జాతీయ ఫెంటానిల్ అవగాహన దినోత్సవం: యు.ఎస్ ఫెంటానిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి మా ప్రయత్నాలను కొనసాగించడం
9 మే, 2023
నేషనల్ పెంటానిల్ అవగాహన దినోత్సవం యొక్క ఫౌండింగ్ పార్టనర్ వలే సేవలందించడానికి Snap గర్వపడుతోంది. ఈ సందర్భంగా, మా ఫ్లాట్‌ఫారమ్‌పై మాదక ద్రవ్యాల అమ్మకాలను తుడిచివేయడానికి మరియు పెంటాలిన్ ప్రమాదాలపై మా కమ్యూనిటీకి అవగాహన కల్పించడానికి మేం చేపట్టే చర్యలను రెట్టింపు చేస్తాం. మేం చట్టాన్ని అమలు చేసే సంస్థలు, భద్రతా ఆర్గనైజేషన్‌లు, మరియు పేరెంట్ గ్రూప్‌లు, మరిముఖ్యంగా, అనేకమంది ప్రాణాలను తీసిన ఈ విధ్వంసకరమైన మహమ్మారికి విరుద్ధంగా పోరాడటానికి అంకితమైన Song for Charlie వంటి మా భాగస్వాములకు మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మేం రెండవ వార్షిక జాతీయ ఫెంటానిల్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, మా ప్రస్తుత పనిపై మన కమ్యూనిటీకి అప్‌డేట్‌ను అందించాలని మేం కోరుకున్నాం.
ఇవాళ, పెంటాలిన్ ప్రమాదాలను హైలైట్ చేస్తూ, నేషనల్ లెన్స్ అండ్ ఫిల్టర్ రూపంలో, Snapchat లోపల ఒక అవగాహన టూల్‌ను మేం లాంఛ్ చేస్తున్నాం. Snapchat పై యువతతో పెంటానిల్ గురించిన కీలక వాస్తవాలను పంచుకోవడానికి యాప్‌లో పబ్లిక్ సర్వీస్ అనౌన్స్‌మెంట్‌ను కూడా మేం ప్రారంభించబోతున్నాం. దీనికి అదనంగా, నేషనల్ ఫెంటానిల్ అవగాహనా దినోత్సవం నాడు టీనేజర్‌లు, యువత, తల్లిదండ్రులు, సలహాదారులు మరియు అక్రమ ఫెంటానిల్ సంక్షోభం గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తికరంగా ఉన్న విధాన రూపకర్తలను చేరుకోవడానికి సమస్యా-ప్రాంత నిపుణులతో వరస వర్చువల్ వెబినార్‌లను నిర్వహిస్తున్నాం. అన్ని సెషన్‌లు పబ్లిక్‌కు అందుబాటులో ఉంటాయి, మరియు ఈ ప్యానెల్స్ గురించి మరింత తెలుసుకోవాలని మేం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. వారి గురించి ఇక్కడమరింత తెలుసుకోండి.
మేం చట్టాన్ని అమలు చేసే సంస్థలు మరియు వారి ఇన్వెస్టిగేటర్‌లు మాదక ద్రవ్యాల డీలర్‌లకు తగిన శాస్తి చేయడానికి దోహదపడేందుకు మా సపోర్ట్‌ను పెంచడాన్ని కొనసాగిస్తాం. ఈ పనిలో భాగంగా, Snapchat ఎలా పనిచేస్తుంది, వారికి మనం ఒక వనరుగా ఎలా సేవలందించవచ్చు, మరియు డేటా కొరకు అత్యుత్తమంగా అభ్యర్థనలను సబ్మిట్ చేయాలనే దాని గురించి చట్టాన్ని అమలు చేసే అధికారులు మరింత తెలుసుకోవడానికి మేం కృషి చేస్తాం. ఉదాహరణకు, గత డిసెంబర్‌లో, 3,000 మందికి పైగా చట్టాన్ని అమలు చేసే అధికారులు మా రెండవ వార్షిక అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సమ్మిట్ కు హాజరయ్యారు మరియు మేం కలిసి ఎలా పనిచేస్తాం అనే దాని గురించి మరింత తెలుసుకున్నారు. అదనంగా, చట్టాన్ని అమలు చేసే సంస్థలు నేరపూరిత కార్యకలాపాల ఇన్వెస్టిగేషన్ మరియు ప్రాసిక్యూషన్ కొరకు వారికి అవసరమైన డేటాని యాక్సెస్ చేసుకోవడానికి చట్టపరమైన ప్రక్రియలను మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి, ఫ్లాట్‌ఫారమ్ నుంచి ఖాతా తొలగించిన తరువాత ఉల్లంఘన కంటెంట్‌ను మరింత ఎక్కువ కాలం మేం అట్టిపెడతాం.
టెక్ కంపెనీలు మరియు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఫెంటానిల్ మహమ్మారిపై పోరాడేందుకు దృష్టి సారించబడ్డ ద్వైపాక్షిక చట్టం , ద కూపర్ డేవిస్ యాక్ట్పై దృష్టి సారించిన సెనేటర్‌లు రోజర్ మార్షల్ మరియు జెనీ షాహెన్‌తో మేం పనిచేస్తున్నాం. ఈ బిల్లు ప్రాణాంతక మాదక ద్రవ్యాల సమాచారాన్ని చట్టం అమలుపరిచేవారితో పంచుకోవడానికి టెక్ కంపెనీలకు చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను సృష్టిస్తుంది మరియు ఫెంటానిల్‌ను ఎదుర్కొనడానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల మధ్య మరింత సహకారం మరియు డేటాని పంచుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ కీలకమైన చట్టంపై కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం కొరకు మేం ఎదురుచూస్తున్నాం.
గత సంవత్సరం, మా ఫ్లాట్‌ఫారాలపై చట్టవ్యతిరేక మాదక ద్రవ్యాలకు సంబందించిన కంటెంట్ మరియు యాక్టివిటీ సరళులు మరియ సూచనలను గుర్తించడానికి Metaతో ఒక పైలెట్ కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. మాదక ద్రవ్యాల డీలర్‌లు అనేక రకాలైన సర్వీస్‌లను వాడుకోవడం వల్ల, షేర్ చేసే ప్యాటర్న్లు మరియు సూచనలను పంచుకోవడం వల్ల చట్టవ్యతిరేక మాదక ద్రవ్యాల కంటెంట్ మరియు డీలర్ ఖాతాలను కనుగొనడంలో మరియు తొలగించడంలో మేం చేసే సానుకూల గుర్తింపు ప్రయత్నాలను బలోపేతం చేయవచ్చు. కార్యక్రమం అభివృద్ధి చెందేటప్పుడు, వ్యక్తులను కాపాడటానికి మరియు ఈ పరిశ్రమ వ్యాప్త సమస్యపై పోరాడటానికి ఇతర టెక్ కంపెనీలను సైతం జోడించాలని మేం ఆశిస్తున్నాం.
ఫెంటానిల్ ప్రమాదాలపై టీనేజర్‌లకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించిన అపూర్వమైన జాతీయ ప్రజా అవగాహన ప్రచారంపై గత సంవత్సరం మేం యాడ్ కౌన్సిల్‌తో జతకూడాం : రియల్ డీల్ ఆన్ ఫెంటానిల్‌అనే ప్రోగ్రాం ద్వారా. ఇటీవల, మేం మా ఇన్ యాప్ డ్రగ్ ఎడ్యుకేషన్ పోర్టల్, హెడ్స్ అప్‌పై ప్రచార వీడియోలను జోడించాం. ఈవనరులు యువ అమెరికన్‌లకు నకిలీ మాదక ద్రవ్యాల ప్రమాదాల గురించి మరియ ప్రాణాలను కాపాడే నాలోక్సోన్ ప్రాముఖ్యత గురించి సమాచారాన్ని అందిస్తాయి. Snapchatపై టీనేజర్‌లు మరియు యువతకు ప్రచార PSAలను కూడా మేం అందించబోతున్నాం మరియు రాబోయే వారాల్లో మేం హై స్కూలు మరియు కాలేజీ వయస్సు విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ఒక కొత్త లెన్స్‌ను ప్రారంభించబోతున్నాం.
మాదక ద్రవ్యాల ప్రమాదాలపై సకాలంలో అవగాహనా కంటెంట్‌ను అందించే చర్యల్లో భాగంగా, మేం CDC యొక్క స్టాప్ ఓవర్ డోస్ క్యాంపైన్ యొక్క వనరులను జోడించాం, ఇది పాలీసబ్‌స్టాన్స్ ఉపయోగం మరియు మాదకద్రవ్యాల వినియోగ రుగ్మతలపై ఉండే అపోహలను తగ్గించడాన్ని కవర్ చేసే కంటెంట్ ఉంటుంది. ఫెంటానిల్ ఫాక్ట్ చెకింగ్ మరియు అపోహలను తొలగించడం మరియు పీర్ టూ పీర్ అవగాహనా చిట్కాలను కవర్ చేసే కొత్త కంటెంట్‌పై మేం Song for Charlieతో కలిసి పనిచేస్తున్నాం.
Snapchat కమ్యూనిటీని కాపాడటం మాకు ఎంతో ముఖ్యమైనది. మేం కొంత పురోగతిని సాధించినప్పటికీ, ఫెంటానిల్ ప్రమాదాలపై మా యూజర్‌లకు తదుపరి అవగాహన కల్పించడానికి మాకు అవకాశం ఉన్నట్లుగా మేం విశ్వసిస్తున్నాం మరియు ప్రాణాంతక మాదక ద్రవ్య కంటెంట్‌ను గుర్తించి, తొలగించడంలో మేం భారీగా పెట్టుబడి పెట్టడాన్ని కొనసాగిస్తాం. ఫెంటానిల్ మరియు నకిలీ మాదక ద్రవ్యాలు వంటి సామాజిక సమస్యల కొరకు సామాజిక పరిష్కారం అవసరం, మరియు మార్పును చూపించడానికి మన సమాజం, తల్లిదండ్రులు మరియు కుటుంబాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు మరియు టెక్నాలజీల కంపెనీలతో కలిసి పనిచేయడం మాకు గర్వంగా ఉంది.
– జెన్నీఫర్ స్టౌట్, Snap గ్లోబల్ పబ్లిక్ పాలసీ వీ.పీ & నేఫనల్ ఫెంటానిల్ డే అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు