యుకె సాధారణ ఎన్నికలలో Snap పౌర నిమగ్నత కార్యాచరణ, ప్రతి 5 నిమిషాలకు 3000 మంది యువత ఓటు వేసేందుకై నమోదు చేసుకొనేందుకు మద్దతునిచ్చింది

28 జూలై, 2024

పౌర-నిమగ్నత అనేది, స్వీయ వ్యక్తీకరణకు సంబంధించి Snapchat లోని ప్రధాన విలువలలో అత్యంత శక్తిమంతమైన రూపమని Snapలో మేము విశ్వసిస్తాము. జూలై 4న జరగబోయే యు.కె సాధారణ ఎన్నికలకు ముందు, యువ ఓటర్లను సమీకరించి, వారికి దీనిపై అవగాహన కల్పించి, పోలింగ్ రోజువరకు దీన్ని కొనసాగించడమనేది మా విభిన్న బాధ్యత అని మేము గుర్తించాము. దీనిలో భాగంగా మేము 13-24 వయస్సులోని వారిని 90% వరకు చేరుకొన్నాము మరియు Snapchat పై యు.కె.లో 21 లక్షల మంది నెలవారీ క్రియాశీల వినియోగదారులను కలిగివున్నాము.

మేము,My Life My Say (MLMS) అనే యువత ఓటర్-నమోదుపై దృష్టిపెట్టిన ఒక లాభాపేక్ష-రహిత సంస్థతో భాగస్వామ్యం కలిగివున్నందుకు గర్వపడుతున్నాము. యువజనులను విశేషంగా ప్రభావితం చేసే అద్దెల ధరలు మరియు వాతావరణంలో మార్పులు వంటి అంశాలపై యువత, ’ఒక Xని ఇవ్వండి’కి ప్రోత్సహించే ప్రచారానిని మేము మా మద్దతు ఇస్తున్నాము.

ఈ భాగస్వామ్యంలో భాగంగా, Snap ఒక ప్రత్యేక ఆగ్మెంటేడ్ రియాలిటీ (AR) ఫిల్టర్ అభివృద్ధి చేసి, జూన్ 18న నేషనల్ ఓటర్ రిజిస్ట్రేషన్ డేకు ముందు విడుదల చేసింది. ఇది, యుకెలో 18-34 సంవత్సరాల వయస్సులోనివారు రికార్డుస్థాయిలో 16.4 లక్షల మంది ఓటర్ నమోదుకు విశేషంగా దోహదం చేసింది. ఈ ప్రచారం మరియు ఫిల్టర్‌లవల్ల, Snapchat ద్వారా ప్రతి ఐదు నిమిషాలకు అసాధారణ స్థాయిలో 3,000మంది ప్రజలు ఓటు వేయడానికి నమోదు చేసుకొన్నారు!

పోలింగ్ రోజుకై వేచిచూడటంలో భాగంగా మేము మరియు MLMS కలిసి ఒక ఇంటరాక్టివ్ లెన్స్‌ను ప్రారంభించాము. ఇది వారు ఓటు వేయడానికి బయటకు రావడానికి ప్రోత్సహించడంతోపాటు, వారి స్థానిక పోలింగ్ స్టేషన్ వంటి సమాచారం కూడా వారికి అందజేస్తుంది. జూలై 4న, యుకె Snapచాటర్లు ఓటువేయడాన్ని గుర్తు చేసేందుకు మేము వారితో ఈ లెన్స్‌ను కూడా పంచుకొంటాము.

Snapకు ఎంతో ముఖ్యమైన ఒక వార్తా సంబంధిత భాగస్వామి BBCతో కూడా మేము జట్టుకట్టినందుకు, తద్వారా ఒక కౌంట్‌డౌన్ AR ఫిల్టర్ ప్రారంభించి, పోలింగ్ రోజున ఉత్సాహం రేకెత్తించేందుకు కృషి చేస్తామని ఉత్సుకతతో ప్రకటిస్తున్నాము. BBC కి ఒక ప్రత్యేక సాధారణ ఎన్నికల హబ్ కలిగివుంది మరియు ఇది యుకె అంతటా ఓటర్లకు కీలక సమాచారం అందించే వనరు - ఈ ఫిల్టర్ BBC యొక్క ఓటింగ్ మార్గదర్శికి లింక్ చేయబడింది మరియు యువజనులను ఎన్నికలకు సమాయత్తం చేయడంలో సహాయమందించడంతోపాటు, పోలింగ్ రోజున ఏవి చేయవచ్చు, ఏవి చేయకూడదు అనే వాటిగురించి సమాచారమందిస్తుంది. మా AR భాగస్వామ్య ఫిల్టర్ జూలై 4వరకు అన్నిరోజులలో BBC’ యొక్క అన్ని ఛానల్స్‌పై పంచుకోబడతాయి.

ఈ భాగస్వామ్యం, మా కమ్యూనిటీ ఎన్నికలకు సంబంధించిన వివిధ పరిమాణాలను అనుసరించి, వాటిలో నిమగ్నమవడం కొనసాగించేందుకు ఇప్పటికే మాతో జట్టుకట్టిన The Rest is Politics, The Telegraph, Sky News UK & Sky Breaking News, The Guardian, మరియు The Mirror వంటి విస్తృత శ్రేణిలోని మీడియా ప్రచురణకర్తలకు అదనంగా ఉంటుంది.

సాధారణ ఎన్నికలపై తప్పుడు సమాచారాన్ని సరిగా పరిష్కరించడం


యుకెలో జూలై 4న జరిగే ఎన్నికలతోసహా, ఈ సంవత్సరంలో ఏదో ఒక సమయంలో ప్రపంచంలోని దాదాపు 50కి పైగా దేశాలలో జరుగుతున్నందున, 2024ని ప్రపంచ ఎన్నికల సంవత్సరమని చెప్పవచ్చు, Snapచాటర్లను తప్పుడు సమాచారం నుండి కాపాడేందుకు, మరియు ఎన్నికల సమగ్రతను కాపాడేందుకు మద్దతిచేందుకు ఈ సంవత్సరం ఆరంభంలో మేము ఈ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు మేము ఏం చేస్తున్నాము అనేదానిని Snapలో మేము నిర్ణయించుకొన్నాము. ఈ అప్‌డేట్, మా అప్రోచ్‍ యొక్క ప్రభావాన్ని వెల్లడిచేసిన ఇటీవలి EU ఎన్నికల బ్లాగ్ పోస్ట్ తరువాత ఉంటుంది.

తప్పుడు సమాచారం వ్యాప్తిని నివారించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. మా కమ్యూనిటీ మార్గదర్శకాలుఎల్లప్పుడూ తప్పుడు సమాచార వ్యాప్తి మరియు ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదారి పట్టించే కంటెంట్‍ను నిషేధిస్తాయి - వీటిలో AI-ఆధారిత లేదా మనుష్యులచే సృష్టించబడినదైనా డీప్‍ఫేక్స్ లేదా మోసపూరితంగా మార్చబడిన కంటెంట్ వంటివి ఉంటాయి.

ఎన్నికల సమయంలో రాజకీయ పక్షాలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందని మేము గుర్తించాము, మరియు Snap యొక్క ప్లాట్‌ఫామ్ తప్పుడు సమాచారం వ్యాప్తిని నివారించడానికై రూపొందించబడినప్పటికీ, యుకెలోని మా కమ్యూనిటీని మరింత భద్రంగా మరియు సరైన సమాచారం పొందేలా చర్యలు చేపట్టాము. దీనిలో ఇవి ఉంటాయి:

  • మేము, యుకె అంతటా రాజకీయ ప్రకటనలలోని వాస్తవాలను తనిఖీ చేయడంలో మద్దతునిచ్చే, ఒక ప్రముఖ వాస్తవ-తనిఖీ సంస్థ Logically Factsతో భాగస్వామ్యం చేసుకొన్నాము మరియు ఈ సంస్థThe International Fact-Checking Network (IFCN) యొక్క ధ్రువీకరించబడిన సిగ్నేటరీ.

  • మా చాట్‍బాట్ My AIని రాజకీయపరమైన అంశాలు మరియు వ్యక్తులపై చర్చలు జరపకుండా ఉండేందుకు సూచనలివ్వడం.

  • యుకె Snap స్టార్స్ కు Snapchatపై రాజకీయపరమైన కంటెంట్‍పై స్పష్టమైన విధానాన్ని సెట్ చేయడం మరియు ఎన్నిక మరియు వాటి పోస్టులకు సంబంధించి ఏవైనా ప్రశ్నలుంటే పైస్థాయికి చేరుకోవడానికి కాంటాక్ట్ పాయింట్‌లను అందించడం.

ఈ చర్యలు మా కమ్యూనిటీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రోత్సహిస్తుందని మరియు Snapchatను ఒక భద్రమైన, బాధ్యతాయుతమైన, ఖచ్చితమైన, మరియు సరైన వార్తలు మరియు సమాచారం అందించే ప్రదేశంగా ఉంచుతాయని మేము విశ్వసిస్తున్నాము.

తిరిగి వార్తలకు