Snap Values

మరింత మంది టీనేజర్‌లు, ఆన్‌లైన్‌లో రిస్క్‌ను అనుభవించిన తరువాత, దాని గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారని ఒక సరికొత్త పరిశోధన తెలియజేస్తోంది.

13 నవంబర్, 2025

ఆన్‌లైన్‌లో ప్రమాదాలను ఎదుర్కొన్న తరువాత, చాలామంది టీనేజర్‌లు, తల్లిదండ్రులు, స్నేహితులు, తోబుట్టువులు మరియు వారి జీవితాల్లో నమ్మకమైన ఇతర వ్యక్తులను సంప్రదిస్తున్నట్లుగా సరికొత్త పరిశోధన తెలియజేస్తోంది- ఇది చాలా సానుకూల పరిణామం. అయితే లైంగిక ప్రమాదాలు మరియు స్వీయ హానితో సహా, మరింత వ్యక్తిగత సవాళ్లను ఆన్‌లైన్ లో ఎదుర్కొన్నప్పుడు మాత్రం, వారు తక్కువగా ముందుకు వస్తున్నట్లుగా పరిశోధనలో కనుగొన్న విషయాలు తెలియజేస్తున్నాయి.

ఆరుదేశాల్లో 13 నుంచి 17 సంవత్సరాల వయస్సు కలిగిన 10 మంది టీనేజర్‌ల్లో ఏడుగురు (71%) అవాంఛిత పరిచయం లేదా ఆన్‌లైన్‌లో వేధింపులు వంటి ఆన్‌లైన్‌లో ప్రమాదాలకు గురైన తరువాత, సహాయం కోరుకున్నట్లుగా లేదా ఎవరితోనైనా మాట్లాడినట్లుగా పేర్కొన్నారు. గత ఏడాది ఆన్‌లైన్‌లో ఘటన జరిగిన తరువాత సంప్రదించినట్లుగా పేర్కొన్నవారు 68%గా అలానే 2023లో కనిష్టంగా 59% ఉన్నట్లుగా పోలిక తెలియజేస్తోంది. మరియు క్యాట్ ఫిషింగ్ మరియు గ్రూమింగ్ వంటి ఇతర ప్రమాదాలకు 1గురైనప్పుడు 2, అధిక శాతం టీనేజర్‌లు (84%) ఎవరితోనైనా మాట్లాడినట్లుగా పేర్కొన్నారు, ఇది 2024 నుంచి 10 శాతం పెరిగింది. అన్నింటిని మించి, 13 నుంచి 19 సంవత్సరాల వయస్సు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల్లో ప్రతి 10 మందిలో దాదాపుగా తొమ్మిది మంది (88%) డిజిటల్ సవాళ్ల గురించి వారిని సంప్రదించినట్లుగా పేర్కొన్నారు, ఇది ఇంతకు ముందు వరసగా మూడు సంవత్సరాలతో పోలిస్తే 86%కు చేరుకుంది. అయితే, లైంగిక ప్రమాదాలు, హింసాత్మక ఉగ్రవాద కంటెంట్, మరియు స్వీయ హానిని ఎదుర్కొన్నప్పుడు మాత్రమే, తక్కువ సంఖ్యలో టీనేజర్‌లు వారి తల్లిదండ్రులను సంప్రదించారు, టీనేజర్‌లు ఎదుర్కొంటున్న ఇటువంటి ఇబ్బందులను తల్లిదండ్రులు వారు స్వంతంగా లేదా వేరొకరి నుంచి తెలుసుకోవాల్సి వచ్చింది.

ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా మరియు యుకె, అమెరికాలో జనరేషన్ Z పిల్లల్లో Snap చేపడుతున్న ఐదేళ్ల అధ్యయనంలో ఈ పరిశోధనలు భాగం మేం టీనేజర్‌లు (13-17 వయస్సు), యువత (18-24 వయస్సు), మరియు 13 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రుల్లో యువత ఎదుర్కొనే ఆన్‌లైన్ ప్రమాదాల గురించి పోల్‌ను నిర్వహించాం. 2025 సర్వే ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు నిర్వహించబడింది, మూడు వయస్సు డెమోగ్రాఫిక్స్ మరియు ఆరు భౌగోళిక ప్రాంతాలకు చెందిన 9,037 ప్రతిస్పందకులు చేర్చబడ్డారు. Snap ప్రతి సంవత్సరం ఈ పరిశోధనను నిర్వహిస్తుంది, అయితే Snapchatపై నిర్ధిష్ట దృష్టి పెట్టకుండా, అన్ని ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారాలు మరియు సర్వీస్‌ల వ్యాప్తంగా Gen Z అనుభవాలను కవర్ చేస్తుంది.

తల్లిదండ్రులు, సంరక్షకులు, మరియు ఇతర నమ్మకమైన వయోజనుల్లో తమ జీవితాల్లో రెగ్యులర్‌గా జెన్ జీర్స్‌తో డిజిటల్ చెక్ ఇన్‌లను నిర్వహించేలా ప్రోత్సహించేందుకు మేం ప్రపంచ దయా దినోత్సవం 2025లో భాగంగా ఈ ఫలితాలు విడుదల చేస్తున్నాం. ఆన్‌లైన్ స్నేహితులు మరియు కార్యకలాపాల గురించి ప్రశ్నలు అడగడం; బలమైన డిజిటల్ అలవాట్లు మరియు విధానాలను హైలైట్ చేసే సంభాషణలు జరపడం; Snap యొక్క కొత్త, ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ భద్రతా అభ్యసన కోర్సును అన్వేషించడం, ద కీస్; మరియు నిర్ధిష్ట యువ టీనేజర్‌ల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సాయపడటానికి, Snapchat యొక్క ఫ్యామిలీ సెంటర్‌కు సైన్ అప్ చేయండి.  

ద కీస్: డిజిటల్ భద్రత కొరకు గైడ్

ఈ సెప్టెంబర్‌లో ప్రారంభించిన, ద కీస్ అనేది ప్రత్యేకంగా టీనేజర్‌లు మరియు వారి తల్లిదండ్రుల కొరకు రూపొందించిన ఒక ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ భద్రతా అభ్యసన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేసేది ఏమిటంటే, ఇది అవగాహన కలిగించడానికి మించినది, మరియు టీనేజర్‌లు ఆన్‌లైన్‌లో ఎదుర్కొనే బుల్లీయింగ్, వేధింపులు, అక్రమ మాదక ద్రవ్యాల కార్యకలాపాలు, నగ్నత్వం మరియు సన్నిహిత చిత్రాలు మరియు లైంగిక దోపిడి వంటి అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితులను పరిష్కరించడం ద్వారా, ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో సాయపడుతుంది.

ఎక్కువమంది టీనేజర్‌లు ఈ కోర్సును తీసుకోవడం, వారి కోసం మరియు ఇతరుల కొరకు తెలివైన ఆన్‌లైన్ ఎంపికలు చేసేవిధంగా చేయడమే ద కీస్ కొరకు మా లక్ష్యం. అర్థవంతమైన సంభాషణలను పెంచడానికి మరియు కొన్ని సున్నితమైన సమస్యలను కలిసి పరిష్కరించుకోవడానికి, వారు తల్లిదండ్రులు, సంరక్షకుడు లేదా ఇతర నమ్మకమైన వయోజనుడి ద్వారా ఈ కోర్సును తీసుకుంటారు. ప్రమాదాలను గుర్తించడం, తమను తాము రక్షించుకోవడానికి సాయపడేందుకు చర్యలు తీసుకోవడానికి అవసరమైన విశ్వాసాన్ని వారిలో కలిగించడానికి మేం టీనేజర్‌లకు జ్ఞానం మరియు నైపుణ్యాలపరంగా సాయపడాలని కోరుకుంటున్నాం. thekeys.snapchat.comవద్ద మరింత తెలుసుకోండి. 

ఫ్యామిలీ సెంటర్

ఫ్యామిలీ సెంటర్ అనేది Snapchat యొక్క తల్లిదండ్రుల టూల్, ఇది తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు ఇతర నమ్మకమైన పెద్దవారికి Snapchatలో వారి టీనేజ్ స్నేహితులు మరియు కార్యకలాపాల గురించి అవలోకనాన్ని అందిస్తుంది, అదేసమయంలో టీనేజర్‌ల వాస్తవ సందేశాలను ప్రైవేట్‌గా ఉంచుతుంది. 2022లో ప్రారంభించిన, ఫ్యామిలీ సెంటర్ యువత సందేశాలను వెల్లడించకుండానే, గత ఏడురోజుల్లో వారు Snapchatలో ఎవరితో స్నేహంగా ఉన్నారు మరియు ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నారనేది చూడటానికి అనుమతిస్తుంది. ఫ్యామిలీ సెంటర్ ముఖ్య లక్ష్యం సమతుల్యత - వారి వ్యక్తిగత అభివృద్ధిలో కీలకమైన సమయంలో టీనేజర్‌ల గోప్యతా అవసరాన్ని సమతుల్యం చేయడం, అదే సమయంలో తల్లిదండ్రులకు వారి టీనేజ్ Snapchat ఫ్రెండ్స్ మరియు కమ్యూనికేషన్‌ల పునరావృతం గురించి అవలోకనాన్ని అందించడం.

ఫ్యామిలీ సెంటర్ రిలీజ్ చేసినప్పటి నుంచి మేం Snapchat యొక్క సంభాషణా చాట్‌బోట్ అయిన My AIతో నిమగ్నమయ్యే టీనేజ్ సామర్థ్యాన్ని పెద్దలకు నిలిపివేసే సామర్థ్యం, అలానే Snap మ్యాప్‌పై టీనేజర్‌ల లొకేషన్‌ను చూడటాన్ని అభ్యర్థించడంతో సహా మేం కొత్త ఫీచర్‌లు మరియు కార్యాచరణను జోడించడం కొనసాగించాం; Snapchat కొరకు రిజిస్టర్ చేసుకున్నప్పుడు, వారు నమోదు చేసిన టీనేజర్‌ల పుట్టిన తేదీ మరియు పుట్టిన సంవత్సరాన్ని చూడటం. Snapchatలో ఒక వయోజనుడు టీనేజర్‌తో కనెక్ట్ కావడానికి అవసరమైన కనీస వయస్సును మేం 18 సంవత్సరాలకు తగ్గించాం, దీని వల్ల తోబుట్టువులు, బంధువులు మరియు ఇతర కుటుంబసభ్యులకు (Snapchatతో మరింత సౌకర్యవంతంగా ఉండవచ్చు) యాప్‌పై ‘‘టీనేజర్‌ల వెనుక ఉండటానికి’’ మార్గం సుగమం చేసింది.

ప్రపంచ దయా దినోత్సవం నుంచి సురక్షితమైన ఇంటర్నెట్ డే వరకు

మూడు నెలల్లోపు, మనం అంతర్జాతీ సేఫర్ ఇంటర్నెట్ డే (SID) 22వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. SID 2026లో, మేం మా 2025 డిజిటల్ వెల్-బీయింగ్ అధ్యయనం యొక్క పూర్తి ఫలితాలను విడుదల చేస్తాం. అప్పటి వరకు, Snapchat మరియు డిజిటల్ ప్రదేశాల్లో ఆన్‌లైన్ భద్రత, సృజనాత్మకత మరియు కనెక్షన్‌కు ఒక గ్లోబల్ సంస్కృతిని పెంపొందించడానికి సాయపడేందుకు - యాప్‌లోను మరియు ఆన్‌లైన్‌లోనూ- మేం అందించే టూల్స్ మరియు వనరులను టీనేజర్‌లు, తల్లిదండ్రులు మరియు ఇతర పెద్దవారు ఉపయోగించుకోవాలని మేం ప్రోత్సహిస్తున్నాం.

-జాక్వెలిన్ బీచార్, ప్లాట్‌ఫారమ్ సేఫ్టీ యొక్క గ్లోబల్ హెడ్

తిరిగి వార్తలకు