము ఆశిస్తాము.

Snap చాటర్ లు తాము పంచుకునే వాటిపై నియంత్రణ కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము, మరియు దీనిని సులభతరం చేయడానికి గాను, సంబంధిత సెట్టింగ్లును మరింత సులభంగా కనుగొని అర్థం చేసుకోవడానికై మేము సెట్టింగ్లు పేజీని రీఫ్రెష్ చేస్తున్నాము. Snapchat అనేది ప్రజలు తమకు తాము వ్యక్తపరచుకోవడానికి, ఆ క్షణంలో గడపడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు కలిసి సరదాగా ఉండటానికి సాధికారపరచే ఒక అనువర్తనం, అందుకనే మేము సంభాషణాత్మక సాధనాల శ్రేణిని కూడా ప్రారంభిస్తున్నాం, అంటే గోప్యతా ఇతివృత్తం గల Bitmoji లాగా, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవసీ ప్రొఫెషనల్స్ (IAPP)తో భాగస్వామ్యంతో ఒక స్టికర్ ప్యాక్, మరియు ఒక విద్యార్థి గోప్యతా సమాచార వినిమయాల టూల్‌ కిట్ లాగా ఆన్‌లైన్ యందు మీ గోప్యతను రక్షించడానికి ఉత్తమ అభ్యాసాలతో వనరులకు స్వైప్-అప్ లింక్ చేరి ఉండే ఒక ప్రముఖ గోప్యతా సంస్థ అయిన ఫ్యూచర్ ప్రైవసీ ఫోరం (FPF)తో సహ సృష్టించబడిన ఒక లెన్స్‌ను కలిగి ఉంటుంది. చివరగా, Snap చాటర్ లు మా స్టోరీస్ పేజీ పై మా గోప్యతా-దృష్టిసారింపు ఛానల్ అయిన భద్రతా స్నాప్‌షాట్ యొక్క ఘట్టమును చూడవచ్చు, అది మీడియా భాగస్వాములు మరియు సృష్టికర్తల నుండి కంటెంట్ కలిగి ఉంటుంది. ఈ ఘట్టము విశిష్ట అకౌంట్ ఆధారాలను సృష్టించడం, రెండు కారకాంశాల అధీకరణను ఎలా ఏర్పాటు చేయాలి అనే దాని గురించి చిట్కాలు అందిస్తుంది.

ఈ డేటా గోప్యతా దినమున మరియు ప్రతిదినమూ, మా కమ్యూనిటీల గోప్యత మరియు భద్రతను రక్షించడానికి Snap ఎప్పుడూ కట్టుబడే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా Snap చాటర్ లు కోసం ఒక వినోదాత్మక, నిమగ్నాత్మకమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని నిర్వహించుకుంటూనే మేము గోప్యతా మరియు భద్రతా అభ్యాసాల అత్యధిక ప్రమాణాలకు కట్టుబడి ఉండడం కొనసాగిస్తాము.

తిరిగి వార్తలకు