అనేక ఆన్లైన్ సమాచార సేవల మాదిరిగానే, Snapchat ప్రధానంగా అడ్వర్టైజింగ్ ద్వారా మద్దతు ఇవ్వబడుతోంది. ప్రకటనలపై ఆసక్తి ఉన్న వ్యక్తులకు ప్రకటనలను చూపించడానికి ప్రకటనదారులు చాలా ఎక్కువ చెల్లిస్తారు. వ్యక్తిగతీకరించిన యాడ్స్ ని మేము చూపించకపోతే, Snapchat ను ఎటువంటి రుసుము లేకుండా సరదాగా, సురక్షితంగా మరియు సృజనాత్మకంగా ఉంచడం మాకు సాధ్యం కాదు.
వ్యక్తిగతీకరించిన ప్రకటనలు ప్రకటనదారులు, ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు, తమ ఉత్పత్తులపై నిజంగా ఆసక్తి ఉన్న వ్యక్తులను చేరుకోవడానికి దోహదపడతాయి, ఇది ప్రకటనల ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎక్కువగా ఆసక్తి చూపించే వ్యక్తులపైనే బడ్జెట్‌ను కేంద్రీకరించడం ద్వారా, వ్యక్తిగతీకరించిన ప్రకటనలు చిన్న వ్యాపారాలు తమ వనరులను గరిష్టంగా ఉపయోగించుకునేలా మరియు సమర్థవంతంగా పోటీ పడేలా శక్తినిస్తాయి.
చాలా మంది ప్రజలు మరింత సంబంధిత, సరదాగా ఉండే మరియు ఆసక్తికరమైన యాడ్స్ కూడా ఇష్టపడతారు - మరియు అసంబద్ధమైన యాడ్స్ పట్ల చికాకు ప్రదర్శిస్తారు. మీరు తదుపరి టాప్ చెఫ్‌గా మారడానికి మార్గంలో ఉన్నట్లయితే, వంటసామాను మరియు వంటకాల గురించిన యాడ్స్ Snapchat పై మీ సమయాన్ని మెరుగుపరుస్తాయి; ట్రాంపోలిన్ల గురించి యాడ్స్, అంతగా ఉండకపోవచ్చు (మీకు గెంతడం కూడా నచ్చితే తప్ప!).
Snap పట్ల మీ నమ్మకం మాకు చాలా ముఖ్యమైనది. ఇది Snapchat పై మీ అనుభవం యొక్క ఇతర భాగాలకు ఎంత నిజంగా వర్తిస్తుందో అడ్వర్టైజింగ్ కు కూడా అంతే నిజంగా వర్తిస్తుంది. పర్సనలైజ్డ్ అడ్వర్టైజింగ్ గనక సరిగ్గా సమతుల్యం చేయబడితే, అది ప్రతి ఒక్కరికీ విజయం అవుతుందని మేము నమ్ముతున్నాము. దీనిని సాధించడానికి:
Snapchat పై యాడ్స్ ఎలా పనిచేస్తాయి, మీకు యాడ్స్ చూపించడానికి మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాము మరియు ఉపయోగిస్తాము మరియు మీరు ఏ యాడ్స్ చూడాలో నియంత్రించడానికి మేము అందించే సెట్టింగ్‌లు ను మేము దిగువన వివరిస్తాము.
డిజైన్ ప్రక్రియల ద్వారా మాకు ఘనమైన గోప్యత మరియు భద్రత ఉంది. Snapchat పై పర్సనలైజ్డ్ అడ్వర్టైజింగ్ పట్ల మా విధానం సమతుల్యంగా ఉండేలా ఇవి నిర్ధారిస్తాయి.
మేము మీ గురించి ప్రతిదీ ప్రకటనదారులతో పంచుకోము. ఏ రకం వినియోగదారు వారి యాడ్స్ చూడాలో పేర్కొనడానికి మరియు వారి యాడ్స్ విజయవంతమయ్యాయా అని కొలవడానికి మాత్రమే మేము ప్రకటనదారులను అనుమతిస్తాము.
మేము మా అడ్వేర్టైజర్స్ ను కూడా నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతాము. వారు తమ ఉత్పత్తులు, సేవలు మరియు కంటెంట్ గురించి నిజాయితీగా ఉండాలని, మా వైవిధ్య కమ్యూనిటీ పట్ల దయతో ఉండాలని మరియు మీ గోప్యత పట్ల రాజీ పడకుండా ఉండాలని మేము ఆశిస్తున్నాము.
తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నట్టి ఒక యాడ్ లేదా మా కమ్యూనిటీ మార్గదర్శకాలు ను చేరుకోవడంలో విఫలమైన వాటితో సహా, మా అడ్వర్టైజింగ్ విధానాలకు అనుగుణంగా లేని యాడ్స్ ను మేము తిరస్కరిస్తాము. ఒకవేళ మీరు తప్పుదారి పట్టించే యాడ్ ను గుర్తించినట్లయితే, మీరు యాడ్ పై మరింత తెలుసుకోండి అనే ఐకాన్ ఉపయోగించి దాన్ని యాప్-లో రిపోర్ట్ చెయ్యవచ్చు.