New Research Shows Australian Parents Worry Under-16 Ban Won’t Make Teens Safer
డిసెంబర్ 2025లో, Snapchat తో సహా ఒక నిర్ధిష్ట సామాజిక మాధ్యమ ఫ్లాట్‌ఫారాలను 16 ఏళ్ల లోపు పిల్లలు ఎవరూ ఉపయోగించకుండా నిషేధించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది.
సోషల్ మీడియా కనీస వయస్సు చట్టం మెసేజింగ్ ప్లాట్‌ఫారాలను మినహాయించింది, మాది ప్రాథమికంగా కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారం కావడం వల్ల, Snapchatపై ఇటువంటి నిషేధాలు వర్తించవని మేం విశ్వసిస్తున్నాం. అయినప్పటికీ, మేం చట్టానికి లోబడి 4,50,000 కంటే ఎక్కువ ఆస్ట్రేలియన్ Snapchat అకౌంట్‌లను లాక్ చేయడం లేదా నిలిపివేయడం ద్వారా ఆ నిబంధనలను పాటించాం. మేం అదనపు ఖాతాలను తొలగించడానికి ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నాం మరియు ఈ చట్టం నిర్దేశించిన నిబంధనలను తీర్చడానికి ఆస్ట్రేలియన్ ఈసేఫ్టీ కమిషనర్‌తో కలిసి పనిచేయడాన్ని కొనసాగిస్తున్నాం.
ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ నిషేధం ఆచరణలో ఆస్ట్రేలియన్ టీనేజర్‌లకు మరింత రక్షణ ఇస్తుందా లేదా వారి శ్రేయస్సును మెరుగుపరుస్తుందా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు మరియు విధాన రూపకర్తల మాదిరిగానే — టీనేజర్లను ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడం — అనే లక్ష్యాన్ని మేం పంచుకుంటున్నప్పటికీ — ఒక కంపెనీగా మేం తీసుకుంటున్న చర్యలు మరియు యువత రక్షణ కొరకు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తున్నాయా, లేదా అని నిర్ధారించుకోవాలని మేం కోరుకుంటున్నాం.
ఆస్ట్రేలియా నిషేధం ఈ దశ వరకు టీనేజర్లు మరియు తల్లిదండ్రుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మరింత తెలుసుకోవడానికి, ఆంక్షలు అమల్లోకి వచ్చిన సుమారు పది వారాల తరువాత 13-17 ఏళ్ల వయస్సు గల టీనేజర్ల యొక్క 500 మంది ఆస్ట్రేలియన్ తల్లిదండ్రులను సర్వే చేయడానికి మేము YouGov ను నియమించాము. పరిశోధనలో తేలిన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
టీనేజర్లు తక్కువ సురక్షితమైన వేదికలవైపు మళ్లుతున్నారనేదే తల్లిదండ్రుల్లో ఉన్న అతిపెద్ద ఆందోళన. పర్యవేక్షించడానికి మరింత కష్టంగా ఉండే ఫ్లాట్‌ఫారాల వైపుకు తమ టీనేజర్‌లు మళ్లుతున్నారని ఐదుగురిలో నలుగురు కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ మార్పు ఇప్పటికే జరిగిందని 20 శాతం మంది చెబుతుండగా, ఆ తల్లిదండ్రుల్లో 60 శాతం మంది కొత్త ప్లాట్‌ఫారాలు మరింత ఎక్కువ ముప్పును తెచ్చిపెట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కొత్త ఫ్లాట్‌ఫారాల్లో తగిన పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నాయని ఆ తల్లిదండ్రుల్లో సగం కంటే తక్కువ మంది (47%) మాత్రమే నమ్ముతున్నారు. టీనేజర్లు ఆశ్రయిస్తున్నట్లుగా తల్లిదండ్రులు చెప్పే అత్యంత సాధారణ ప్రత్యామ్నాయాల్లో WhatsApp (65%), Messenger (49%), Discord (34%), మరియు Roblox (32%) ఉన్నాయి - (మేం ఏకీభవించని కారణాల వల్ల) ఈ ఫ్లాట్‌ఫారాలకు నిషేధం నుంచి మినహాయింపు లభించింది.
నిషేధం సరైన ప్లాట్‌ఫారాలను లక్ష్యంగా చేసుకుంటుందా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆంక్షలు కొన్ని ప్లాట్‌ఫారాలకు వర్తిస్తాయని, మరికొన్నింటికి వర్తించవు అని 77% తల్లిదండ్రులకు తెలుసు. ఆ గ్రూప్‌లో, 42% మంది తల్లిదండ్రులు నిషేధానికి గురైన మరియు నిషేధం లేని ఫ్లాట్‌ఫారాలు రెండూ టీనేజర్‌లకు సమానంగా హాని చేస్తాయని భావిస్తున్నారు, మరియు మరో 9% మంది నిషేధించని ఫ్లాట్‌ఫారాలు వాస్తవానికి మరింత హాని కలిగించవచ్చు అని విశ్వసిస్తున్నారు.
తల్లిదండ్రులు సూత్రప్రాయంగా ఆంక్షలను సమర్ధిస్తున్నారు, కానీ అవి ఆచరణలో పనిచేస్తున్నాయనే విషయంలో వారికి సందేహాలు ఉన్నాయి.16 ఏళ్ల లోపు వారిపై విధించిన ఆంక్షలను 73 శాతం మంది ఆస్ట్రేలియన్ తల్లిదండ్రులు సమర్ధిస్తున్నారు, అయితే ఈ విధానం ఆశించిన లక్ష్యాలను “ఖచ్చితంగా” సాధిస్తుందని 11% మంది మాత్రమే చెబుతున్నారు, ఈ ఆంక్షలను ఆచరణలో అమలు చేయగలరని కేవలం 13% మంది మాత్రమే పూర్తి నమ్మకంతో ఉన్నారు. సగం కంటే ఎక్కువ మంది ఆంక్షలను అమలు చేయడంపై చాలా తక్కువగా లేదా అసలు నమ్మకం లేదని వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులకు ఈ చట్టం యొక్క ప్రభావంపై నమ్మకం లేదు మరియు అమలులో లోపాలను చూస్తున్నారు. ఆంక్షల నుంచి సులభంగా తప్పించుకోవచ్చని 70% మంది భావిస్తున్నారు, మరియు తమ పిల్లలు ఆన్‌లైన్‌లో వాస్తవంగా ఉన్నదానికంటే ఎక్కువ సురక్షితంగా ఉన్నారనే ఒక తప్పుడు భద్రతా భావాన్ని ఇది తల్లిదండ్రుల్లో కలిగిస్తుందని ఐదుగురులో నలుగురు కంటే ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. ఇది కేవలం ఊహాజనిత ఆందోళనలు మాత్రమే కావు: ఈ ఆంక్షలు పనిచేస్తున్న తీరులో కనీసం ఒక నిర్ధిష్టమైన లోపాన్ని 62% మంది గమనించారు, ఇందులో తమ టీనేజర్‌లు నిషేధించబడిన ఫ్లాట్‌ఫారాలను యాక్సెస్ చేసుకోవడానికి ఇప్పటికే మార్గాలను కనుగొన్నట్లుగా 22% మంది చెబుతున్నారు. మరియు ఈ ఆందోళనలను కేవలం తల్లిదండ్రులు మాత్రమే వ్యక్తం చేయడం లేదు - ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల్లో 32% మంది తమ టీనేజర్లు కూడా ఈ విషయాల గురించి వారితో చర్చించినట్లుగా చెప్పారు.
ఈ ఫలితాలన్నీ మొత్తంగా ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి: సమగ్ర నిషేధాలు అనేవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే పరిష్కారాలుగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది, ఇది తల్లిదండ్రుల్లో ఒక తప్పుడు భద్రతా భావాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో టీనేజర్లు ఈ ఆంక్షల విధింపు వల్ల తాము కోల్పోయిన కమ్యూనిటీలను మరియు జ్ఞాపకాలను వెతుక్కుంటూ ఇతర ఫ్లాట్‌ఫారాల వైపు మళ్లుతున్నారు. యువతను ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచే మార్గానికి ఆలోచనాత్మకమైన, ఆధారాలతో కూడిన విధానాలు అవసరం మరియు సంభావ్య అనాలోచిత సవాళ్లను సృష్టించడానికి బదులుగా తమ టీనేజర్ల శ్రేయస్సును కాపాడుకోవడంలో తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వాలి.
యువతను నిజంగా రక్షించే విధానాలు మరియు ప్లాట్‌ఫారాల స్థాయి భద్రతను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, తల్లిదండ్రులు మరియు భద్రతా నిపుణులతో పనిచేయడానికి Snapchat ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. మరిన్ని దేశాలు ఆన్‌లైన్ భద్రతా చట్టాలను పరిశీలిస్తున్న తరుణంలో, ఆన్‌లైన్‌లో టీనేజర్‌లను ఎలా ఉత్తమంగా రక్షించాలనేది నిర్ణయించేటప్పుడు విధాన రూపకర్తులు ఆధారాలను నిశితంగా పరిశీలించడానికి మరియు వాస్తవ ప్రపంచ పరిణామాలను అంచనా వేయడానికి ఈ ప్రాథమిక ఫలితాలు దోహదపడతాయని మేం ఆశిస్తున్నాం.
పద్ధతి
ఈ పరిశోధన Snap చే ఏర్పాటు చేయబడింది మరియు YouGov చే అమలు చేయబడింది. ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 13 నుండి ఫిబ్రవరి 19, 2026 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబడ్డాయి, n=500 ఆస్ట్రేలియన్ టీనేజర్ల (13-17 వయస్సు) తల్లిదండ్రులు దేశవ్యాప్త నమూనా మధ్య నిర్వహించబడ్డాయి. ఫలితాలు 95% విశ్వాస స్థాయి వద్ద ప్లస్ లేదా మైనస్ 4.5 శాతం పాయింట్‌ల మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంది.