మా ఇన్-యాప్ తల్లిదండ్రుల సాధనాలను విస్తరించడం
జనవరి 11, 2024
మా ఇన్-యాప్ తల్లిదండ్రుల సాధనాలను విస్తరించడం
జనవరి 11, 2024
Snap వద్ద, యుక్తవయస్సులోని పిల్లలు Snapchatను సురక్షితంగా ఉపయోగించేందుకు మేము తల్లిదండ్రులకు అదనపు సాధనాలు మరియు వనరుల మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము.
2022లో మేము, తల్లిదండ్రులకు యుక్తవయస్సులోని తమ పిల్లలు ఏ స్నేహితులతో Snapchatపై మాట్లాడుతున్నారో చూసేందుకు, తమ ఆందోళనలను నమ్మకంగా నివేదించడానికి, మరియు కంటెంట్ నియంత్రణలను సెట్ చేసేందుకు ఉపయుక్తంగా ఉండే మా ఫ్యామిలీ సెంటర్ సాధనాలను యుక్తవయస్సులోని వారిని Snapchatపై సురక్షితంగా ఉంచేందుకు సహాయపడటానికి రూపొందించినవన్నీ ఉండేలా ప్రారంభించాము.
Snapchat అనేది, ప్రజలు తమ స్నేహితులతో ఆఫ్‌లైన్‌లో సంభాషణ చేసినట్లుగానే ఉండేలా సహాయపడేందుకు నిర్మించబడింది, మరియు ఫ్యామిలీ సెంటర్ అనేది, తల్లిదండ్రులు మరియు యుక్తవయస్సులోని పిల్లల మధ్య వాస్తవ ప్రపంచంలో ఉండే సంబంధాల స్థితిగతులను ప్రతిబింబిస్తుంది. దీనిలో తల్లిదండ్రులు, యుక్తవయసులోని తమ పిల్లల వ్యక్తిగత సంభాషణల గోప్యతను గౌరవిస్తూనే, వారు ఎవరితో సమయం గడుపుతున్నారనే దానిపై అవగాహన కలిగివుంటారు. ఫ్యామిలీ సెంటర్ అభివృద్ధి చేయడానికి మేము కుటుంబాలతో మరియు ఆన్‌లైన్ భద్రతా నిపుణులతో సన్నిహితంగా కలిసి పనిచేశాము మరియు దానికి నిరంతరం అదనపు లక్షణాలతో నవీకరణం చేయడానికి వారి అభిప్రాయాన్ని ఉపయోగిస్తాము.
ఈరోజు మేము, తల్లిదండ్రులకు మరింత దృగ్గోచరత కల్పించేందుకు మరియు ఆన్‌లైన్ భద్రత గురించి ఉత్పాదక సంభాషణలు జరిపేందుకు వారిని మరింత శక్తివంతం చెయ్యడానికి కలిగించే విస్తరించిన ఫ్యామిలీ సెంటర్ ఫీచర్లను ప్రవేశపెడుతున్నాము. రాబోయే వారాల్లో, మేము వీటిని ప్రవేశపెట్టబోతున్నాము:
వారి పిల్లల సెట్టింగ్‌ల దృగ్గోచరత: యుక్తవయసులోని వారికి ఎంతో ముఖ్యమైన డిపాల్ట్ భద్రత మరియు గోప్యతా సెట్టింగ్‌లను, డిఫాల్ట్‌గా అత్యంత కఠినమైన ప్రమాణాలకు ఉండేలా సెట్ చేశాము. ఇప్పుడు తల్లిదండ్రులు దీనిని వీక్షించగలరు:
వారి పిల్లల స్టోరీ సెట్టింగ్‌లు: యుక్తవయస్కులు తమ స్టోరీని తమ స్నేహితులతో, షేర్ చేసుకొనే సామర్థ్యం కలిగి ఉంటారు లేదా సన్నిహితంగా ఉండే స్నేహితుల సమూహం మరియు కుటుంబాన్ని ఎంచుకోగలుగుతారు.
వారి యుక్తవస్సు పిల్లల పరిచయాల సెట్టింగ్‌లు: Snapchatterలను వారి స్నేహితుడిగా చేర్చినప్పుడు లేదా ఐచ్చికంగా వారి ఫోన్ పరిచయాలులో ఉన్నప్పుడు మాత్రమే సంప్రదించగలుగుతారు.
ఒకవేళ వారి యుక్తవయసు పిల్లలు తమ స్థానము స్నేహితులతో Snap మ్యాప్‌పై షేర్ చేసుకొన్నట్లయితే: Snapchatterలకు వారి స్నేహితులు ఎక్కడ ఉన్నారు, వారి స్థాయి ఏమిటి, ఆసక్తి కలిగించే ప్రదేశాలను కనుగొనడం, ప్రపంచవ్యాప్తంగా Snapchatterలచే సమర్పించబడిన కంటెంట్ వీక్షించేందుకు Snap మ్యాప్ వీలు కల్పిస్తుంది. Snapchatterలు తమ స్థానాన్ని పంచుకోవడాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాలి - వారు తమ స్థానాన్ని తమ స్నేహితులతో పంచుకొనే ఐఛ్ఛికాన్ని కలిగివుంటారు.
AIకి తల్లిదండ్రుల నియంత్రణలు: తల్లిదండ్రులు ఇప్పుడు వారి యుక్తవయస్సులోని పిల్లలనుండి ఛాట్స్‌కు స్పందించేందు My AI, AI శక్తి కలిగివున్న మా చాటబోట్ సామర్థ్యాన్ని పరిమితం చేయగలుగుతారు. ఈ లక్షణం ఇప్పటికే My AIలో నిర్మించబడిన భద్రతా చర్యలపై నిర్మించబడి, అసంబద్ధ లేదా హానికరమైన ప్రతిస్పందనలకు వ్యతిరేకంగా సంరక్షణలు, ఒకవేళ Snapchatterలు ఈ సేవను అదేపనిగా దుర్వినియోగ పరచినా మరియు వయసు అప్రమత్తలకు సంబంధించి తాత్కాలిక వినియోగ పరిమితులువంటి వాటికై రూపొందించబడింది.
ఫ్యామిలీ సెంటర్‌కు సులభమైన యాక్సెస్: Snapchat అంతగా అనుభవంలేని తల్లిదండ్రులకు, మేము ఫ్యామిలీ సెంటర్‌ను మరింత సులభంగా కనుగొనగలిగేలా చేశాము. ఇప్పుడు తల్లిదండ్రులు వారి ప్రొఫైల్ నుండి నేరుగా ఫ్యామిలీ సెంటర్ యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా తల్లిదండ్రుల ప్రొఫైల్ కుడి పైన మూలలో ఉండే సెట్టింగ్‌లకు వెళ్ళడంద్వారా చేసుకోవచ్చు. Snapchatకు కొత్తగా వచ్చిన తల్లిదండ్రులు మరియు యుక్తవయస్సులోని వారికి, ఫ్యామిలీ సెంటర్ సులభంగా చేరుకోవడానికి సహాయపడటమే మాలక్ష్యం.
Snapchatను మా మొత్తం కమ్యూనిటీకి ఒక ఆహ్లాదకరమైన మరియు భద్రమైన ప్రదేశంగా చేసేందుకు మేము తల్లిదండ్రులు మరియు ఆన్‌లైన్ భద్రతా నిపుణులతో నిరంతరం కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తుంటాము.