Privacy, Safety, and Policy Hub

2022 మొదటి అర్థభాగానికి మా పారదర్శకతా నివేదిక

నవంబర్ 29, 2022

ఈ రోజు, మనం 2022 సంవత్సరం యొక్క మొదటి అర్థభాగానికి సంబంధించిన ఇటీవలి పారదర్శక నివేదికను విడుదల చేస్తున్నాము.

Snapలో మా కమ్యూనిటీ యొక్క భద్రత మరియు శ్రేయస్సులకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తాము. మన అర్థ సంవత్సర నివేదికలు, మేము పంచుకొనే ముఖ్యమైన సమాచారానికి అవసరమైన టూల్ మరియు ఇది మమ్మల్ని బాధ్యతాయుతంగా ఉంచుతుంది.

2015లోని మా మొట్టమొదటి పారదర్శక నివేదిక నుండి, ప్రతి నివేదిక మరింత సమాచారాన్ని ఇస్తూ, సులభంగా అర్థమయ్యే విధంగా, ఇంతకుముందరి దానికంటే మరింత ప్రభావవంతంగా ఉంచాలనే ప్రధానోద్ధేశ్యంతో అందిస్తున్నాము. మా తాజా నివేదికలో, మా కమ్యూనిటీ మా రిపోర్టింగ్‌ను మరింతబాగా అర్థం చేసుకోవడానికి సహాయపడేలా మేము ఎన్నో అదనపు విషయాలు మరియు ఉన్నతీకరణలను చేయడంతోపాటు, ఈ నివేదికలు మరింత సమగ్రంగా మరియు సమాచారం అందించేవిగా ఉండేలా తీర్చిదిద్దాలనే మా నిబద్ధతకు అనుగుణంగా ఉండేలా అందించాము.

దేశ స్థాయిలో తప్పుడు సమాచార డేటాను అందుబాటులో ఉండేలా చేయడం

మొదటిసారిగా మేము దేశస్థాయిలో "తప్పుడు సమాచారం" ను ఒక ప్రత్యేక విభాగంగా ప్రవేశపడుతున్నాము. ఇది ఇంతకుముందు మేము ప్రపంచస్థాయిలో తప్పుడు సమాచారాన్ని అందించే విధానంపై దీన్ని రూపొందించాము. మాది దేశంవారీగా ఈ సమాచారాన్ని అందించే ఏకైక ప్లాట్‌ఫారమ్‌. ఈ అర్థ సంవత్సరం, మేము 4,877 తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే కంటెంట్ భాగాలను సంభావ్య హానికారకాలు లేదా హానికరమైనవాటిగా అమలు పరచాము. మేము Snapchatపై మా ప్లాట్‌ఫారం రూపకల్పన తో ఆరంభించి, తప్పుడు సమాచారం విస్తరించకుండా మేము ఎప్పుడూ ఒక భిన్నమైన విధానాన్ని అవలంబిస్తున్నాము. Snapchat అంతటా, తనిఖీ చేయబడని కంటెంట్ వ్యాప్తి అయ్యేందుకు అనుమతించము మరియు ఒకవేళ మేము మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్ ఏదైనా కనుగొన్నట్లయితే, దానిని వెంటనే తొలగించడంతోపాటు, అది విస్తృతంగా షేర్ చేయబడటాన్ని వెంటనే తగ్గించడమనేది మా విధానం. తప్పుడు సమాచారంతో సహా, కంటెంట్‌కు వ్యతిరేకంగా మేము అమలు పరచే విధానం అంతే సూటిగా ఉంటుంది: మేము దానిని తొలగిస్తాము.

ఇటీవలి U.S. మధ్యంతర ఎన్నికలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నందున, వివరణాత్మకమైన, దేశ-నిర్దిష్ట సమాచారంపై తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా, మేము తీసుకొంటున్న చర్యలు ఎంతో విలువైనవని మేము విశ్వసిస్తున్నాము. Snapchatపై తప్పుడు సమాచారం వ్యాప్తికాకుండా మేము ఎలా నిరోధిస్తామో మీరు మరింత ఇక్కడ చదవవచ్చు.

పిల్లల లైంగిక దోపిడీ & దుర్వినియోగాన్ని ఎదుర్కోవడం

మా కమ్యూనిటీకి చెందిన ఏ సభ్యుడినైనా, ప్రత్యేకించి మైనర్లను లైంగికపరంగా దోచుకోవడంమనేది చట్టవిరుద్ధం, జుగుప్సాకరం మరియు మా కమ్యూనిటీ మార్గదర్శకాలచే నిషేధించబడినది. మా ప్లాట్‌ఫారంపై పిల్లల లైంగిక దోపిడీ మరియు చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మరియు అబ్యూజ్ ఇమేజరీ (CSEAI) ని నిర్మూలించడమనేది మాకు అత్యంత ప్రధానమైనది. మా ప్లాట్‌ఫారంపై ఈ రకమైన దుర్వినియోగంపై పోరాడేందుకు మా సామర్థ్యాలను నిరంతరం అభివృద్ధి చేస్తూనేవుంటాము. 2022 ప్రథమార్ధంలో, మేము చొరవ తీసుకొని, మొత్తం బాలల లైంగిక దోపిడీ మరియు దుర్వినియోగాలను కనుగొని అట్టి ఉల్లంఘనలలో 94 శాతం ఘటనలపై తీసుకున్న చర్యలను ఇక్కడ నివేదించాము — ఇది మా ఇంతకుముందరి నివేదికపై ఇది ఆరు శాతం అధికంగా ఉంది.

CSEAIని ఎదుర్కోవడానికి మేం చేస్తున్న ప్రయత్నాలలో అప్‌డేట్ చేయబడిన భాష మరియు పెరిగిన అంతరదృష్తిని కూడా మేము అందిస్తున్నాము. ఇప్పుడు మేము తొలగించిన మొత్తం CSEAI కంటెంట్ సంఖ్యను పంచుకొంటున్నాము, మరియు మా ట్రస్ట్ మరియు సేఫ్టీ బృందాలు యు.ఎస్. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ మరియు ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ ((NCMEC) అందజేసిన మొత్తం CSAI నివేదికల మొత్తం సంఖ్యను కూడా మేము పంచుకుంటున్నాము.

ప్రవేశపెడుతున్నాం- పాలసీ & డేటా నిర్వచనాల పదకోశం

ఇకపై రాబోయే అన్ని నివేదికలలో ఒక పాలసీ & డేటా నిర్వచనాల పదకోశాన్ని ఖచ్చితంగా చేర్చబోతున్నాము. ఈ పదకోశంద్వారా, మేము ఉపయోగించే నిబంధనలు మరియు కొలమానాల గురించి మరింత పారదర్శకతను కల్పించడం, ఉల్లంఘించే కంటెంట్ రూపాలు, అమలుపరచే విధానాలను ప్రతి కేటగిరీక్రింద స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు, "బెదిరింపులు మరియు ఉల్లంఘన", "ద్వేషపూరిత ప్రసంగం", "నియంత్రించబడిన ఇతర వస్తువులు" లేదా ఇతర కంటెంట్ కేటగిరీలు అంటే మా ఉద్దేశ్యంలో ఏమిటో అర్థంచేసుకోలేని చదువరులు, సులభ వివరణకై ఈ పదకోశాన్ని చూడవచ్చు.

ఉల్లంఘించే కంటెంట్‌ను చొరవతీసుకొని తొలగించడం

నివేదికలోని డేటాను మీరు చూస్తున్నప్పుడు, మొత్తం నివేదికల మరియు అమలుకై చేర్చబడిన సంఖ్యలు కేవలం మాకు నివేదించబడిన కంటెంట్‌ను మాత్రమే కలిగివుంటాయాని గమనించడం కూడా చాలా ఆవసరం. ఏదైనా నివేదించబడటానికి ముందుగానే Snap దానిని చొరవ తీసుకొని దానిపై చర్యలు తీసుకొన్న సందర్భాలను ఇది పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం నివేదనలు, ఉల్లంఘనలపై తీసుకొన్న చర్యల సంఖ్య, వాటికి పట్టిన సమయాలు అనేవి వాటిని కనుగొనడానికి మేము చురుగ్గా తీసుకొన్న చర్యలలో మెరుగుదలలు, ముఖ్యమైన కేటగిరీలలోని మా నివేదికలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించాయని మేము విశ్వసిస్తున్నాము. ఉన్నతీకరించబడిన మా ఆటోమేటెడ్-డిటెక్షన్ టూల్స్, ఏదైనా కంటెంట్ Snapchattersకు చేరుకోవడానికంటే ముందుగానే గుర్తించబడినందువల్ల, కంటెంట్‌పై తీసుకొన్న ప్రతిచర్యలలో (అంటే Snapchatters నుండి నివేదికలు) తగ్గుదలను గమనించాము.

ప్రత్యేకించి, మా చివరి నివేదికతో పోల్చిచూస్తే, Snapchatters నుండి వచ్చే బెదిరింపులు మరియు నివేదికలపై కంటెంట్ ఉల్లంఘనలకు అమలును పోల్చిచూస్తే, ఇది 44%, మాదక ద్రవ్య సంబంధింత కంటెంట్‌పై చర్యలలో 37%, విద్వేషపూరిత ప్రసంగ సంబంధిత కంటెంట్‌పై చర్యలలో 34% తగ్గుదలను మేము గమనించాము. గత అర్థభాగంతో పోల్చిచూస్తే, ఉల్లంంచే కంటెంట్‌ తొలగించడం 33% వరకు పెరిగి, వాటికి తీసుకొనే సమయం సగటు సగటున సుమారు ఒక నిమిషంకంటే ఎక్కువ తీసుకొంటోంది.

గత కొన్ని సంవత్సరాలుగా Snapchat అభివృద్ధి చెందుతున్నప్పటికీ, పారదర్శకతకు మరియు మా కమ్యూనిటీ యొక్క భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వడంపట్ల మేము చూపే నిబద్ధతలో ఏవిధమైన మార్పులేదు. బాధ్యత తీసుకోవడాన్ని కొనసాగిస్తూ, మా పురోగతిపై అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తెలియజేయడాన్ని కొనసాగిస్తాము.

తిరిగి వార్తలకు