గోప్యతా విధానం

అమల్లోని రావడం: 15 ఆగస్టు, 2023

Snap Inc. అనేది ఒక సాంకేతిక సంస్థ. మా ఉత్పత్తులు మరియు సేవలు - Snapchat, Bitmoji, Spectacles మరియు ఈ గోప్యతా విధానానికి లింక్ చేయబడిన ఇతర హార్డ్ వేర్, అడ్వర్టైజింగ్, వాణిజ్యం మరియు ఇతరులతో సహా - మిమ్మల్ని మీరు వ్యక్తీకరించడానికి, క్షణంలో జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు కలిసి ఆనందించడానికి వేగవంతమైన, ఆహ్లాదకరమైన మరియు వ్యక్తిగతీకరించిన మార్గాలను అందిస్తాయి!

మీరు ఈ సేవలను ఉపయోగించుకునేటప్పుడు, మీరు మాతో కొంత సమాచారమును పంచుకుంటారు. కాబట్టి మేము సేకరించే సమాచారం, మేము దానిని ఎలా ఉపయోగిస్తాము, అది ఎలా షేర్ చేయబడుతుంది మరియు మీకు ఉన్న నియంత్రణల గురించి మేము స్పష్టంగా ఉండాలనుకుంటున్నాము.

మా వినియోగదారులందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా మరియు క్లిష్టమైన భాష మరియు చట్టపరమైన పదబంధాలు లేని విధంగా ఈ గోప్యతా విధానాన్ని రాయడానికి మేము మా వంతు కృషి చేసాము. మీరు తరువాత దేనినైనా సమీక్షించాలనుకుంటే, మీరు ఎల్లప్పుడూ మా గోప్యతా కేంద్రాన్ని చూడవచ్చు. మా గోప్యతా అభ్యాసాల యొక్క సారాంశాలు మీకు సులభంగా గ్రాహ్యత అయ్యేలా మేము వాటిని రూపొందించాము. ఉదాహరణకు, మా ప్రొడక్ట్ ద్వారా గోప్యత పేజీ ఉత్పత్తి-నిర్దిష్ట సమాచారం మరియు చిట్కాలు మరియు ఉపాయాలతో మద్దతు పేజీలకు లింక్ లను ఇస్తుంది. ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా? మమ్మల్నిసంప్రదించండి.

మేము సేకరించే సమాచారం

మేము సేకరించే సమాచారంలో మూడు ప్రాథమిక కేటగరీలు ఉన్నాయి:

  • మీరు అందించే సమాచారం.

  • మా సేవలను మీరు ఉపయోగించేటప్పుడు మేము పొందే సమాచారం.

  • తృతీయ పక్షాల నుండి మేము పొందే సమాచారం.

ఈ కేటగిరీల్లో ప్రతిదాని గురించి మరికొంచెం వివరంగా ఇక్కడ ఇవ్వబడింది.

మీరు అందించే సమాచారం

మీరు మా సేవలతో సంభాషించినప్పుడు, మీరు మాకు అందించే సమాచారాన్ని మేము సేకరిస్తాము. ఉదాహరణకు, మా అనేక సేవలకు మీరు ఒక అకౌంట్ను నిర్మిచెయ్యాల్సి ఉంటుంది, కాబట్టి మీ పేరు, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వంటి మీ గురించి కొన్ని ముఖ్యమైన వివరాలను మేము సేకరించాల్సి ఉంటుంది. మా సేవల్లో బహిరంగంగా కనిపించే ఒక ప్రొఫైల్ పిక్చర్ లేదా Bitmoji అవతార్‌ వంటి కొంత అదనపు సమాచారాన్ని మాకు అందించమని కూడా మేము మిమ్మల్ని అడగవచ్చు. మరియు ఆ తాజా స్నీకర్స్ వంటిదాన్ని మీరు మా వాణిజ్య ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తుంటే, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు నంబర్ మరియు అనుబంధిత అకౌంట్ వంటి మీ చెల్లింపు సమాచారాన్ని మేము అడగవచ్చు.

Snap లు మరియు చాట్ లు, My AI తో సంభాషణలు, స్పాట్లైట్ సమర్పణలు, పబ్లిక్ ప్రొఫైల్ సమాచారం, మెమోరీస్ మరియు మరెన్నో ఇటువంటి మా సేవల ద్వారా మీరు పంపే సమాచారాన్ని కూడా మీరు మాకు అందిస్తారు. మీ Snap లు, చాట్ లు మరియు ఏదైనా ఇతర కంటెంట్ ను వీక్షించే వినియోగదారులు ఎల్లప్పుడూ ఆ కంటెంట్ ను సేవ్ చేయవచ్చు లేదా యాప్ వెలుపల కాపీ చేయగలరని గుర్తుంచుకోండి. కాబట్టి, ఇంటర్నెట్ కు వర్తించే అదే ఇంగిత జ్ఞనం మా సేవలకు కూడా వర్తిస్తుంది: మీరు కోరుకొనే సందేశాలను లేదా కంటెంట్ ను ఎవరైనా సేవ్ లేదా షేర్ చెయ్యకూడదంటే అలాంటి సందేశాలను లేదా కంటెంట్ ను పంపవద్దండి లేదా షేర్ చెయ్యవద్దండి.

మీరు మద్దతు ని సంప్రదించినప్పుడు లేదా మరేదైనా విధంగా మాతో సంభాషించినప్పుడు, మీరు స్వచ్ఛందంగా ఇచ్చిన లేదా మీ ప్రశ్నను పరిష్కరించడానికి అవసరమైన సమాచారాన్ని మేం సేకరిస్తాం.

మీరు మా సేవలను ఉపయోగించినప్పుడు మాకు లభించే సమాచారం

మీరు మా సేవలను ఉపయోగించేటప్పుడు, ఆ సేవలలో వేటిని మీరు ఉపయోగించుకున్నారు మరియు వాటిని ఎలా ఉపయోగించుకున్నారనే దాని గురించి మేము సమాచాముం సేకరిస్తాము. ఉదాహరణకు, మీరు ఒక నిర్దిష్ట స్టోరీని చూశారని, స్పాట్ లైట్ లో పిల్లి వీడియోలను చూశారని, ఒక నిర్దిష్ట కాలానికి ఒక నిర్దిష్ట యాడ్ ను చూశారని, Snap మ్యాప్ ను అన్వేషించారని మరియు కొన్ని Snap లను పంపారని మాకు తెలిసి ఉండవచ్చు. మీరు మా సేవలను ఉపయోగించేటప్పుడు మేము సేకరించే సమాచారం యొక్క రకాల పూర్తి వివరణ ఇదిగో:

  • వినియోగ సమాచారం. మా సేవల ద్వారా మేం మీ కార్యకలాపాల గురించిన సమాచారాన్ని సేకరిస్తాం. ఉదాహరణకు, మేము ఈ అంశాల గురించిన సమాచారమును సేకరించవచ్చు:

    • మీరు ఏ ఫిల్టర్‌లు లేదా లెన్సెస్ను వీక్షిస్తారు లేదా Snapలకు వర్తింపజేస్తారు, మీరు ఏ స్టోరీస్ ను చూస్తున్నారు, మీరు Spectacles ను ఉపయోగిస్తున్నారా, My AIతో మీ పరస్పర చర్యలు లేదా మీరు సబ్మిట్ చేసిన శోధన ప్రశ్నల వంటి మా సేవలతో మీరు ఎలా పరస్పర చర్య చేస్తారు.

    • ఇతర Snapచాటర్లతో మీరు ఎలా సంభాషిస్తారు, వారి పేర్లు, మీ సంభాషనల సమయం మరియు తేదీ, మీ ఫ్రెండ్స్ తో మీరు మార్పిడి చేసే సందేశాల సంఖ్య, మీరు సందేశాలను ఎక్కువగా మార్పిడి చేసే ఫ్రెండ్స్ మరియు సందేశాలతో మీ పరస్పర చర్యలు (మీరు ఒక సందేశాన్ని తెరిచినప్పుడు లేదా మీరు స్క్రీన్ షాట్ ను సంగ్రహించినట్లు మేము గుర్తించడం వంటివి).

  • కంటెంట్ సమాచారం. మీరు మా సేవలను ఉపయోగించినప్పుడు, మీరు కెమెరా లేదా క్రియేటివ్ టూల్స్ తో నిమగ్నమై ఉండవచ్చు మరియు స్టోరీస్, Snapలు మరియు మరిన్నింటితో సహా వివిధ రకాల కంటెంట్‌ను సృష్టించవచ్చు మరియు షేర్ చేయవచ్చు. మా సేవల్లో మీరు సృష్టించే లేదా అందించే కంటెంట్ గురించి మరియు కెమెరా మరియు క్రియేటివ్ టూల్స్ తో మీ నిమగ్నత గురించి మేము సమాచారాన్ని సేకరిస్తాము. నిర్దిష్ట కంటెంట్ కోసం, ఇది చిత్రం, వీడియో మరియు ఆడియో యొక్క కంటెంట్ ఆధారంగా సమాచారాన్ని కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు బాస్కెట్ బాల్ ఆడుతున్నస్పాట్‌లైట్ Snap ను పోస్ట్ చేస్తే, బాస్కెట్ బాల్ గురించి ఇతర స్పాట్‌లైట్ Snap లను మేము మీకు చూపించవచ్చు. మెటాడేటాతో సహా కంటెంట్ గురించి ఇతర సమాచారాన్ని కూడా మేము సేకరించవచ్చు - ఇది పోస్ట్ చేసిన తేదీ మరియు సమయం మరియు ఎవరు చూశారు వంటి కంటెంట్ గురించిన సమాచారం.

  • పరికరం సమాచారం. మీరు ఉపయోగించే పరకరం నుండి మరియు దాని గురించి మేం సమాచారం సేకరిస్తాం. ఉదాహరణకు, మేము వీటిని సేకరించవచ్చు:

    • హార్డ్‌వేర్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్, పరికర మెమరీ, అడ్వర్టైజింగ్ ఐడెంటిఫైయర్‌లు, యూనిక్ అప్లికేషన్ ఐడెంటిఫైయర్‌లు, ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లు, ప్రత్యేక పరికర ఐడెంటిఫైయర్‌లు, పరికర వినియోగ డేటా, బ్రౌజర్ రకం, ఇన్‌స్టాల్ చేయబడిన కీబోర్డ్‌లు, భాష, బ్యాటరీ స్థాయి మరియు టైమ్ జోన్ వంటి మీ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ గురించిన సమాచారం:

    • యాక్సిలరోమీటర్లు, గైరోస్కోప్‌లు, దిక్సూచిలు, మైక్రోఫోన్‌లు మరియు మీరు హెడ్‌ఫోన్‌లు కనెక్ట్ చేసుకున్నారా వంటి ఉపకరణ సెన్సార్ల నుండి సమాచారము; మరియు

    • మొబైల్ ఫోన్ నెంబర్, సేవా ప్రదాత, IP చిరునామా మరియు సిగ్నల్ సామర్ధ్యం వంటి మీ వైర్‌లెస్ మరియు మొబైల్ నెట్‌వర్క్ కనెక్షన్‌ల గురించిన సమాచారము.

  • పరకరం ఫోన్‌బుక్. మా సేవలన్నీ ఫ్రెండ్స్ తో సంభాషణం చేయడానికి సంబంధించినవి కాబట్టి, మేము - మీ అనుమతితో - మీ కాంటాక్టులు మరియు సంబంధిత సమాచారం వంటి మీ పరికరం యొక్క ఫోన్ బుక్ నుండి సమాచారాన్ని సేకరించవచ్చు.

  • కెమెరా, ఫోటోలు, మరియు ఆడియో. మీ పరికరం యొక్క కెమెరా, ఫోటోలు మరియు మైక్రోఫోన్ నుండి చిత్రాలు మరియు ఇతర సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం మా అనేక సేవలకు ఉంది. ఉదాహరణకు, మేము మీ కెమెరా లేదా ఫోటోలను ప్రాప్యత చేసుకోగలిగితే తప్ప, మీరు Snaps పంపించలేరు లేదా మీ కెమెరా రోల్ నుండి ఫోటోలను అప్‌లోడ్ చేయలేరు.

  • లొకేషన్ సమాచారము. మీరు మా సేవలను ఉపయోగించేటప్పుడు మేము మీ స్థానము గురించిన సమాచారమును సేకరించవచ్చు. మీ అనుమతితో, GPS సంకేతాలు వంటి పద్ధతులను కలిగి ఉన్న మీ ఖచ్చితమైన లొకేషన్ గురించి సమాచారాన్ని కూడా మేం సేకరించవచ్చు.

  • కుక్కీలు మరియు ఇతర సాంకేతికలతో సేకరించబడే సమాచారము. అనేక ఆన్‌లైన్ సేవలు మరియు మొబైల్ అప్లికేషన్ల వలెనే, మీ చర్య, బ్రౌజర్, మరియు ఉపకరణము గురించిన సమాచారము సేకరించడానికి మేము కుకీస్ మరియు వెబ్ బీకాన్స్, వెబ్్ స్టోరేజ్, మరియు విశిష్ట అడ్వర్టైజింగ్ ఐడెంటిఫయర్లు వంటి ఇతర టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. అడ్వర్టైజింగ్ మరియు వాణిజ్య అంశాలు వంటి మా భాగస్వాములలో ఒకరి ద్వారా మేము అందించే సేవలతో మీరు సంభాషించునప్పుడు సమాచారమును సేకరించడానికి మేము ఈ టెక్నాలజీలను కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీకు మరింత సముచితమైన ప్రకటనలను చూపించడానికి ఇతర వెబ్ సైట్ లపై సేకరించిన సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. అత్యధిక వెబ్ బ్రౌజర్లు డిఫాల్ట్ గా కుకీలను స్వీకరించేలా అమర్చబడి ఉంటాయి. ఒకవేళ మీరు ప్రాధాన్యత ఇస్తే, మీరు మీ బ్రౌజర్ లేదా ఉపకరణంపై సెట్టింగ్స్ ద్వారా మామూలుగా బ్రౌజర్ కుకీలను తొలగించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అయినా, కుకీలను తొలగించడం లేదా తిరస్కరించడం అనేది మా సేవల లభ్యత మరియు ఫంక్షనాలిటీపై ప్రభావం చూపవచ్చునని గుర్తుంచుకోండి. మా సేవలు మరియు మీ ఎంపికలపై మేము మరియు మా భాగస్వాములు కుకీలను ఎలా ఉపయోగిస్తామో అనేదాని గురించి మరింత తెలుసుకొనేందుకు మా కుకీ విధానాన్ని చూడండి.

  • లాగ్ సమాచారం. మీరు మా వెబ్ సైట్ ఉపయోగించినప్పుడు మేము లాగ్ సమాచారాన్ని కూడా సేకరించవచ్చు, అవి:

    • మీరు మా సేవలను ఎలా ఉపయోగించుకున్నాారనే దాని గురించిన వివరాలు;

    • మీ వెబ్ బ్రౌజర్ రకం మరియు భాష వంటి ఉపకరణ సమాచారము;

    • ప్రాప్యత చేసుకున్న సమయాలు;

    • వీక్షించిన పేజీలు;

    • IP చిరునామా;

    • మీ ఉపకరణము లేదా బ్రౌజర్‌ను విశిష్టంగా గుర్తించే కుకీలు లేదా ఇతర సాంకేతికతలతో ముడిపడి ఉన్న ఐడెంటిఫైయర్‌లు; మరియు

    • మా వెబ్‌సైట్‌కు నావిగేట్ చేయడానికి ముందు లేదా తరువాత మీరు సందర్శించిన పేజీలు.

  • మీ అనుమతితో ఇతర సమాచారం. మీరు మా సేవలతో పరస్పర చర్య చేసినప్పుడు అదనపు సమాచారాన్ని సేకరించడానికి మీ అనుమతిని అడిగే సందర్భాలు ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు నా కోసం తయారు చేయబడిన Panel లో పాల్గొనాలనుకుంటే లేదా నివసించే ప్రాంతం లో నిర్ధిష్ట డేటా సున్నితంగా పరిగణించబడే అధికార పరిధిలో ఉంటే మేము మీ అనుమతిని అడుగుతాము మరియు సున్నితమైన డేటాతో సహా, మేము ఏ డేటాను సేకరిస్తున్నాము అనే దానిపై మీకు heads up ఇస్తాము. 

తృతీయ పక్షాల నుండి మేము సేకరించే సమాచారము

మీ గురించి సమాచారాన్ని మేము మా అనుబంధ సంస్థలు, తృతీయ పక్షాలనుండి సమాచారాన్ని సేకరించవచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:

  • మీరు మీ Snapchat ఖాతాను మరొక సేవకు (Bitmoji లేదా తృతీయ-పక్ష యాప్ వంటివి)గనక లింక్ చేస్తే, మీరు ఆ సేవను ఎలా ఉపయోగిస్తారు వంటి సమాచారాన్ని మేము ఆ ఇతర సేవ నుండి అందుకోవచ్చు.

  • మేము అడ్వర్టైజర్లు, యాప్ డెవలపర్లు, ప్రచురణకర్తలు మరియు ఇతర తృతీయ పక్షాల నుండి సమాచారాన్ని పొందవచ్చు. యాడ్ల యొక్క పని తీరును లక్ష్యంగా లేదా లెక్కించడం లొ సహాయ పడటానికి ఇతర మార్గాలతో సహా మేము ఈ సమాచారన్ని ఉపయోగించవచ్చు. మా సపోర్ట్ సైట్ లో ఈ రకమైన తృతీయ పక్ష డేటా యొక్క మా ఉపయోగం గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు.

  • మరొక వినియోగదారు వారి కాంటాక్ట్ జాబితాను అప్ లోడ్ చేస్తే, ఆ వినియోగదారుని కాంటాక్ట్ జాబితా నుండి మీ గురించిన సమాచారాన్ని మేము మీ గురించి సేకరించిన ఇతర సమాచారంతో కలపవచ్చు.

  • మీరు మీ కాంటాక్ట్ సమాచారాన్ని మాకు అందించినట్లయితే, ఈ సమాచారాన్ని మరియు తృతీయ పక్షాల నుండి పొందిన సమాచారాన్ని ఇతర మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ పై మేము మీతో సంభాషించడం చేయగలమా లేదా అని తెలుసుకోవడానికి మేము ఉపయోగించవచ్చు.

  • మా సేవా నిబంధనలు మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే సంభావ్య ఉల్లంఘనదారుల గురించి వెబ్ సైట్ ప్రచురణకర్తలు, సోషల్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు, చట్టాన్ని అమలు చేసేవారి నుండి మరియు ఇతరులతో సహా తృతీయ పక్షాల నుండి మేము సమాచారాన్ని పొందవచ్చు.

మేము సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము

మేము సేకరించిన సమాచారముతో మేము ఏమి చేస్తాము? సవివరమైన సమాధానానికి ఇక్కడకు వెళ్ళండి. సంక్షిప్త సమాధానము ఇది: మేము అవిశ్రాంతంగా మెరుగుపరచే ఉత్పత్తులు మరియు సేవల యొక్క అద్భుతమైన కూర్పును మీకు అందిస్తాము. మేము దానిని చేసే పద్ధతులు ఇదిగో ఇక్కడ ఉన్నాయి:

  • మా ఉత్పత్తులు మరియు సేవల అభివృద్ధి, ఆపరేట్ చేయడం, మెరుగుపరచడం, పంపిణీ, నిర్వహణ, మరియు రక్షించడం.

  • మా అడ్వర్టైజింగ్ సేవలు, యాడ్ టార్గెటింగ్ మరియు యాడ్ కొలతను అందించడం, వ్యక్తిగతీకరించడం, మరియు మెరుగుపరచడం, మీ కంటెంట్ మరియు ప్రశస్తమైన లొకేషన్ సమాచారం యొక్క వాడకంతో సహా (మళ్ళీ, మీరు ప్రశస్తమైన లొకేషన్ సమాచారాన్ని సేకరించడానికి మాకు అనుమతి ఇచ్చినట్లయితే) ,మా సేవలపై మరియు బయట కూడా. దీనిని చేయడానికి మేము మీ ఉపకరణముపై తృతీయ-పక్షపు యాప్స్ మరియు వెబ్‌సైట్ల యొక్క మీ వాడకము గురించిన సమాచారమును కూడా నిల్వ చేయవచ్చు. మరింత తెలుసుకోండి. మా అడ్వర్టైజింగ్ పద్ధతులు మరియు మీ ఎంపికల గురించి మరింత సమాచారం కోసం దిగువన మీ సమాచారముపై నియంత్రణ విభాగాన్ని చూడండి.

  • Snapchat అనుభవానికి సందర్భమును జోడించడం, ఉదాహరణకు, ఫోటో మీ లొకేషన్ (బహుశా, ఒకవేళ మీ ప్రశస్తమైన లొకేషన్ సేకరించడానికి మీరు మాకు అనుమతి ఇచ్చి ఉంటే) మరియు మీ ఫోటో లేదా వీడియో యొక్క కంటెంట్ (ఉదాహరణకు, ఫోటోలో గనక ఒక కుక్క ఉంటే, “డాగ్” అనే పదం ద్వారా మెమొరీస్ లో అది వెతకదగినది కావచ్చు) ఆధారంగా వెతకదగిన లేబుల్స్ ని మీ మెమొరీస్ కి ట్యాగ్ చేయడం ద్వారా.

  • ఇతర విషయాల విషయాలతోపాటు, ఫ్రెండ్స్ ని సూచించడం, Snap మ్యాప్ పైన సిఫార్సులు, ప్రొఫైల్ సమాచారం, లేదా కేమియోస్ స్టిక్కర్లు ఉంచడం, Snap చాటర్లు ఒకరినొకరు Snapchat లో కనుక్కోవడానికి సహాయపడటం ద్వారా, మా సేవలను వ్యక్తిగతీకరించడం మరియు అనుబంధ సంస్థ మరియు తృతీయ-పక్ష యాప్స్ మరియు సేవలను గుర్తించడం, మీ కంటెంట్ లేదా యాక్టివిటీ ఆధారంగా మీ ఆసక్తులను ఊహించడం, లేదా యాడ్స్ తో సహా మేము మీకు చూపించే కంటెంటును కస్టమైజ్ చేయడం.

  • వ్యక్తిగతీకరించడం, అడ్వర్టైజింగ్, ఆగ్మెంటేడ్ రియాలిటీ, న్యాయవర్తన మరియు చేకూర్పు కోసం సహా మా అల్గోరిథంలు మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని అభివృద్ధి చేయడం మరియు మెరుగుపరచడం మరియు దురుపయోగము లేదా ఇతర సేవా నిబంధనల ఉల్లంఘనలను నివారించడం. 

  • మా సేవలు ఉపయోగించబడే మార్గాలతో సహా, Snap చాటర్ మరియు సాధారణ వినియోగదారు ఆసక్తులు మరియు పోకడలను బాగా అర్థం చేసుకోవడానికి పరిశోధన నిర్వహించడం. 

  • ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ పై మీతో కమ్యూనికేట్ చేయడానికి మీరు అందించిన సమాచారాన్ని ఉపయోగించడం.

  • మా ఉత్పత్తులు మరియు సేవల యొక్క భద్రత మరియు రక్షణను మెరుగుపరచుట.

  • మీ గుర్తింపును సరిచూసుకోవడం మరియు మోసం లేదా ఇతర అనధికారిక లేదా చట్టవిరుద్ధమైన చర్యను నిరోధించడం.

  • మా సేవలు మరియు వాటితో మీ అనుభవాన్ని పెంపొందించడానికి కుకీస్ మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానం నుండి మేము సేకరించిన సమాచారాన్ని ఉపయోగించడం.

  • మా సేవా షరతులు మరియు ఇతర వాడుక పాలసీలను ఉల్లంఘించే ప్రవర్తనను ఖండించడం, దర్యాప్తు చేయడం మరియు నివేదించడం, చట్ట అమలు నుండి అభ్యర్థనలకు ప్రతిస్పందించడం మరియు చట్టపరమైన ఆవశ్యకతలతో సమ్మతి వహించడం.

  • మీరు అనుమతించిన చోట ఇమెయిల్, SMS లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ తో సహా మీకు కమ్యూనికేషన్లను పంపించడం. ఉదాహరణకు, మద్దతు విచారణలకు ప్రతిస్పందించడానికి లేదా మీకు ఆసక్తి కలిగిస్తాయని మేము భావించే మా ఉత్పత్తులు, సేవలు మరియు ప్రమోషనల్ ఆఫర్ల గురించి సమాచారం అందించడానికి మేము ఇమెయిల్ SMS లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ను ఉపయోగించుకోవచ్చు.

  • పోకడలు మరియు వాడకమును పర్యవేక్షించడం మరియు విశ్లేషించడం.

  • ఒకవేళ మీరు Apple యొక్క ట్రూ డెప్త్ కెమెరా తో Apple పరికరం ఉపయోగిస్తే, లెన్సెస్ యొక్క నాణ్యతను మెరుగుపరిచేందుకు మేము Apple యొక్క ట్రూ డెప్త్ కెమెరా నుండి సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఈ సమాచారము వాస్తవ సమయము‌లో ఉపయోగించుకోబడుతుంది—మేము ఈ సమాచారమును మా సర్వర్లపై నిల్వ చేసుకోము లేదా తృతీయ పక్షాలతో దాన్ని పంచుకోము.

మేము సమాచారాన్ని ఎలా పంచుకుంటాము

మేము సేకరించిన సమాచారాన్ని మేము ఎందుకు షేర్ చేస్తాము? చాలాసార్లు, మీరు మమ్మల్ని అడగడం వల్ల. ఒక్కోసారి అవసరం కాబట్టి షేర్ చేస్తుంటాం. మేము మీ గురించి సమాచారాన్ని షేర్ చేసే మార్గాలు ఇక్కడ ఉన్నాయి:

  • ఇతర Snapchatters తో. మేం ఇతర Snapchatters తో ఈ క్రింది సమాచారాన్ని పంచుకోవచ్చు:

    • మీ యూజర్ నేమ్, పేరు మరియు Bitmoji వంటి మీ గురించిన సమాచారము.

    • మీ Snapchat "స్కోర్", మీరు ఫ్రెండ్స్గా ఉన్న Snap చాటర్ల పేర్లు, Snapchat లో మీ ఫ్రెండ్స్ తో మీరు ఎంత సన్నిహితంగా ఉన్నారు, మీరు ఇటీవల Snapchat లో చురుకుగా ఉన్నారా, మీ ఇటీవలి లొకేషన్ హిస్టరీ (Snap మ్యాప్ లో మీ ఖచ్చితమైన లొకేషన్ని షేర్ చేయాలని మీరు ఎంచుకుంటే) వంటి మా సేవలు మరియు మీరు నిమగ్నమైన కంటెంట్ గురించి సమాచారం; మరియు మా సేవలను ఉపయోగించి ఇతరులతో మీ కనెక్షన్ లను అర్థం చేసుకోవడానికి Snap చాటర్ల కు సహాయపడే ఇతర సమాచారం. ఉదాహరణకు, మీకు నిజంగా తెలిసిన వారి నుండి కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందా అనేది క్లియర్గా తెలియకపోవచ్చు కాబట్టి, మీకు మరియు అభ్యర్థనదారుకు Snapchat ఫ్రెండ్స్ ఉమ్మడిగా ఉన్నారా లేదా ఒకే ప్రాంతంలో ఉన్నారా అని మేము షేర్ చేయవచ్చు.

    • మీరు అనుకూలంగా చూడదగిన ఫార్మాట్ లో చాట్‌లు, Snaps, మరియు ఇతర కంటెంటును అందుకోవడానికి మీకు సహాయపడేందుకై, ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఉపకరణం రకం వంటి మీ ఉపకరణం గురించిన సమాచారము.

    • మీరు పంచుకోమని మాకు నిర్దేశించిన ఏదైనా అదనపు సమాచారము. ఉదాహరణకు, మీరు మీ Snapchat ఖాతాను ఒక తృతీయ-పక్ష యాప్ కు కనెక్ట్ చేసినప్పుడు, మరియు మీరు Snapchat నుంచి సమాచారం లేదా కంటెంట్‌ను తృతీయ-పక్ష యాప్ కు పంచుకున్నప్పుడు, Snap మీ సమాచారాన్ని పంచుకుంటుంది.

    • ప్రారంభించబడితే, Snap మ్యాప్ లో మీ ఎంచుకున్న ఫ్రెండ్స్ తో మీ రియల్ టైమ్ ఖచ్చితమైన లొకేషన్ ను మేము షేర్ చేస్తాము (కానీ మేము దానిని మీరు ఎంచుకున్న వ్యవధికి మాత్రమే షేర్ చేస్తాము).

    • మీరు పోస్ట్ చేసిన లేదా పంపించిన కంటెంట్. మీ కంటెంట్ ఎంత విస్తృతంగా పంచుకోబడిందనేది మీ వ్యక్తిగత సెట్టింగ్స్ మరియు మీరు ఉపయోగిస్తున్న సర్వీస్ యొక్క రకము‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఎంచుకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ కి ఒక Snap పంపబడవచ్చు, కానీ మీ స్టోరీ Snap లను మీరు మీ స్టోరీని చూడటానికి అనుమతించే ఏ Snap చాటర్ అయినా చూడవచ్చు.

  • Snap చాటర్లు, మా వ్యాపార భాగస్వాములు మరియు సాధారణ ప్రజలతో. మేం ఈ క్రింది సమాచారాన్ని Snapchatters అందరితో అదేవిధంగా మా వ్యాపార భాగస్వాములు మరియు సాధారణ ప్రజానీకము అందరితోనూ పంచుకోవచ్చు:

    • మీ పేరు, యూజర్ నేమ్, ప్రొఫైల్ చిత్రాలు, Bitmoji, Snapcode మరియు పబ్లిక్ ప్రొఫైల్ వంటి పబ్లిక్ సమాచారం.

    • మీ హైలైట్స్, కస్టమ్ Stickers, Lenses, ప్రతిఒక్కరూ వీక్షించడానికి సెట్ చేయబడిన Story సమర్పణలు మరియు స్పాట్‌లైట్, Snap Map మరియు ఇతర క్రౌడ్-సోర్స్డ్ సర్వీసుల వంటి సహజమైన పబ్లిక్ సర్వీసుకు మీరు సమర్పించే ఏదైనా కంటెంట్ వంటి బహిరంగ కంటెంటు. ఈ కంటెంట్‌ను శోధన ఫలితాల ద్వారా, వెబ్‌సైట్‌లలో, యాప్‌లలో మరియు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్రసారాలతో సహా, మా సేవలపై మరియు వెలుపల ప్రజలందరూ చూడవచ్చు, ఉపయోగించుకోవచ్చు మరియు షేర్ చేయవచ్చు.

  • తృతీయ పక్షాలతో. మేము తృతీయ పక్షాలతో సమాచారాన్ని ఈ క్రింది విధాలుగా పంచుకోవచ్చు:

    • మీకు సంబంధించిన సమాచారాన్ని మా తరఫున చెల్లింపులు మరియు అంచనాలు వేయడం మరియు ప్రకటనలు బాగా పనిచేసేలా చూడటం, తృతీయ పక్ష వెబ్‌సైట్లు మరియు యాప్స్‌లో సంబంధమున్న మరిన్ని ప్రకటనలను అందజేయడంవంటి సేవలను మా తరఫున అందించే సర్వీస్ ప్రొవైడర్స్ తో మేము పంచుకోవచ్చు.

    • మా సేవలపై సేవలను మరియు విధినిర్వహణను అందించే వ్యాపార భాగస్వాములతో మేము మీ గురించిన సమాచారాన్ని పంచుకోవచ్చు. మా సర్వీసులపై తృతీయ పక్షాలచే సేకరించిన సమాచారం గురించి మరింత సమాచారం కొరకు, మా సపోర్ట్ సైట్ సందర్శించండి.

    • మాకు సాయం చేయడానికి మరియు ఇతరులు మోసాలను నిరోధించడానికి, పరికరం మరియు ఉపయోగం సమాచారం వంటి మీ గురించి సమాచారాన్ని మేము పంచుకోవచ్చు.

    • చట్టపరమైన, సురక్షిత మరియు భద్రతా కారణాల కొరకు మేము మీ గురించిన సమాచారాన్ని పంచుకోవచ్చు. ఈ క్రింది పనులకు సమాచారమును వెల్లడించడం అవసరమని మేము సహేతుకంగా విశ్వసించినట్లయితే, మేము మీ గురించిన సమాచారాన్ని పంచుకోవచ్చు:

      • ఏదైనా చెల్లుబాటు అయ్యే చట్టపరమైన ప్రక్రియ, ప్రభుత్వ అభ్యర్థన లేదా వర్తించే చట్టం, నియమం లేదా నిబంధనతో సమ్మతి వహించుట.

      • సంభావ్య సేవా షరతులు మరియు కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనలను దర్యాప్తు చేయుట, పరిష్కరించుట లేదా అమలు చేయుట.

      • మా యొక్క, మా వినియోగదారుల లేదా ఇతరుల హక్కులు, ఆస్తి లేదా భద్రతను పరిరక్షించుట.

      • ఏదైనా మోసం లేదా భద్రతా సమస్యలను కనిపెట్టుట మరియు పరిష్కరించుట.

    • విలీనం లేదా సముపార్జనలో భాగంగా మీ గురించి సమాచారాన్ని మేం పంచుకోవచ్చు. ఒకవేళ Snap Inc. విలీనం, ఆస్తి అమ్మకం, ఆర్థిక సహాయం చేయడం, లిక్విడేషన్ లేదా దివాలా, మా బిజినెస్ మొత్తం లేదా కొంత భాగాన్ని మరో కంపెనీకి స్వాధీనం చేసినట్లయితే, లావాదేవీ ముగియడానికి ముందు మరియు ఆ తర్వాత మేము మీ సమాచారాన్ని ఆ కంపెనీతో పంచుకోవచ్చు.

  • వ్యక్తిగత-యేతర సమాచారము. మాకు సేవలను అందించే లేదా వ్యాపార ఆవశ్యకతలను నిర్వర్తించే తృతీయపక్షాలతో కూడా మేము సమగ్రమైనటువంటి, వ్యక్తిగతంగా గుర్తించలేనటువంటి లేదా గుర్తింపు-విడదీయబడని సమాచారాన్ని పంచుకోవచ్చు.

తృతీయ-పక్ష కంటెంట్ మరియు విలీనములు

మా సేవలు తృతీయ-పక్ష కంటెంట్ మరియు విలీనములను కలిగి ఉండవచ్చు. ఉదాహరణలలో, కెమెరాలో తృతీయ-పక్ష విలీనములు, చాట్‌లో తృతీయ-పక్ష గేమ్‌లు మరియు తృతీయ-పక్ష Snap కిట్ విలీనములు చేరి ఉంటాయి. ఈ విలీనముల ద్వారా, మీరు తృతీయపక్షానికి అదేవిధంగా Snap‌కు సమాచారాన్ని అందిస్తూ ఉండవచ్చు. ఆ తృతీయ పక్షాాలు మీ సమాచారాన్ని ఎలా సేకరిస్తాయో లేదా ఎలా ఉపయోగిస్తాయో అనేదానికి మేము బాధ్యులు కాదు. ఎప్పటి లాగానే, మా సర్వీసుల ద్వారా మీరు ఇంటరాక్ట్ చేసే తృతీయ పక్షాలతో సహా మీరు సందర్శించే లేదా ఉపయోగించే ప్రతి తృతీయ పక్షపు సేవ‌ల గోప్యతా విధానాలను మీరు సమీక్షించాల్సిందిగా మేం ప్రోత్సహిస్తాం. Snapchatలో తృతీయ-పక్ష సేవలగురించి ఇక్కడ మీరు మరింతగా తెలుసుకోవచ్చు.

మేము మీ సమాచారాన్ని ఎంతకాలం ఉంచుకుంటాము

ఆ క్షణం గడపడానికి ఏది ఇష్టమో దాన్ని మీరు గ్రహించడానికి Snapchat మీకు వీలు కలిగిస్తుంది. మా వైపు, అంటే Snapchat లో పంపిన చాలా సందేశాలు - Snap లు మరియు చాట్ లు వంటివి - మీరు మీ డిఫాల్ట్ సెట్టింగ్ల ను మార్చకపోతే లేదా ఏదైనా సేవ్ చేయాలని నిర్ణయించుకుంటే తప్ప, అవి అన్ని గ్రహీతలచే తెరవబడ్డాయని లేదా గడువు ముగిసినట్లు మేము గుర్తించిన తర్వాత డీఫాల్ట్ గా మా సర్వర్ల నుండి స్వయంచాలకంగా తొలగించబడతాయి. స్టోరీ పోస్టులు వంటి ఇతర కంటెంట్, ఎక్కువ కాలం భద్రపరచబడుతుంది. విభిన్న రకాల కంటెంట్ ని మేము ఎంతకాలం స్టోర్ చేస్తాము అనే దాని గురించి తాజా సమాచారం కోసం, మాసపోర్ట్ సైట్చూడండి.

మేము ఇతర సమాచారాన్ని చాలా ఎక్కువ కాలం పాటు నిల్వ చేస్తాము. ఉదాహరణకు:

  • మీ ప్రాథమిక ఖాతా సమాచారము - మీ పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామా వంటివి నిల్వ చేసుకుంటాము — మరియు వాటిని తొలగించండి అని మీరు అడిగేవరకూ స్నేహితుల యొక్క జాబితాను మేము భద్రపరుస్తాము.

  • స్థానపు సమాచారము ఎంత ప్రశస్తమైనది మరియు మీరు ఏ సేవలను ఉపయోగించుకుంటున్నారు అనేదానిని బట్టి మేము దానిని వివిధ కాలవ్యవధులపాటు భద్రపరుస్తాము. ఒకవేళ స్థానపు సమాచారం గనక Snap తో ముడిపడి ఉంటే - Memories కు సేవ్ చేయబడిన లేదా Snap Map లేదా Spotlight ‌కు పోస్ట్ చేయబడినట్లుగా - మేము Snap ని నిల్వ చేసుకున్నంత కాలమూ మేము ఆ స్థానమును నిలుపుకుంటాము. మంచి చిట్కా: మేము మీ గురించి నిలుపుకున్న స్థానపు డేటాను మీరు మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడంద్వారా చూడవచ్చు.

ఒకవేళ మీరు ఎప్పుడైనా Snapchatను ఉపయోగించడం ఆపివేయాలని నిర్ణయించుకుంటే, మీరు కేవలం మీ ఖాతాను తొలగించమని మమ్మల్ని కోరండి. మేము కూడా మీరు కొంతకాలం నిష్క్రియాత్మకంగా ఉన్న తర్వాత మీ గురించి మేము సేకరించిన సమాచారములో ఎక్కువ భాగాన్ని తొలగిస్తాము!

మా తొలగింపు ఆచరణలను ఆటోమేటిక్‌గా చేపట్టేలా మా సిస్టమ్‌లు రూపొందించబడి ఉండడం వల్ల, ఒక నిర్దిష్ట సమయపరిధి లోపున తొలగింపు జరుగుతుందని మేం వాగ్దానం చేయలేమని మనసులో ఉంచుకోండి. మీ డేటాను నిల్వ చేయడానికి చట్టపరమైన అవసరాలు ఉండవచ్చు మరియు మేము కంటెంట్‌ను సంరక్షించమని చెల్లుబాటు అయ్యే చట్టపరమైన ప్రక్రియను స్వీకరించినట్లయితే, దుర్వినియోగం లేదా ఇతర సేవా నిబంధనల ఉల్లంఘనల నివేదికలను స్వీకరించినట్లయితే లేదా మీ ఖాతా, కంటెంట్ సృష్టించబడినట్లయితే, మేము ఆ తొలగింపు పద్ధతులను తాత్కాలికంగా నిలిపివేయవలసి ఉంటుంది. మీ ద్వారా లేదా ఇతర వినియోగదారులతో సృష్టించబడిన కంటెంట్ దుర్వినియోగం లేదా ఇతర సేవా నిబంధనల కోసం ఇతరులు లేదా మా సిస్టమ్‌లచే ఫ్లాగ్ చేయబడింది అంతిమంగా, మేము కొంత నిర్దిష్ట సమాచారమును పరిమిత కాలవ్యవధి పాటు లేదా చట్టముచే ఆవశ్యకమైనట్లుగా బ్యాకప్‌లో కూడా నిలిపి ఉంచుకోవచ్చు.

మీ సమాచారంపై నియంత్రణ

మీ సమాచారంపై మీరు నియంత్రణ కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము, కాబట్టి మేము మీకు ఈ క్రింది సాధనాలను అందిస్తాము.

  • యాక్సెస్, కరెక్షన్, మరియు పోర్టబిలిటీ. మీరు మా అప్లికేషన్ లోనే మీ ప్రాథమిక అకౌంట్ సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు మరియు సవరించవచ్చు. పోర్టబుల్ ఫార్మెట్ లో మా యాప్స్ లో లభ్యం కాని సమాచారం యొక్క కాపీని పొందడానికి మీరు డౌన్లోడ్ నా డేటానుకూడా ఉపయోగించవచ్చు, కాబట్టి మీరు దానిని తరలించవచ్చు లేదా మీకు కావలసిన చోట స్టోర్ చేయవచ్చు. మీ గోప్యత మాకు ముఖ్యమైనది కనుక, మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాప్యత చేయడానికి లేదా అప్డేట్ చేయడానికి మేము మిమ్మల్ని అనుమతించే ముందు మీ గుర్తింపును ధృవీకరించమని లేదా అదనపు సమాచారాన్ని అందించమని మేము మిమ్మల్ని అడుగుతాము. మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రాప్యత చేయడానికి లేదా అప్డేట్ చేయడానికి మీ అభ్యర్థనను అనేక కారణాల వల్ల కూడా మేము తిరస్కరించవచ్చు, ఉదాహరణకు, అభ్యర్థన ఇతర వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించినట్లయితే లేదా చట్టవిరుద్ధం అయితే.

  • అనుమతులు ఉపసంహరించుకోవడం. చాలా సందర్భాలలో, మీరు మీ సమాచారాన్ని ఉపయోగించడానికి మమ్మల్ని అనుమతించినట్లయితే, మీ పరికరం ఆ ఎంపికలను అందిస్తే యాప్ లో లేదా మీ పరికరంలో సెట్టింగ్లను మార్చడం ద్వారా మీరు మీ అనుమతిని ఉపసంహరించుకోవచ్చు. వాస్తవానికి, మీరు అలా చేస్తే, కొన్ని సేవలు పూర్తి పనితీరును కోల్పోవచ్చు. SMS లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా పంపిన ప్రమోషనల్ ఇమెయిల్ లు మరియు సందేశాల కొరకు, అన్సబ్స్క్రయిబ్ లింక్ లేదా అందించబడ్డ ఇలాంటి మెకానిజంపై క్లిక్ చేయడం ద్వారా మీరు నిష్క్రమించవచ్చు.

  • తొలగింపు. మీరు జీవితకాల Snap చాటర్ గా ఉంటారని మేము ఆశిస్తున్నాము, కొన్ని కారణాల వల్ల మీరు ఎప్పుడైనా మీ అకౌంట్ ను డిలీట్ చేయడం, ఎలాగో తెలుసుకోవడానికి ఇక్కడకు వెళ్లండి. మెమోరీస్ కు సేవ్ చేసిన ఫొటోలు, My AI తో మీ సంభాషణలు, స్పాట్‌లైట్ సబ్మిషన్లు, సెర్చ్ హిస్టరీ వంటి కొన్ని సమాచారాన్ని కూడా యాప్ లో డిలీట్ చేయవచ్చు.

  • అడ్వర్టైజింగ్ ప్రాధాన్యతలు. మీ ఆసక్తులకు సంబంధించినవిగా మేము భావించే యాడ్స్ ను మీకు చూపించడానికి మేము ప్రయత్నిస్తాము. ఈ యాడ్స్ ను ఎంచుకోవడానికి మేము మరియు మా అడ్వర్టైజింగ్ భాగస్వాములు ఉపయోగించే సమాచారాన్ని మీరు సవరించాలనుకుంటే, మీరు యాప్ లో మరియు మీ పరికర ప్రాధాన్యతల ద్వారా చేయవచ్చు. మరింత తెలుసుకోవడానికి ఇక్కడకు వెళ్లండి.

  • ట్రాకింగ్. iOS 14.5 లేదా అంతకంటే ఎక్కువ ఇటీవలి డివైజ్లను రన్ చేసే వినియోగదారులకు, కొన్ని నిర్దిష్ట అవసరాలు వర్తిస్తాయి. వాటిని మేము ఇక్కడ పేర్కొన్నాము. 

  • ఇతర Snap చాటర్లు తో కమ్యూనికేట్ చేయడం. మీరు ఎవరితో కమ్యూనికేట్ చేస్తారనే దానిపై మీరు నియంత్రణలో ఉండటం మాకు చాలా ముఖ్యం. అందుకే మేము సెట్టింగ్లలో అనేక సాధనాలను నిర్మించాము, ఇతర విషయాలతో పాటు, మీరు మీ స్టోరీస్ ను ఎవరు చూడాలనుకుంటున్నారు, మీరు కేవలం మీ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ మరియు కాంటాక్టులు లేదా అందరు Snap చాటర్లు నుండి Snap లను స్వీకరించాలనుకుంటున్నారా మరియు మరొక Snap చాటర్ మిమ్మల్ని మళ్లీ సంప్రదించకుండా బ్లాక్ చేయాలనుకుంటున్నారా అని సూచించడానికి మిమ్మల్ని అనుమతించే అనేక సాధనాలను మేము రూపొందించాము. మరింత తెలుసుకోవడానికి ఇక్కడకు వెళ్లండి.

అంతర్జాతీయ డేటా బదిలీలు

యునైటెడ్ స్టేట్స్ మరియు మీరు నివసించే ఇతర దేశాల బయటివైపు నుండి మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చు, దానిని బదిలీ చేయవచ్చు మరియు నిల్వ చేయవచ్చు మరియు ప్రక్రియ జరుపవచ్చు. మీరు నివసించే ప్రదేశానికి బయటి వైపుకు మేము సమాచారాన్ని పంచుకున్నప్పుడు, మేము చట్టబద్ధంగా అలా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, సముచితమైన బదిలీ పద్ధతి అమలులో ఉండేవిధంగా మేము చూసుకుంటాము. మేము సమాచారాన్ని పంచుకునే ఏవైనా మూడవ పక్షాలు కూడా సముచితమైన బదిలీ పద్ధతిని కలిగి ఉండేట్లుగా మేము చూసుకుంటాము. మేము పంచుకొనే తృతీయపక్షాల కేటగిరీలపై మరింత సమాచారాన్ని మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.

రాష్ట్ర మరియు ప్రాంత నిర్దిష్ట సమాచారం

మీ రాష్ట్రం లేదా ప్రాంతంలో మీరు నిర్ధిష్ట గోప్యతా హక్కులు కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్‌లో, కాలిఫోర్నియా మరియు ఇతర రాష్ట్రాల నివాసితులు నిర్దిష్ట గోప్యతా హక్కులను కలిగి ఉన్నారు. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా (EEA), UK, బ్రెజిల్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మరియు ఇతర అధికార పరిధిలోని స్నాప్‌చాటర్‌లు కూడా నిర్దిష్ట హక్కులను కలిగి ఉంటాయి. రాష్ట్ర మరియు ప్రాంతం యొక్క నిర్ధిష్ట వెల్లడి గురించి మేము ఇక్కడ తాజా అవలోకనం ఉంచుతాం.

పిల్లలు

13 సంవత్సరాల లోపు ఎవరికీ మా సేవలు ఉద్దేశించబడలేదు — మరియు వాటిని వారి కోసం మేము నిర్దేశించము. మరి అందుకనే మేము 13 సంవత్సరాల లోపు ఎవరినుండి అయినా తెలిసి తెలిసీ వ్యక్తిగత సమాచారమును సేకరించము. అదనంగా, 13 మరియు 16 సంవత్సరాల మధ్య వయసు గల EEA మరియు UK వాడుకదారుల యొక్క సమాచారములో కొంతదాన్ని మేము ఎలా సేకరించి, ఉపయోగించుకొని మరియు నిల్వ చేసుకుంటామో మేము పరిమితం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఈ వాడుకదారులకు మేము కొన్ని విధివిధానాలను అందించలేమని అర్థం. ఒకవేళ మీ సమాచారాన్ని ప్రక్రియ జరపడానికి ఒక చట్టబద్ధమైన ఆధారంగా సమ్మతి పైన మేము ఆధారపడాల్సి వస్తే, మరియు పేరెంట్ నుండి సమ్మతి మీ దేశానికి అవసరమైతే, ఆ సమాచారమును సేకరించి ఉపయోగించడానికి ముందుగా మాకు మీ పేరెంట్ యొక్క సమ్మతి అవసరం కావచ్చు.

గోప్యతా పాలసీకి సవరణలు

మేము ఈ గోప్యత పాలసీని సమయానుగుణంగా మార్చవచ్చు. అయితే, మేము అలా చేసేటప్పుడు, మేము మీకు ఏదో ఒక విధంగా తెలియజేస్తాము. కొన్నిసార్లు, మా వెబ్‌సైట్ మరియు మొబైల్ అప్లికేషన్ పై ఉండే గోప్యత పాలసీ యొక్క పైభాగములోని తేదీని సవరించడం ద్వారా మేము మీకు తెలియజేస్తాము. ఇతర సమయాలలో, మేము మీకు అదనపు నోటీసు ఇవ్వవచ్చు (మా వెబ్‌సైట్ యొక్క హోమ్ పేజీలకు ఒక స్టేట్‌మెంట్ జోడించడం లేదా మీకు యాప్-లోపలి నోటిఫికేషన్ ఇవ్వడం వంటిది).