Privacy, Safety, and Policy Hub

ఇవాన్ స్పీగెల్ యొక్క లిఖితపూర్వక సెనేట్ కాంగ్రెస్ సంబంధిత వాంగ్మూలం

31 జనవరి, 2024

ఈ రోజున, మా సహ వ్యవస్థాపకుడు మరియు CEO ఇవాన్ స్పీగెల్, న్యాయవ్యవస్థపై యునైటెడ్ స్టేట్స్ సెనేట్ కమిటీ ముందు సాక్ష్యమివ్వటానికి ఇతర టెక్ ప్లాట్‌ఫామ్స్ తో చేరతారు. కమిటీకి ముందస్తుగానే సమర్పించబడిన విధంగా మీరు ఇవాన్ యొక్క పూర్తి లిఖితపూర్వక సాక్ష్యమును ఈ దిగువన చదువుకోవచ్చు.

***

చైర్మన్ డర్బిన్, ర్యాంకింగ్ సభ్యుడు గ్రామ్, మరియు కమిటీ యొక్క సభ్యులారా, Snapchat పై యువతను రక్షించడానికి మేము చేసిన ప్రయత్నాలపై మీకు అప్‌డేట్ చేయడానికై ఈ రోజు హాజరు కావడానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నేను ఇవాన్ స్పీగెల్, Snap యొక్క సహ వ్యవస్థాపకుడు మరియు CEO. మా సేవ అయిన Snapchat, తమ ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో కమ్యూనికేట్ చేయడానికి 20 మిలియన్ల మంది యుక్తవయస్కులతో సహా 100 మిలియన్లకు పైగా అమెరికన్లచే ఉపయోగించబడుతూ ఉంది. మన కమ్యూనిటీని సురక్షితంగా ఉంచడానికి గాను మేము ఒక అపారమైన బాధ్యత కలిగి ఉన్నాము.

Snapchat యొక్క స్థాయి మరియు విస్తృతమైన వాడకం అంటే చెడువ్యక్తులు మా సేవ ను దురుపయోగం చేయడానికి మరియు మన కమ్యూనిటీని అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారని మాకు తెలుసు. అందుకనే మేము మా భద్రతా సాధనాలను నిరంతరం మెరుగుపరుస్తూ మరియు ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతున్న ముప్పు సంస్కృతుల నుండి మన కమ్యూనిటీని రక్షించడంలో వెచ్చిస్తున్నాము. Snapchatters ని రక్షించడం మా నైతిక బాధ్యత మరియు వ్యాపారం లో తప్పనిసరి అంశం. మేము ఎదుర్కోవడానికి పని చేస్తున్న అతిపెద్ద బెదిరింపుల గురించి నేను మరింతగా తెలియజేయాలనుకుంటున్నాను, ఐతే మొదట నేను మా సేవ గురించి కొంత బ్యాక్గ్రౌండ్ ను ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే కమిటీ ముందు నేను హాజరు కావడం ఇదే మొదటిసారి.

నా సహ-వ్యవస్థాపకుడు బాబీ మర్ఫీ మరియు నేను 2011 లో మొదటగా Snapchat నిర్మించినప్పుడు, మేము కొంత భిన్నమైనది కావాలనుకున్నాము. మేము సోషల్ మీడియాతో పాటే పెరిగాము మరియు అది మాకు దారుణంగా అనిపించింది - ఒక పబ్లిక్, శాశ్వత, ప్రజాదరణ పోటీ నిరంతర తీర్పుతో నిండిపోయింది. సోషల్ మీడియా కచ్చితమైన చిత్రాల కోసం ఉండేది, నిజమైన స్నేహాలను బలోపేతం చేస్తుందని మేము నమ్మే ప్రతి రోజువారీ క్షణాలకు బదులుగా.

ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో కమ్యూనికేట్ చేయడానికి, క్షణాన్ని పంచుకోవడానికి, ఆ క్షణంలో ఉండటానికి, మరియు ప్రజలు తాము భౌతికంగా దూరం ఉన్నప్పటికీ కలిసి ఉన్నట్లుగా అనుభూతి చెందేలా సహాయపడేందుకు కొత్త మార్గాన్ని అందించడానికి మేము Snapchat నిర్మించాము. సగటున, ప్రజలు తమ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ తమ ఎక్కువ సమయాన్ని Snapchat పై గడుపుతారు. మేము నిష్క్రియాత్మక వినియోగానికి బదులుగా సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, కంటెంట్ ఫీడ్ కి బదులుగా కెమెరా లోనికి తెరుచుకోవటానికి Snapchat ని రూపొందించాము. వ్యక్తులు Snapchat పైన ఫ్రెండ్స్ తో తమ స్టోరీని పంచుకున్నప్పుడు, బహిరంగ లైక్స్ లేదా కామెంట్లు ఉండేవి కావు.

అశాశ్వతతను కావలించుకోవడం ద్వారా మరియు డిఫాల్ట్‌గా సందేశాలను తొలగించడం ద్వారా, మేము Snapchat కి ఎప్పటికీ రికార్డు చేయబడని లేదా ఎప్పటికీ సేవ్ చేయబడని ఫోన్ కాల్ లేదా ముఖాముఖి సంభాషణ యొక్క తేలికదనాన్ని అందించాము. ఇది లక్షలాది అమెరికన్లు తమ ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో నిజంగా తాము ఎలా అనుభూతి చెందుతున్నారో వ్యక్తపరచుకుంటూ మరింత సౌకర్యమైన భావన పొందడానికి సహాయపడింది. Snapchat కోసం వ్యక్తులు సైనప్ చేసినప్పుడు, సంభాషణలు డీఫాల్ట్ గా తొలగించబడినప్పటికీ, సందేశాలు స్వీకర్తచే సులభంగా సేవ్ చేయబడేలా లేదా స్క్రీన్ షాట్ చేయబడేలా ఉంటాయని మేము స్పష్టంగా తెలియజేస్తాము.

మేము కొత్త ఫీచర్లను నిర్మించేటప్పుడు, మా కమ్యూనిటీకి ఉత్తమంగా సేవ అందించడానికి మరియు Snapchat ని సురక్షితంగా ఉంచేలా సహాయపడటానికి మేము వ్యాపారం ట్రేడ్-ఆఫ్స్ చేస్తాము. ఉదాహరణకు, మేము మా కంటెంట్ సేవను నిర్మించేటప్పుడు, హానికరమైన కంటెంట్ వ్యాప్తిని నివారించడంలో సహాయపడటానికి ఇది విస్తృతముగా పంపిణీ చేయబడటానికి ముందు దీనిని మాకు మేముగా మధ్యస్థపరచడానికి మేము నిర్ణయించుకున్నాము. వినోదాత్మకంగా ఉండే మరియు మా కంటెంట్ మార్గదర్శకాలతో స్థిరంగా ఉండే కంటెంట్‌ను తయారు చేయడానికై వారిని ప్రోత్సహించడానికి మేము మీడియా ప్రచురణకర్తలు మరియు సృష్టికర్తలకు మా ఆదాయంలో కొంత వాటాను కూడా చెల్లిస్తాము.

ఫ్రెండ్స్ మధ్య కమ్యూనికేషన్‌ను ఎంపిక చేసుకునే ఆవశ్యకత ఉండే విధంగా మేము మా సేవను రూపొందించాము, అంటే టెక్స్ట్ మెసేజింగ్ లాగా కాకుండా వ్యక్తులు ఎవరితో కమ్యూనికేట్ చేసుకోవాలో ముందుగానే ఎంచుకోవాలని అర్థం, ఇక్కడ ఎవరైనా అపరిచితుడు తనకు ఫోన్ నెంబర్ ఉంటే చాలు, ఎవరికైనా సందేశం పంపించవచ్చు. ఫ్రెండ్ జాబితాలు Snapchat పైన ప్రైవేట్‌గా ఉంటాయి, అవి సామాజిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా Snapchat పైన ఒక వ్యక్తి యొక్క ఫ్రెండ్స్ ని కనుగొని వెంటాడే వారి సామర్థ్యాన్ని కూడా పరిమితం చేస్తాయి.

Snapchat అందరికీ సురక్షితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము మరియు అవాంఛిత పరిచయాన్ని నిరోధించడంలో మరియు వయస్సుకు సముచితమైన అనుభవాన్ని అందించడంలో సహాయపడటానికి మేము మైనర్లకు అదనపు రక్షణలను అందిస్తాము. Snapchat యొక్క డిఫాల్ట్ “నన్ను సంప్రదించండి” సెట్టింగ్లు అన్ని ఖాతాలకూ ఫ్రెండ్స్ మరియు ఫోన్ కాంటాక్టులు కు మాత్రమే సెట్ చేయబడ్డాయి మరియు విస్తరించడం సాధ్యపడదు. ఒక మైనర్ గనక తాను పరస్పర ఫ్రెండ్ ని పంచుకోని ఒకరి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అందుకున్నట్లయితే, వారు తనకు తెలిసిన వ్యక్తి అని నిర్ధారించుకోవడానికై, వారు కమ్యూనికేట్ చేసుకోవడం మొదలుపెట్టడానికి ముందే మేము ఒక హెచ్చరికను అందజేస్తాము. దీని ఫలితంగా, Snapchat పైన మైనర్ పిల్లలచే అందుకోబడే సుమారు 90% ఫ్రెండ్ అభ్యర్థనలు సామాన్యంగా కనీసం ఒక పరస్పర ఫ్రెండ్ ఉన్నవారి నుండి అయి ఉంటాయి. వ్యక్తులు తమకు ఇదివరకే పరిచయం లేని వారితో సంప్రదించడానికి సాధ్యమైనంత కష్టతరం చేయడమే మా లక్ష్యంగా ఉంటుంది.

అవాంఛిత కాంటాక్టు లేదా ఉల్లంఘించే కంటెంట్‌ను రిపోర్టు చేయమని మేము Snapchatters ని ప్రోత్సహిస్తాము మరియు ఆక్షేపణీయ అకౌంట్ ని మేము బ్లాక్ చేస్తాము. Snapchat అకౌంట్ లేకుండా ఉండి ఐతే రిపోర్ట్ చేయాలని అనుకునే వారి కోసం, మేము మా వెబ్‌సైట్ పైన రిపోర్టింగ్ టూల్స్ కూడా అందజేస్తాము. అన్ని నివేదికలు గోప్యంగా ఉంటాయి మరియు ప్రతి రిపోర్టును సమీక్షించి మరియు మా నియమాలు నిరంతరంగా అమలు చేయడానికి గాను మా ట్రస్ట్ మరియు భద్రత బృందం ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ 24 గంటలు, వారానికి ఏడు రోజులు పనిచేస్తుంది.

మేము చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన కంటెంట్‌పై చర్య తీసుకున్నప్పుడు, తమ పరిశోధనలో చట్ట అమలు యంత్రాంగానికి మద్దతు ఇవ్వడానికి మాకు వీలు కలిగించే ఒక పొడిగింపు వ్యవధి పాటు మేము ఆధారాలను నిలుపుకుంటాము. మరణ ప్రమాదం ఆసన్నమైన పరిస్థితి లేదా తీవ్రమైన శారీరక గాయంతో కూడి ఉండే ఏదైనా కంటెంటును మాయంతట మేము ముందుగానే చట్టాన్ని అమలు చేసే యంత్రాంగానికి తెలియజేస్తాము మరియు ముఖ్యంగా అత్యవసర డేటా డిస్క్లోజర్ అభ్యర్థనల పట్ల 30 నిముషాల లోపున స్పందిస్తాము. మేము Snapchat ని దురుపయోగం చేసే నేరస్థులను న్యాయం ముందుకు తీసుకురావాలనుకుంటున్నాము.

మా సేవ నుండి నిర్మూలించడానికి మేము పని చేస్తున్న కమ్యూనిటీకి మూడు ప్రధాన బెదిరింపులు ఉన్నాయి: దోపిడీ, పిల్లల లైంగిక వేధింపు సామాగ్రి మరియు చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల పంపిణీ.

మొదటిది ఆర్థికంగా ప్రేరేపించబడిన లైంగికచర్యల పెరుగుదలకు సంబంధించినది, ఇది నేరస్థులు ఒక సంభావ్య ప్రేమ ప్రయోజనాన్ని ఎరగా చూపించి, రాజీపడిన చిత్రాలను పంపించడానికి బాధితులను ఒప్పించే బ్లాక్‌మెయిల్ యొక్క ఒక రూపం. ఆ తర్వాత ఆ దుష్టులు చాట్ ద్వారా ఫోటోలు తీసి మరియు పంచుకోబడిన చిత్రాలను విడుదల చేస్తామని బెదిరిస్తారు మరియు తరచుగా బహుమతి కార్డుల రూపంలో చెల్లింపును డిమాండ్ చేస్తారు. ఈ ఉదంతాలలో చాలా వరకు యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉండి వెంటాడేవారు ఉంటారు, అది న్యాయబద్ధమైన ప్రక్రియ ద్వారా చట్టమును అమలు చేయు అధికార యంత్రాంగానికి మరింత సవాలుగా పరిణమిస్తుంది.

నానాటికీ పెరుగుతున్న ఈ సంక్షోభానికి ప్రతిస్పందనగా, ఈ దుష్టులను మాయంతట మేము ముందస్తుగా గుర్తించడానికి మరియు ఆ సంభాషణ దోపిడీ చర్యకు దారితీసే ముందుగానే జోక్యం చేసుకోవడానికి మేము మా సేవ పైన కొత్త సాధనాలను అభివృద్ధి చేశాము. మా కమ్యూనిటీచే వేధింపు లేదా లైంగిక కంటెంట్ మాకు రిపోర్టు చేయబడినప్పుడు, మా బృందం మామూలుగా 15 నిమిషాల లోపున చర్య తీసుకుంటూ త్వరితంగా పనిచేస్తుంది.

రెండవది, మా సేవ పైన దురుపయోగానికి సంబంధించిన చిత్రాలు మరియు వీడియోలను పంచుకోవడం ద్వారా లైంగిక దురుపయోగానికి గురైన పిల్లలను తిరిగి బలిపశువులను చేయాలనుకునే నేరస్థులను కూడా మేము గుర్తిస్తున్నాము. మేము తెలిసినట్టి పిల్లల లైంగిక దురుపయోగాల సామాగ్రి కోసం Snapchat కి చేసే ఇమేజ్ మరియు వీడియో అప్‌లోడ్‌లను స్కాన్ చేస్తాము మరియు దానిని తప్పిపోయిన మరియు దోపిడీకి గురైన పిల్లల జాతీయ కేంద్రానికి నివేదిస్తాము. 2023 లో మేము 1,000 కి పైగా అరెస్టులకు దారితీసిన 690,000 నివేదికలను తయారు చేశాము. తెలిసినట్టి బాలల లైంగిక దురుపయోగ చిత్రావళి అప్‌లోడ్‌లను స్కాన్ చేయకుండా మమ్మల్ని అడ్డుకునే విధంగా గుప్తీకరణను అమలు చేయడాన్ని మేము ముందుగా ఊహించడం లేదు.

మూడవది, గత సంవత్సరం 100,000 మందికి పైగా అమెరికన్ల ప్రాణాలను బలిగొన్న ఫెంటానిల్ మహమ్మారి కొనసాగుతూ మరియు విధ్వంసం చేస్తుండటం. మేము మా సేవ నుండి మాదకద్రవ్యాల డీలర్స్ మరియు మాదకద్రవ్యాల-సంబంధిత కంటెంట్‌ను తొలగించు నిర్ణయం తీసుకున్నాము. చట్టవిరుద్ధమైన మాదకద్రవ్య కంటెంట్ కోసం మేము మా సేవ ను మాయంతట మేమే ముందస్తుగా స్కాన్ చేస్తాము, డ్రగ్ డీలర్ అకౌంట్ లను డిజేబుల్ చేస్తాము మరియు మా సేవను ప్రాప్యత చేసుకోకుండా వారి పరికరాలను నిషేధిస్తాము, సాక్ష్యాలను నిక్షిప్తం చేస్తాము మరియు డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్‌తో సహా చట్ట అమలు అధికార యంత్రాంగానికి రెఫరల్స్ చేస్తాము. 2023 లో, మేము 2.2 మిలియన్ పైగా మాదకద్రవ్య-సంబంధిత కంటెంట్‌ను తొలగించాము, సంబంధిత 705,000 అకౌంట్ లను డిజేబుల్ చేశాము మరియు Snapchat ను ఉపయోగించడం నుండి ఆ అకౌంట్ లతో ముడిపడి ఉన్న పరికరాలను బ్లాక్ చేశాము.

మేము మాదకద్రవ్యాలకు సంబంధించిన శోధన పదాలను బ్లాక్ చేస్తాము మరియు మాదకద్రవ్యాల కోసం వెతుకుతున్న వ్యక్తులను మా సేవ పైన విద్యా విషయాలకు మళ్లిస్తాము. ఫెంటానిల్ ఒక విశిష్టమైన ముప్పు ను కలిగిస్తుంది, ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన ప్రాణాంతకం మరియు వీధిలో అందుబాటులో ఉండే ప్రతి రకం మత్తుమందు మరియు నకిలీ మాత్రలను లేస్ చేస్తుంది. అందుకనే విద్య చాలా ముఖ్యమైనదని మేము నమ్ముతాము మరియు మేము వన్ పిల్ కెన్ కిల్ వంటి ప్రజా అవగాహన ప్రచారోద్యమాలలో పెట్టుబడి చేశాము, అది నకిలీ మాత్రల వల్ల కలిగే ప్రమాదాలపై మా కమ్యూనిటీకి అవగాహన కల్పించడానికి Snapchat పైన మరియు ఫెంటానిల్ పై యాడ్ కౌన్సిల్ యొక్క రియల్ డీల్ పైన 260 మిలియన్ సార్లు వీక్షించబడింది.

iOS మరియు Android ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో భాగంగా అందుబాటులో ఉన్న తల్లిదండ్రుల నియంత్రణలు కాకుండా, యుక్తవయస్కులు Snapchat ను ఉపయోగిస్తున్న తీరును పర్యవేక్షించేందుకు మరింత సాధనాలను ఇవ్వడం ద్వారా మేము తల్లిదండ్రులను శక్తివంతం చేయడానికి కృషి చేశాము. తల్లిదండ్రులు ఫ్యామిలీ సెంటర్ ను ఉపయోగించుకొని తమ యుక్తవయస్సు పిల్లలు మా సేవను ఉపయోగించి ఎవరితోనైతే కమ్యూనికేట్ చేస్తున్నారో వారి జాబితాను వీక్షించవచ్చు. ఇది తల్లిదండ్రులు వాస్తవ ప్రపంచంలో తమ యుక్తవయస్సు పిల్లల కార్యకలాపాలను పర్యవేక్షించే తీరును పోలి ఉంటుంది - అక్కడ వారు తమ యుక్తవయస్సు పిల్లలు ఎవరు సమయాన్ని గడుపుతున్నారో తెలుసుకోవాలనుకోవచ్చు, అయితే ప్రతి ప్రైవేటు సంభాషణ మీద నిఘా ఉంచి వినవలసిన అవసరం ఉండదు. ఫ్యామిలీ సెంటర్ తల్లిదండ్రులకు గోప్యత సెట్టింగ్లు సమీక్షించడానికి మరియు కంటెంట్ నియంత్రణలను ఏర్పరచడానికి కూడా వీలు కలిగిస్తుంది.

ఈ విచారణ పిల్లల ఆన్‌లైన్ భద్రతా చట్టము మరియు కూపర్ డేవిస్ చట్టము వంటి ముఖ్యమైన చట్టాలను ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని తెలియజేస్తుందని నేను ఆశిస్తున్నాను. మేము ఈ శాసనానికి కేవలం మాటలలో మాత్రమే కాకుండా చేతలలో మద్దతు ఇస్తాము, మరియు అవి ఔపచారికం, చట్టబద్ధమైన బాధ్యతలు అయ్యే ముందు మా సేవ శాసనపరమైన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి మేము పని చేశాము. ఇందులో, యుక్తవయస్కులు ఫ్రెండ్స్ మరియు కాంటాక్టులు తో మాత్రమే ఎవరు కమ్యూనికేట్ చేయగలరో పరిమితం చేయడం, ఇన్-యాప్‌ పేరెంటల్ సాధనాలను అందించడం, హానికరమైన కంటెంట్‌ను ముందస్తుగానే గుర్తించడం మరియు తీసివేయడం మరియు ప్రాణాంతకమైన మాదకద్రవ్యాల కంటెంట్‌ను చట్ట అమలు అధికార యంత్రాంగానికి తెలియజేయడం వంటివి చేరి ఉన్నాయి. మేము, ఆన్‌లైన్ సేవల నుండి పిల్లల లైంగిక దోపిడీని నిర్మూలించే దిశగా అర్థవంతమైన పురోగతిని తెలియజేస్తున్నాయని మేము విశ్వసిస్తున్న స్టాప్ CSAM చట్టంపై కమిటీతో కలిసి పని చేయడం కొనసాగిస్తున్నాము.

ఈ రోజున అతిపెద్ద మరియు అత్యంత విజయవంతమైన ఇంటర్నెట్ కంపెనీలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉద్భవించాయి, మరియు మనం సాంకేతిక వినూత్నతలలో మాత్రమే కాకుండా స్మార్ట్ నిబంధనలో కూడా నాయకత్వం వహించాల్సి ఉంది. అందుకనే అమెరికన్లందరి డేటా గోప్యతను పరిరక్షించే మరియు ఆన్‌లైన్‌లో అందరికీ స్థిరమైన గోప్యతా ప్రమాణాలను రూపొందించే సమీకృతమైన సమాఖ్య గోప్యతా బిల్లుకు మేము మద్దతు ఇస్తున్నాము.

పరిశ్రమ వ్యాప్తంగా, ప్రభుత్వంలో మరియు మా కమ్యూనిటీని, మరియు మరింత ముఖ్యంగా యువకులను సురక్షితంగా ఉంచాలనే మా లక్ష్యాన్ని పంచుకునే లాభాపేక్ష-రహిత సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలతో మేము పనిచేయడానికై అద్భుతమైన భాగస్వాములు మరియు సమన్వయ సహకారం అందిస్తున్న వారందరికీ మా హృదయపూర్వక అభినందనలను తెలియజేయడానికి నేను దీనిని అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నాలకు కీలకం అయినట్టి చట్ట అమలు అధికార యంత్రాంగం మరియు ప్రథమ ప్రతిస్పందకుల పట్ల మేము ప్రత్యేకించి కృతజ్ఞులమై ఉన్నాము. సంక్షిప్తత కోసం మరియు ఎవరినైనా వదిలివేస్తామేమోననే భయంతో, నేను ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా జాబితా చేయను, అయితే దయచేసి మా ప్రగాఢ కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలను స్వీకరించండి.

Snapchat ని ఉపయోగించడం అనేది తమను సంతోషంగా ఉండేలా చేస్తోందని మేము మా కమ్యూనిటీ నుండి నిరంతరం వింటున్నాము మరియు మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు ముఖ్యమని మాకు తెలుసు. మేము ఇటీవలనే చికాగో యూనివర్సిటీ లోని నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ నుండి పరిశోధనను ఏర్పాటు చేశాము, Snapchat ఉపయోగించే రెస్పాండెంట్లు Snapchatters కాని వారి కంటే కూడా కుటుంబంతో తమ స్నేహం మరియు సంబంధాల నాణ్యతతో అధిక సంతృప్తిని కలిగి ఉన్నారని అది తెలియజేస్తోంది. ప్రపంచంలో సానుకూల ప్రభావం చూపాలనే మా లోతైన కోరిక, మా సేవను సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన రీతిలో ఉపయోగించబడుతుందని నిర్ధారించుకోవడానికి ప్రతిరోజూ మాకు ప్రేరణ కలిగిస్తోంది.

ప్రాథమికంగా, ఆన్‌లైన్ ఇంటరాక్షన్ అనేది ఆఫ్‌లైన్ ఇంటరాక్షన్ కంటే సురక్షితంగా ఉండాలని మేము నమ్ముతాము. ఆన్‌లైన్ సేవలను ఉపయోగించడంతో ఇమిడి ఉన్న ముప్పులన్నింటినీ తొలగించడం అనేది వాస్తవంగా అసాధ్యం అని మేము గుర్తించినప్పటికీ, Snapchat కమ్యూనిటీని రక్షించేందుకు మేము మా వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నాము. యువత మన దేశం యొక్క భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహిస్తారు మరియు వారిని రక్షించుకోవడానికి మనం కలిసి పని చేయాలి.

ధన్యవాదాలు.

తిరిగి వార్తలకు