ఒక వివరణ – My AI మరియు లొకేషన్ ను పంచుకొనుట

25 ఏప్రిల్, 2023

My AI, మా AI-ఆధారిత చాట్‌బాట్, మన Snapchat కమ్యూనిటీకి అందుబాటులోకి వస్తోందని మేము గత వారం ప్రకటించాము. Snap చాటర్‌ల యొక్క ప్రారంభ ప్రతిస్పందనలను చూడటం చాలా ఉత్సాహంగా ఉంది, మరియు My AI ని మరింత మెరుగుపరచడానికి గాను వారి ఫీడ్ బాక్ పట్ల మేము కృతజ్ఞులుగా ఉన్నాము. Snap చాటర్‌ల యొక్క లొకేషన్ సమాచారాన్ని My AI ఉపయోగించగల మార్గాలను మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము.

Snap చాటర్‌ల నుండి My AI ఎటువంటి కొత్త లొకేషన్ సమాచారాన్ని సేకరించదని తెలుసుకోవటం ముఖ్యము. మా మద్దతు పేజీలో వివరించినట్లుగా, Snapchat కు వారు ఇప్పటికే అనుమతులను మంజూరు చేసి ఉన్నట్లయితే మాత్రమే చాట్‌బాట్ Snap చాటర్‌ల యొక్క లొకేషన్ కి అనుమతిని కలిగి ఉంటుంది (Snap మ్యాప్ పైన వారి స్థానాన్ని పంచుకోవడానికి కూడా అది సుసాధ్యం చేస్తుంది). మా కమ్యూనిటీ కోసం మరింత పారదర్శకతను అందించడానికి గాను, మా బృందం Snap చాటర్‌ యొక్క లొకేషన్ గురించి తెలుసుకున్నప్పుడు మరియు తెలుసుకోనప్పుడు దానిని స్పష్టం చేసే విధంగ My AI కి ఆధునీకరణలను చేసింది.

Snapchat పైన లొకేషన్ ను పంచుకొనుట

గోప్యత అనేది మాకు ఒక పునాదిస్థాయి విలువ – వ్యక్తులు తమ ఫ్రెండ్స్ మరియు కుటుంబముతో దృశ్యాత్మకంగా కమ్యూనికేట్ చేసుకోవడానికి సహాయపడే మా కోర్ వాడుక ఉదంతాలకు ఇది కీలకం. మా యాప్ వ్యాప్తంగా, మేము సేకరించే డేటా మొత్తాన్ని తగ్గించుకోవాలని కోరుకుంటాము మరియు మా ఉత్పత్తులలో ప్రతి ఒక్కటీ డేటాను ఎలా ఉపయోగిస్తుందో దాని గురించి మా కమ్యూనిటీతో సాధ్యమైనంత పారదర్శకంగా ఉండేందుకు లక్ష్యంగా చేసుకుంటాము.

Snap చాటర్‌ల అందరి కోసం, ప్రశస్తమైన స్థానమును పంచుకోవడమనేది డీఫాల్ట్ గా ఆఫ్ అయి ఉంటుంది, మరియు దానిని పంచుకోవడానికి మీరు సమ్మతి ఇస్తే మాత్రమే Snapchat ఎప్పుడైనా మీ లొకేషన్ కి అనుమతిని పొందుతుంది. లెన్సెస్, సర్చ్, మరియు ప్రకటనలు వంటి భౌగోళికంగా సముచితమైన అంశాలతో Snapchat అనుభవాన్ని మెరుగుపరచడానికి Snapchat తో మీ అనుభవాన్ని పంచుకోవడాన్ని ఉపయోగించుకోవచ్చు.

వాడుకదారులు ఇప్పటికే ఉన్న తమ ఫ్రెండ్స్ తో తమ స్థానాన్ని పంచుకోవడానికి Snap మ్యాప్ వారికి ఎంపికగా ఎంచుకునే ఆప్షన్ అందిస్తుంది, ఐతే, Snapchat పైన వారు ఇప్పటికే పరస్పరం ఫ్రెండ్స్ గా లేని కాంటాక్టులతో కాదు.

My AI కి ఇది ఎలా వర్తిస్తుంది

ఒక Snap చాటర్‌ మొదటిసారి My AI ని ఉపయోగించినప్పుడు, సమాధానాలను వ్యక్తిగతీకరించడానికి గాను Snapchat తో పంచుకునే సమాచారాన్ని అది ఉపయోగించుకోవచ్చునని వివరించే ఒక నోటీసు వారికి అందుతుంది. ఒకవేళ మీరు Snapchat తో మీ లొకేషన్ సమాచారాన్ని పంచుకుంటున్నట్లయితే మాత్రమే మీ అభ్యర్థనలకు సమాధానంగా మీతో వ్యక్తిగతీకరించిన లొకేషన్ సిఫార్సులను My AI పంచుకుంటుంది.

ఒకవేళ మీరు Snapchat తో మీ లొకేషన్ సమాచారాన్ని పంచుకోవాలని గనక ఎంచుకుంటే, మీరు అడిగినప్పుడు My AI మీకు ఉపయోగకరమైన ప్రదేశాలను సిఫార్సులను అందించడానికి గాను మీరు ఎక్కడ ఉన్నారు మరియు మీ చుట్టూ ఉన్న ప్రదేశాల గురించి Snapchat యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి My AI కి సామర్థ్యం ఉంది. ఉదాహరణకు - మీరు Snapchat తో మీ లొకేషన్ ని పంచుకొని మరియు, “నాకు దగ్గరలో మంచి ఇటాలియన్ రెస్టారెంట్లు ఏవేవి ఉన్నాయి?” అని My AI ని అడిగినట్లయితే, అది Snap మ్యాప్ నుండి సమీపంలో ఉన్న వాటి సూచనలను తిరిగి ఇవ్వగలదు.

ఒకవేళ Snap చాటర్‌లు తమ లొకేషన్ ని Snapchat తో పంచుకోవడాన్ని ఆపివేసినట్లయితే, My AI లో అది ప్రభావం కావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. My AI గురించి మాతో తమ ఫీడ్‌బ్యాక్ పంచుకోవడం కొనసాగించడానికి మరియు ఏవైనా కచ్చితం కాని సమాధానాలను మా బృందాలకు రిపోర్టు చేయడానికి మేము Snap చాటర్‌లని ప్రోత్సహిస్తాము – కాబట్టి మేము My AI ని మరింత కచ్చితంగా, తమాషాగా మరియు ఉపయోగకరంగా చేయడానికి పనిచేయడం కొనసాగించగలుగుతాము.

తిరిగి వార్తలకు