logoSnap Values

AI లిటరసీ ఎందుకు కొత్త భద్రతా అవసరంగా మారింది

17 ఆగస్టు, 2026

డిజిటల్ ప్రపంచంలో యువత అభివృద్ధి చెందడంలో సహాయపడటంలో ఆన్‌లైన్ జీవితాన్ని సహజంగా మంచిది లేదా చెడుగా చిత్రీకరించే సరళమైన కథనాలకు అతీతంగా చూడటం కూడా ఒక భాగం. వారు పురోగమించడానికి ఏది తోడ్పడుతుందో అర్థం చేసుకోవడానికి, జనరేషన్ Z యొక్క ప్రామాణికమైన, రోజువారీ అనుభవాలపైన కూడా మనం దృష్టి పెట్టాలి. మనం జెనరేటివ్ AI యొక్క వేగవంతమైన అభివృద్ధితో నిర్వచించిన కొత్త యుగంలోనికి మనం ప్రవేశిస్తున్న తరుణంలో, మా భద్రతా పనిని నిష్పాక్షిక పరిశోధనలో ఆధారపడేలా చేసుకోవడానికి మా నిబద్ధత ఇంతకుముందు కంటే మరింత క్లిష్టమైనది - Snapchat ప్రామాణికత, కనెక్షన్, సమ్మేళనం మరియు ప్రాముఖ్యతపై దృష్టి సారించిన కమ్యూనికేషన్‌ల సర్వీస్‌గా కొనసాగేలా చూడటానికి ఇది సహాయపడుతుంది.

ఈ రోజు, మేం మా డిజిటల్ వెల్-బీయింగ్ ఇండెక్స్ (DWBI) అధ్యయన ఐదవ మరియు ఆఖరి సంవత్సరం నుండి కొన్ని కొత్త అవలోకనాలను పంచుకుంటున్నాం, ప్రత్యేకించి AI-ఉత్పన్నం చేసిన కంటెంట్ మారుతున్న పరిస్థితులు మరియు వ్యక్తిగత సంబంధాలపై దాని సమర్థతపై కేంద్రీకరించిన ఫలితాలను అందిస్తున్నాం.

గత ఐదేళ్లుగా, జనరేషన్ Z యొక్క ఆన్‌లైన్ మానసిక శ్రేయస్సును ట్రాక్ చేయడానికి మరియు కొలవడానికి Snap ప్లాట్‌ఫారమ్-అగ్నోస్టిక్ పరిశోధనను నిర్వహించింది. యువత డిజిటల్ అలవాట్లు మరియు పద్ధతుల గురించి ప్రపంచవ్యాప్త సాక్ష్యాలకు ఆధారాలను జోడించడానికి మేం ఈ సర్వే నిర్వహిస్తున్నాం, ఇది అభివృద్ధి చెందుతున్న ఆందోళనల గురించి అవగాహన పెంచడానికి సహాయపడుతుంది, తద్వారా తల్లిదండ్రులు, విద్యావేత్తలు, టెక్నాలజీ కంపెనీలు, ప్రభుత్వాలు మరియు పౌర సమాజం ప్రమాదాలను తగ్గించడానికి, సంభావ్య నష్టాన్ని తగ్గించడానికి మరియు పునరావృత ఘటనలను నిరోధించడానికి మరింత ప్రభావవంతంగా పనిచేయగలవు. DWBI Snapchatతో సహా ఏదైనా ఒక్క ప్లాట్‌ఫారంపై దృష్టి పెట్టడానికి బదులుగా, విస్తృత డిజిటల్ ఎకోసిస్టమ్ వ్యాప్తంగా ఆరు దేశాల్లోని 13 నుండి 24 ఏళ్ల వయస్సు గల పిల్లల అనుభవాలను పరిశీలిస్తుంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, యూకే మరియు U.S. నుండి వచ్చిన తాజా ఫలితాల్లో జనరేషన్ Z మధ్య డీప్‌ఫేక్ చిత్రాల సృష్టించడం మరియు పంపిణీకి సంబంధించిన కొత్త అంతర్దృష్టులు ఉన్నాయి.

డీప్ ఫేక్‌ల వాస్తవికత


AIకు సంబంధించిన బహిరంగ చర్చ తరచుగా అపరిమితమైన ఆశావాదం మరియు తీవ్రమైన ఆందోళనల మధ్య ఊగిసలాడుతుంది. ఏదైనా తీవ్రమైన దృక్పథంపై ఆధారపడటానికి బదులుగా, తాజా DWBI ఫలితాలు ఆరు భౌగోళిక ప్రాంతాల్లోని 13 నుండి 24 ఏళ్ల వయస్సు గల వారు జెనరేటివ్ AIతో ఎలా మమేకం అవుతున్నారనే దానికి ఆధారాలతో కూడిన దృక్పథాన్ని అందిస్తాయి. ఆ ఫలితాలు ఒక సంక్లిష్టమైన మరియు కొన్ని సమయాల్లో, డీప్ ఫేక్‌లతో కూడిన పీర్-టు-పీర్ ఇంటరాక్షన్‌ల గురించి ఆందోళనకరమైన చిత్రాన్ని వెల్లడిస్తాయి. ఉదాహరణకు:

  • 13 నుండి 24 ఏళ్ల వయస్సు గల ప్రతిస్పందకుల్లో దాదాపు మూడో వంతు (30%) మంది వేరొకరి డీప్‌ఫేక్‌ను సృష్టించినట్లుగా నివేదించారు

  • డీప్ నకిలీ సృష్టించిన వారిలో సగం కంటే ఎక్కువ మంది (53%) ఈ చర్య తమ సామాజిక వర్గాల్లో “నాటకీయ పరిణామాలకు” లేదా “వివాదాల” కు దారితీసినట్లుగా నివేదిస్తారు, మరియు

  • మెజారిటీ ప్రజలు సృజనాత్మకత, వినోదం మరియు కాలక్షేపం కోసం జనరేటివ్ AI టూల్స్ ఉపయోగించినప్పటికీ, మూడో వంతు కంటే ఎక్కువ మంది (35% నికర) తాము సృష్టించిన డీప్‌ఫేక్‌లు హానికరమైన ఉద్దేశ్యంతో చేసినట్లుగా పేర్కొన్నారు: ప్రత్యేకించి, ఒకరిని తక్కువగా చేసి చూపించడానికి లేదా వారిని బాధపెట్టడానికి (12%), ప్రతీకారంగా (12%), లేదా మరొకరిని ఏడిపించడానికి లేదా వేధించడానికి (11%). 

తమకు సంబంధించిన లైంగిక డీప్ ఫేక్‌లకు వారు నిర్ధిష్టంగా ఎలా స్పందిస్తారని అడిగినప్పుడు, మైనర్ వయస్సు గల టీనేజర్లలో అత్యధిక మంది (81% నికర) తాము ఎవరితోనైనా మాట్లాడతామని, అంటే తల్లిదండ్రులు (65%) అని పేర్కొన్నారు, అదే సమయంలో 10 మంది Gen Z యువతలో ఏడుగురు (70%) తాము దానిని రిపోర్ట్ చేస్తామని చెప్పారు, చట్ట అమలు సంస్థలు (53%) మరియు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్ (51%) వారి ప్రధాన మార్గాలుగా ఉన్నాయి. 10 మైనర్ టీనేజర్లలో ఒకరు కంటే ఎక్కువ (18%) మరియు 18 నుండి 24 ఏళ్ల వయస్సు గల వారిలో ఇద్దరు కంటే ఎక్కువ (22%) తాము దానిని విస్మరిస్తామని లేదా పేర్కొన్న చర్యల్లో దేనిని తీసుకోమని చెప్పారు. దిగువ ఛార్ట్ చర్య కోసం అందించిన ఎంపికలను వివరిస్తుంది.

ఈ ఫలితాలు ఒక క్లిష్టమైన సత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి: 21వ శతాబ్దంలో డిజిటల్ సంక్షేమానికి సంప్రదాయ భద్రతా సాధనాలు మరియు వనరుల కంటే ఎక్కువ అవసరం; దీనికి లోతైన, ఆచరణాత్మక AI అక్షరాస్యత అవసరం. 30% మంది యువత తమ తోటివారికి సంబంధించిన సింథటిక్ మీడియాను రూపొందించినట్లు నివేదించినప్పుడు, ఆ చర్య వ్యక్తిగత సంబంధాలు, ప్రతిష్టలు మరియు తమను ఇతరులు ఎలా చిత్రీకరిస్తున్నారు అనే దానిపై ఒక వ్యక్తికి ఉండే నియంత్రణ భావనపై తీవ్ర ప్రభావాలను చూపే అవకాశం ఉంది.

దానికి అనుగుణంగా, విధానపరమైన సంభాషణలు భయం ఆధారిత ప్రతిచర్యల నుండి దూరంగా జరిగి, నేటి ఆన్‌లైన్ యువత యొక్క “సమగ్ర వ్యక్తిత్వాన్ని” ప్రతిబింబించే ఒక ఫ్రేమ్‌వర్క్ దిశగా సాగాలి. మనం దీనిని మూడు ప్రధాన భాగాలుగా పరిగణించవచ్చు:

  1. AI అక్షరాస్యత: AI ని ఎలా ఉపయోగించాలని మాత్రమే కాకుండా, వారి సమ్మతి లేకుండా ఇతరులకు ఇబ్బంది కలిగించే కంటెంట్‌ను సృష్టించడం వల్ల కలిగే నైతిక మరియు సామాజిక పరిణామాలను అర్థం చేసుకోవడంలో యువతకు సాయపడటం.

  2. వ్యక్తిగత నియంత్రణ: సరిహద్దులను గుర్తించడానికి మరియు వారి స్వంత డిజిటల్ సారూప్యతలపై నియంత్రణను కొనసాగించడానికి యువతకు సాధికారత కల్పించడం, మరియు

  3. బహిరంగ కమ్యూనికేషన్: టీనేజర్‌లు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు ఇతర విశ్వసనీయ పెద్దలు డిజిటల్ ఇంటరాక్షన్‌‌ల నాణ్యత మరియు పరిమాణం గురించి బహిరంగంగా, ఆలోచనాత్మకంగా చర్చించుకునేలా ప్రోత్సహించడం, మరియు "హాస్యం కోసం" సృష్టించిన ఏ డీఫ్‌ఫేక్ అయినా ఇతరులపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని గుర్తించడం.

యాదృచ్ఛికంగా, AI సాధనాలను సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ఎక్కడ మరియు ఎవరి నుండి నేర్చుకుంటున్నారని అడిగినప్పుడు, 13 నుండి 24 ఏళ్ల వయస్సు గల 10 మందిలో ఎనిమిది మంది (81% నికర) తామే స్వయంగా నేర్చుకున్నట్లుగా పేర్కొన్నారు. 13 నుండి 17 ఏళ్ల వయస్సు గల వారిలో నాలుగింట ఒక వంతు (27%) మంది తాము తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటున్నట్లుగా పేర్కొన్నారు, అదే సమయంలో టీనేజర్లు (11%) మరియు యువత (10%) ఇద్దరి నాలెడ్జ్ బేస్‌లలోనూ ఉపాధ్యాయుల ద్వారా లభించే జ్ఞానం పదింట ఒక వంతుగా ఉంది.

ఈ ఫలితాలు విభిన్న ప్లాట్‌ఫామ్స్‌లో జనరేషన్ Z ఆన్‌లైన్ మానసిక సంక్షేమంపై Snap నిర్వహించిన ఐదేళ్ల అధ్యయనంలో భాగం, అలానే ఆరు దేశాల్లో టీనేజర్లు (13-17 సంవత్సరాలు) మరియు యువవయస్కులు (18-24 వయస్సు) ఆన్‌లైన్‌లో ఏవిధంగా గడుపుతున్నారనేది అంచనా వేసే మా డిజిటల్ వెల్-బీయింగ్ ఇండెక్స్ (DWBI) యొక్క తాజా మరియు చివరి భాగాన్ని సూచిస్తాయి. మేము 13 నుండి 19 ఏళ్ల వయస్సు గల టీనేజర్ల తల్లిదండ్రులను వారి పిల్లల ఆన్‌లైన్ అనుభవాల గురించి కూడా సర్వే చేస్తాము. ఈ తాజా పోల్ 11 మే నుంచి 30 మే, 2026 మధ్య నిర్వహించబడింది, మూడు డెమోగ్రాఫిక్స్ మరియు ఆరు భౌగోళిక ప్రాంతాలకు చెందిన 9,005 ప్రతిస్పందకులు చేర్చబడ్డారు. ప్రతి దేశం మరియు మొత్తం ఆరు దేశాలను కలిపిన ఉమ్మడి తాజా DWBI రీడింగ్‌తో సహా పూర్తి ఫలితాలు ఫిబ్రవరి 2027లో జరిగే సేఫర్ ఇంటర్నెట్ డే నాడు విడుదల చేయబడతాయి. ఈ సమస్యల్లో అనేక అంశాలపై ప్రపంచవ్యాప్తంగా నిరంతరం చర్చ జరుగుతున్నందున, ఈ AI సంబంధిత ఫలితాలను ముందస్తుగా అందుబాటులోనికి తీసుకొని రావాలని మేం నిర్ణయించుకున్నాం..

ఆన్‌లైన్ పురోగతికి అంకితభావం


డిజిటల్ శ్రేయస్సుపై అధ్యయనం చేసిన ఈ ఐదేళ్ల అధ్యాయాన్ని మేం ముగించాం మరియు రాబోయే అనేక సంవత్సరాల కోసం మా పరిశోధనా దృష్టిని విస్తరిస్తున్న తరుణంలో, మా ఎకోసిస్టమ్ వ్యాప్తంగా స్పష్టమైన లక్ష్యం ఉంది: యువత వీలైనంత సురక్షితంగా మరియు ప్రామాణికంగా నేర్చుకోవడానికి, నవ్వుకోవడానికి, పరస్పరం అనుసంధానం కావడానికి తగిన ఆన్‌లైన్ వేదికలను నిర్మించడం. డీప్ ఫేక్‌ల పెరుగుదల సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొలదీ, మన కార్యాచరణ మరియు విద్యాపరమైన ప్రయత్నాలు దానితో అనుగుణంగా అభివృద్ధి చెందాలనే ఒక రిమైండర్‌గా పనిచేస్తుంది. అక్షరాస్యత, తట్టుకునే శక్తి మరియు విమర్శనాత్మక ఆలోచనలపై దృష్టి పెట్టడం ద్వారా, తరువాతి తరం ఆన్‌లైన్‌లో కేవలం "నెట్టుకురావడం" మాత్రమే కాదు, నిజంగా ఉన్నత స్థాయికి ఎదిగేలా మేము తోడ్పడగలము.

ఈ ప్రయత్నాలకు మద్దతుగా, గత నెల, Snap పూర్తిగా AI-సృష్టించిన వీడియోలు Snapchat యొక్క స్పాట్‌లైట్ ఫీచర్‌పై సిఫార్సు చేయడానికి అర్హత ఉండదని ప్రకటించింది. వాస్తవానికి, ఆన్‌లైన్ వేదికలవ్యాప్తంగా నాణ్యత లేని, పునరావృతమయ్యే, AI-సృష్టించిన కంటెంట్ రోజురోజుకు మరింత పెరిగిపోతుండటంతో, నిజమైన వ్యక్తుల నుండి ప్రజలు ప్రామాణికమైన సృజనాత్మకతను కనుగొనగల ప్రదేశంగా Spotlight కొనసాగించాలని Snap కోరుకుంటోంది. AI-జనరేటెడ్ మెటీరియల్ గురించి తల్లిదండ్రులు మరియు టీనేజర్ల కోసం ఒక సంక్షిప్త ఫాక్ట్ షీట్ కూడా మేం సృష్టించాం. “ఆగండి. ఆలోచించండి. ఇది AI కావచ్చు?” AI టూల్స్‌ను సురక్షితంగా మరియు బాధ్యతాయుతంగా ఉపయోగించడానికి టీనేజర్లు, తల్లిదండ్రులు మరియు ఇతర విశ్వసనీయ పెద్దల మధ్య సంభాషణలను రేకెత్తించడానికి రూపొందించబడింది. మేము అనేక ఇతర సమూహాలు మరియు సంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నాము, మరియు పిల్లలపై లైంగిక దోపిడీ మరియు వేధింపుల గురించి అవగాహన పెంచే U.S. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ యొక్క "Know2Protect" ప్రచారానికి మద్దతు ఇచ్చిన మొట్టమొదటి సంస్థగా నిలిచాము. Know2Protect ఇక్కడ డీప్‌‌ఫేక్‌లపై ఒక ప్రైమర్‌ను ప్రచురించింది.   

పబ్లిక్ పాలసీ రంగంలో కూడా Snap మద్దతు ఇచ్చింది, 2025 మే నెలలో అమలులోకి వచ్చిన Take It Down Act కు Snap మద్దతు ఇచ్చింది. ఈ చట్టం, కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన కంటెంట్‌తో సహా సమ్మతి లేని అంతరంగిక చిత్రాల సమస్యను పరిష్కరించడానికి U.S. ఫెడరల్ ప్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. ఆ నగ్న లేదా వ్యక్తిగత చిత్రాలు అసలైనవా లేదా కృత్రిమంగా సృష్టించబడినవి అయినా, సమ్మతి లేకుండా వాటిని ప్రచురించడం లేదా ప్రచురిస్తామని బెదిరించడం ఫెడరల్ నేరంగా పరిగణిస్తుంది, అంతేకాకుండా, బాధ్యత కలిగిన ఫ్లాట్‌ఫారాలు నివేదించే ప్రక్రియను అందుబాటులో ఉంచాలని మరియు నివేదించిన కంటెంట్‌ను 48 గంటల్లో తొలగించాలని కూడా ఇది నిర్దేశిస్తుంది.

సేఫర్ ఇంటర్నెట్ డే 2026 సందర్భంగా ప్రారంభించిన “నో టు న్యూడిఫై” ప్రచారంలో ఇలాంటి ఆందోళనలే ప్రతిబింబించాయి, ఇది పిల్లల భద్రత మరియు పౌర సమాజ సంస్థలను ఒకచోట చేర్చింది, వీటిలో చాలా మంది Snap భాగస్వాములు మరియు సహకారులుగా ఉన్నారు WeProtect గ్లోబల్ అలయన్స్, INHOPE, ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్, NCMEC, చైల్డ్ హెల్ప్‌లైన్ ఇంటర్నేషనల్, Offlimits మరియు Safe Onlineలు AI న్యూడిఫికేషన్ టూల్స్‌పై నిషేధం విధించాలని పిలుపునిచ్చాయి. “న్యూడిఫై” యాప్‌లు అని పిలవబడేవి వాస్తవానికి హానిచేయని ప్రయోగాలు కావు, కానీ బదులుగా సాధారణ ఫోటోల నుండి సమ్మతి లేని లైంగిక చిత్రాలను సృష్టించడానికి ఇవి ఉపయోగించబడతాయని ఈ ప్రచారం పేర్కొంది. అంతేకాకుండా మహిళలు, బాలికలు మరియు పిల్లలను ప్రభావితం చేసే వేధింపులు, బలవంతం చేయడం, లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగాలకు ఇవి ఎక్కువగా కారణమవుతున్నాయి.

Snapchatలో అటువంటి మెటీరియల్ వ్యాప్తిని పరిమితం చేయడానికి రూపొందించిన ఆచరణాత్మక క్రాస్-ఇండస్ట్రీ కార్యక్రమాలలో కూడా Snap పాల్గొంటుంది. మేం మైనర్ల కోసం NCMEC యొక్క Take It Down కార్యక్రమం మరియు 18+ కోసం SWGfL యొక్క StopNCII ప్రయత్నంలో సభ్యులుగా ఉన్నాము. మా నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్‌ను తొలగించడానికి మరియు ఒకే రకమైన అంతరంగిక చిత్రాల నకళ్లను గుర్తించడంలో సహాయపడేందుకు, మేము ప్రత్యేకమైన డిజిటల్ సంతకాలు లేదా "హాష్‌లను" స్వీకరిస్తూ వాటిని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాము. ఈ ప్రయత్నాలకు ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే అవి కేవలం ప్రాథమిక గుర్తింపుపై మాత్రమే కాకుండా, తెలిసిన సన్నిహిత చిత్రాలు మరియు లైంగిక డీప్‌ఫేక్స్ వ్యాప్తి చెందడం మొదలైన తర్వాత అవి మళ్లీ ప్రసారం కాకుండా నిరోధించడంపై కూడా దృష్టి సారిస్తాయి.

– జాక్వెలిన్ బీచార్, ప్లాట్‌ఫారం భద్రత యొక్క గ్లోబల్ హెడ్, Snap Inc.

తిరిగి వార్తలకు