2023 మొదటి అర్ధభాగానికి మా పారదర్శకత నివేదిక
అక్టోబర్ 25, 2023
2023 మొదటి అర్ధభాగానికి మా పారదర్శకత నివేదిక
అక్టోబర్ 25, 2023
ఈరోజు, మేము 2023 మొదటి అర్ధభాగాన్ని కవర్ చేసే మా తాజా పారదర్శకత నివేదికను విడుదల చేస్తున్నాము.
తమను తాము వ్యక్తపరిచేందుకు, ప్రస్తుతంలో జీవించేందుకు, ప్రపంచం గురించి తెలుసుకొనేందుకు మరియు కలిసి ఆనందించేందుకు ప్రజలకు సాధికారత కల్పించడం మా లక్ష్యం. పై వాటన్నింటినీ చేసేందుకు, Snapchattersకు మద్దతిచ్చేందుకు మా కమ్యూనిటీకి అవసరమైన భద్రత మరియు శ్రేయస్సులు అవసరం. మా అర్ధ వార్షిక పారదర్శకత నివేదికలనేవి, మా ప్లాట్‌ఫారంలో నియమాలను ఉల్లంఘించే కంటెంట్ మరియు ఖాతాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, మమ్మల్ని బాధ్యులుగా చేసేందుకు మరియు మేం చేస్తున్న ప్రయత్నాలపై సమాచారం మరియు అప్‌డేట్లు షేర్ చేసుకొనేందుకు ఒక ముఖ్యమైన సాధనం.
ప్రతి పారదర్శకత నివేదికకు మాదిరిగానే, మేము మా సేవలను మెరుగుపరచేందుకు విశేషంగా కృషి చేశాము, ఈ నివేదిక తో మా కమ్యూనిటీ మరియు ప్రముఖ వాటాదారులకు మరింత మెరుగైన సేవలందించగలుతాము. ఈ నివేదికలో మేము చాలా కొత్త డేటా పాయింట్లను చేర్చాము, ప్రధానంగా, యూరోపియన్ డిజిటల్ సేవల చట్టానికి సంబంధించి దిగువ వాటిని చేర్చాము:
అకౌంట్ అప్పీళ్ళు
మా ప్రాథమిక అకౌంట్ అప్పీళ్ళకు సంబంధించిన సమాచారాన్ని మేము చేర్చాము. అకౌంట్ అప్పీళ్ళనేవి, ఒకవేళ ప్రారంభ నిర్ణయంలో మా మోడరేషన్ బృందం ఏదైనా లోపాని నిర్ణయించినట్లయితే, తమ అకౌంట్ నుండి లాక్ చేయబడిన Snapchattersకు యాక్సెస్ తిరిగి పొందడానికి వీలు కల్పిస్తాయి. భవిష్యత్తులోని పారదర్శకత నివేదికలో ఈ అప్పీళ్ళను మరిన్ని విభాగాలకు విస్తరించడంద్వారా, ఈ విభాగంలో మేము మరింత కృషి జరిపి ఉత్తమమైన దానిని అందిస్తాము.
అడ్వర్టైజింగ్ మోడరేషన్ చర్యలు
మేము యూరోపియన్ యూనియన్‌లోని కంటెంట్‌కు సంబంధించి, మా అడ్వర్టైజింగ్ మోడరేషన్ ప్రయత్నాల పారదర్శకతను విస్తరిస్తున్నాము. మా ఈ Snapchat యాడ్స్ గ్యాలరీ (ప్రత్యేకించి EU) విడుదలకు అదనంగా, ఇప్పుడు మేము Snapchat నుండి ప్రస్తుత యాడ్స్ సంఖ్యను తగ్గించబోతున్నాము. మా పారదర్శకత నివేదికలో, Snapchat నివేదిక చేయబడిన మొత్తం యాడ్స్ మరియు మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ప్లాట్‌ఫారంనుండి తొలగించిన మొత్తం యాడ్స్ సంఖ్యను ప్రస్తావించాము.
డిజిటల్ సేవల చట్ట పారదర్శకత
మేము మా మోడరేషన్ ప్రక్రియలు మరియు EU-సంబంధిత సమాచారంలో అదనపు సమాచారం మరియు ఇన్‌సైట్స్‌తో, మా DSA బాధ్యతలకు అనుగుణంగా మేము ఈ వేసవిలో మొదట చేర్చిన మా యూరోపియన్ యూనియన్ పేజీని అప్‌డేట్ చేశాము. ఉదాహరణకు, కంటెంట్ సమీక్షించేటప్పుడు, మా మోడరేటర్లు మద్దతిచ్చే భాషలపై వివరాలను మేము చేర్చాము. వీటిలో మేము మా ఆటోమేటెడ్ కంటెంట్ మోడరేషన్ టూల్స్, కంటెంట్ మోడరేషన్ భద్రతా చర్యలు, మరియు EUలోని Snapchat యాప్ యొక్క సగటు నెలవారీ యాక్టివ్ స్వీకర్తలకు సంబంధించిన మరిన్ని వివరాలు అందించాము.
వివరణాత్మక గైడ్ మరియు పదకోశం
మా పారదర్శకతా నివేదికలు చాలా పెద్దగా ఉన్నప్పటికీ, ఈ పారదర్శకతా నివేదికలతో మా వాటాదారులకు వీలయినంత ఎక్కువ సమాచారాన్ని అందజేయాలనేది మా ప్రధానోద్దేశ్యం. దీనిని మరింత సులభతరం చేయడానికి, మేము "Snap పారదర్శకత నివేదికలకు ఒక మార్గదర్శి" ని చేర్చడాన్ని కొనసాగిస్తూ, మా కమ్యూనిటీ మార్గదర్శకాల గురించి మరింత సమాచారం మరియు వివరణలు ఇచ్చేలా ఒక పదకోశాన్ని విస్తరించాము. ఈ సమాచారం, తల్లిదండ్రులు, సంరక్షకులు, మా కమ్యూనిటీలోని సభ్యులు, మరియు ఇతర వాటాదారులు, ఈ పారదర్శకత నివేదికలను అర్థం చేసుకోవడానికి, కంటెంట్‌లోని ప్రతి విభాగం యొక్క అర్థంతోపాటు, మా ఇంతకుముందరి నివేదికలతోపోలిస్తే దీనిలో ఏది కొత్తది అనేదాన్ని సులభంగా పోల్చడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు, ఒకవేళ ప్రజలు ఈ నివేదికలో నిర్వచనంకంటే మరింత వేగంవంతంగా అన్వేషించదలచుకొంటే, వారు మరింత సమాచారంపై క్లిక్ చేయడం ద్వారా సత్వరమే వారు మరింత లోపలకు వెళ్ళగలుగుతారు.
మా కమ్యూనిటీలు మరియు వాటాదారుల విశ్వాసాన్ని సంపాదించేందుకు మేము బద్ధులమై ఉన్నాము. మేము మా కమ్యూనిటీని భద్రంగా ఉంచేందుకు సహాయపడటం, మా పురోగతిపై రిపోర్ట్ చేయడం మరియు మమ్మల్ని మేము బాధ్యులుగా ఉంచుకోవడాన్ని కొనసాగించేందుకు పనిచేస్తాము.