డేటా గోప్యతా దినోత్సవం: గోప్యత మరియు అకౌంట్ భద్రత కోసం కొనసాగుతున్న మా నిబద్ధత
26 జనవరి, 2024
డేటా గోప్యతా దినోత్సవం: గోప్యత మరియు అకౌంట్ భద్రత కోసం కొనసాగుతున్న మా నిబద్ధత
26 జనవరి, 2024
Snap ఎలా పనిచేస్తుందో అనేందుకు గోప్యత ఎల్లప్పుడూ కీలకంగా ఉంటూ వస్తోంది, మరియు గోప్యత కోసం మా విధానం సులువైనది: ముందుజాగ్రత్తగా ఉండడం, ఎంపికలను ఆఫర్ చేయడం, మరియు మా కమ్యూనిటీ మొదట ఉంటుంది అనే విషయం ఎప్పటికీ మరచిపోకుండా ఉండడం. ఒకటవ రోజు నుండీ, వ్యక్తులు ప్రైవేటు సంభాషణ ద్వారా తమ ఫ్రెండ్స్ తో కనెక్ట్ చేసుకోవడానికి సహాయం చేయడంపై Snapchat దృష్టి సారించింది, అది Snapచాటర్లను తమకు తాము వ్యక్తపరచుకోవడానికి మరింత సౌకర్యవంతంగా భావించేందుకు సహాయపడుతుందని మాకు తెలుసు.
డేటా గోప్యత దినోత్సవం గౌరవార్థం మేము అప్‌డేట్ చేయబడిన మా గోప్యతా విధానం షేర్ చేయడానికి, తల్లిదండ్రులకు మా వనరులను హైలైట్ చేయడానికి మరియు అకౌంట్ భద్రతపై చిట్కాలను అందించడానికి సంతోషిస్తున్నాము.
Snapచాటర్ల డేటాను మేము ఎలా సేకరిస్తాము మరియు ఎలా ఉపయోగిస్తామనే దాని గురించి మరింత స్పష్టంగా మరియు పారదర్శకంగా ఉండేలా చేసే ప్రయత్నంలో మేము మా గోప్యతా విధానం ని తిరగవ్రాశాము. గోప్యత విధానాలు ప్రతి ఒక్కరికీ - యువతీయువకులు మరియు పెద్దలకు కూడా చదవడానికి మరియు అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండాలని మేము నమ్ముతున్నాము. అందుకే మేము క్లిష్టమైన పరిభాషను నివారిస్తాము, సాంకేతిక పదజాల నిబంధనలు అవసరమైనచోట నిర్వచనాలను అందిస్తాము మరియు ప్రతి విభాగం టాప్ లో సారాంశాలను చూపిస్తాము. మేము వ్యక్తిగత డేటా పై నియంత్రణ చేయాలని అనుకుంటాము - ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు డిలీట్ చేయాలి అనేవి, అందుకనే మా గోప్యతా విధానం ఇప్పుడు Snapచాటర్లను తమ సమాచారాన్ని నియంత్రించుకోగలిగేలా అనేక మార్గాలతో దారి చూపుతుంది. ఒకసారి చదువుకోండి!
గోప్యత సమాచారం కోసం మరొక గొప్ప మూలం మా గోప్యత మరియు భద్రతా హబ్ – ఇది ప్రజలు మా విధానాలు, వనరులు, మరియు సాధనాలను సులభంగా అర్థం చేసుకోవడానికీ, Snapచాటర్ల యొక్క వ్యక్తిగత డేటాను రక్షించేందుకు మేము ఎలా పనిచేస్తామో అర్థం చేసుకొని తమను తాము రక్షించుకోవడానికి వారు ఏమి చేయగలరో తెలుసుకోవడానికి వీలు కల్పించే మా ఏకైక చోటు. Snapchat కు మా తల్లిదండ్రుల మార్గదర్శిని తో సహా వనరులను వీక్షించడానికి పేరెంట్స్-ఫోకస్డ్ వెబ్‌సైట్ ని తల్లిదండ్రులు సందర్శించవచ్చు మరియు మా తల్లిదండ్రుల నియంత్రణ సాధనమైన ఫ్యామిలీ సెంటర్ని ఎలా ఎనేబుల్ చేసుకోవచ్చునో తెలుసుకోవచ్చు. త్వరలోనే, My AI ప్రొఫైల్ పేజీ ద్వారా గోప్యత మరియు భద్రతా హబ్ నేరుగా అందుబాటులోనికి వస్తుంది, మరియు ఈ సంవత్సరానికి, తల్లిదండ్రులు ఫ్యామిలీ సెంటర్ లో My AI ని కూడా డిజేబుల్ చేయవచ్చు.
వినియోగదారు గోప్యత యొక్క కీలకమైన భాగం అయినటువంటి అకౌంట్ భద్రతకు అంకితమై ఉన్న అనేకమైన వనరులను కూడా మేము ఇటీవలనే ప్రారంభించాము. ఈ వారం, మేము మా గోప్యత మరియు భద్రతా హబ్ పైన మా కమ్యూనిటీకి భద్రత ద్వారా గోప్యతపై చిట్కాలను అందించేందుకు అంకితమైన పేజీనిసృష్టించాము, Snapchatలో మీ ఇమెయిల్ మరియు ఫోన్ నంబర్‌ను ఎలా వెరిఫై చేయాలనే సూచనలతో కూడిన ఒక సేఫ్టీ స్నాప్‌షాట్ ఎపిసోడ్ మరియు అంతర్నిర్మిత భద్రతా చిట్కాలతో లెన్స్ తో కూడిన ఒక బెస్పోక్ డేటా గోప్యతా దినోత్సవాన్ని రూపొందించాము. అగ్రగామి గోప్యతా సంస్థ అయిన ఫ్యూచర్ ప్రైవసీ ఫోరమ్ (FPF)తో సహ-సృష్టి చేయబడిన లెన్స్, Snapచాటర్లను ఆన్‌లైన్‌లో తమ గోప్యతను పరిరక్షించుకోవడానికి ఉత్తమ పద్ధతులను ఇస్తుంది.
మీ సెట్టింగ్లు సమీక్షించేందుకు ఈ రోజు కొంత సమయం తీసుకోండి, అకౌంట్ భద్రతను పెంచుకోండి, మరియు మా గోప్యత లెన్సెస్ మరియు స్టికర్లు ను మీ దగ్గరి ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో షేర్ చేయండి!
డేటా గోప్యత దినోత్సవం శుభాకాంక్షలు!