డెలివరీ చేయబడినట్లుగా ఎవాన్ స్పీజెల్ యొక్క సెనేట్ కాంగ్రెషనల్ టెస్టిమోని

31 జనవరి, 2024

ఈ రోజున, మా సహ వ్యవస్థాపకుడు మరియు CEO ఇవాన్ స్పీగెల్, న్యాయవ్యవస్థపై యునైటెడ్ స్టేట్స్ సెనేట్ కమిటీ ముందు తన వాదన వినిపించేందుకు ఇతర టెక్ ప్లాట్‌ఫారమ్స్‌తో చేరారు. కమిటీ ముందు ఇవాన్ మౌఖికంగా ఇచ్చిన సాక్ష్యపు పూర్తిపాఠాన్ని మీరు చదవవచ్చు.

***

ఛైర్మన్ డర్బిన్, ర్యాంకింగ్ సభ్యుడు గ్రాహమ్, మరియు కమిటీలోని ఇతర సభ్యులకు, పిల్లలను ఆన్‌లైన్‌లో రక్షించేందుకు ఈ హియరింగ్ ఏర్పాటు చేసినందుకు మరియు ముఖ్యమైన చట్టాన్ని చేసేందుకు మీరు తీసుకొన్న చొరవకు ధన్యవాదాలు.

ఇవాన్ స్పీగెల్ అనే నేను, Snap యొక్క సహ వ్యవస్థాపకుడు మరియు CEOని.

మేము, ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో కమ్యూనికేట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే ఆన్‌లైన్ సేవ Snapchatను సృష్టించాము.

మీరు అందరూ Snapchat సృష్టించబడటానికి ఎంతోకాలం ముందునుండే ఆన్‌లైన్‌లో పిల్లలను రక్షించేందుకు పని చేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు. ఈ విషయమై దీర్ఘకాలంగా మీరు చూపుతున్న అంకితభావానికి మరియు మన కమ్యూనిటీని సురక్షితంగా ఉంచడంలో కలసి పనిచేసేందుకు మీరు ఇష్టపడటానికి మేము కృతజ్ఞులమై ఉంటాము.

ఈ సందర్భంగా నేను, ఆన్‌లైన్‌లోని ప్రమాదాలనుండి తప్పించుకొన్నవారిని మరియు తమకు ప్రియమైన వారిని కోల్పోయిన బాధను అనుభవించేవారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను.

ప్రజలకు సంతోషం మరియు ఆనందాన్ని అందించడానికి మేము రూపొందించిన సేవ హాని కలిగించేలా దుర్వినియోగం చేయబడిందని నేను భావించే ప్రగాఢ విచారాన్ని మాటల్లో వర్ణించలేను.

మన కమ్యూనిటీని భద్రంగా ఉంచేందుకు మేము మా బాధ్యతను గుర్తించామని నేను స్పష్టం చేయదలచుకొన్నాను.

ఈ సమస్యలపై అవగాహన కల్పించేందుకు, మార్పును స్వాగతించేందుకు, శాసనకర్తలతో కలసి పనిచేసి జీవితాలను రక్షించేందుకు దోహదపడే కూపర్ డేవిస్ చట్టాన్ని తీసుకొని రావడంలో చురుకైన పాత్ర పోషించిన ఎన్నోకుటుంబాలను ఈ సందర్భంగా నేను మననం చేసుకొంటున్నాను.

నేను ఇరవై సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, మా సహ-వ్యవస్థాపకుడు బాబీ మర్ఫీతో కలసి Snapchat నిర్మించడం ప్రారంభించాను. మేము యుక్తవయస్సులో ఉన్నప్పుడు మేము ఎదుర్కొన్న సమస్యలలో కొన్నింటిని పరిష్కరించేందుకు మేము Snapchatను రూపొందించాము.

మా వద్ద సామాజిక మాధ్యమానికి ప్రత్యామ్నాయం లేదు. అంటే ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన చిత్రాలు శాశ్వతంగా ఉండటంతోపాటు, ప్రజామోద మెట్రిక్స్‌కు లోబడి ఉండేవి. అది మాకు మంచిగా అనిపించలేదు.

మా ఫ్రెండ్స్‌తో వేగవంతంగా, సరదాగా మరియు గోప్యంగా సంభాషించడానికి అనువుగా ఉండేలా ఒక కొత్త మార్గం ఉండాలనే ఉద్దేశ్యంతో మేము Snapchatను భిన్నంగా రూపొందించాము. ఒక చిత్రం వెయ్యి భావాలను పలికిస్తుంది, అందువల్ల Snapchatపై ప్రజలు చిత్రాలతో కమ్యూనికేట్ చేసుకొంటారు.

మీరు మీ స్టోరీని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకొన్నప్పుడు, వాటికి బహిరంగ లైకులు లేదా వ్యాఖ్యలు ఉండవు.

Snapchat అనేది డీఫాల్ట్‌గా గోప్యంగా ఉంటుంది, అంటే ప్రజలు తమకిష్టమైన ఫ్రెండ్స్‌ను చేర్చడానికి మరియు వారిని ఎవరు కాంటాక్ట్ చేయవచ్చు అనేదాన్ని ఎంచుకోవలసి ఉంటుంది.

మేము Snapchatను స్థాపించినప్పుడు, మా సర్వీస్ ద్వారా పంపబడిన చిత్రాలు మరియు వీడియోలు డీఫాల్ట్‌గా డిలిట్ చేయబడేలా నిర్ణయించాము.

రికార్డ్ చేయబడని ఫోన్ కాల్స్ ద్వారా గోప్యతను పొందిన ఇంతకుముందరి తరాల మాదిరిగా, మన తరం Snapchat ద్వారా, అంతగా పిక్చర్ పర్‌ఫెక్ట్ కాకపోయినా, కొంతమేరకు ఏవిధంగా పనితీరు కనపరచకుండా భావోద్వేగాన్ని పంచుకొనేవిధంగా ఆ క్షణాలను షేర్ చేసుకొనే సౌలభ్యాన్ని కలిగివుంది.

Snapchat సందేశాలు డీఫాల్ట్‌గా తొలగించబడినప్పటికీ, స్వీకర్త ఆ చిత్రాలు మరియు వీడియోలను సేవ చేసుకోవచ్చని మేము అందరికీ తెలియజేస్తున్నాము.

మేము చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన కంటెంట్‌పై చర్య తీసుకున్నప్పుడు, తమ పరిశోధనలో చట్టం అమలు పరచే యంత్రాంగానికి మద్దతు ఇవ్వడానికి వీలు కలిగించేలా పొడిగించబడిన ఒక వ్యవధికి మేము ఆధారాలను మా వద్ద ఉంచుకొంటాము.

Snapchatపై హానికరమైన కంటెంట్ వ్యాప్తిని నివారించడంలో సహాయపడటానికి, ఆటోమేటెడ్ ప్రక్రియలు మరియు మానవ సమీక్షల కలయికను ఉపయోగించి, మా సేవలపై కంటెంట్‌ను మేము సిఫారసు చేస్తాము.

మేము మా నియమాలను అన్ని అకౌంట్లలో, ఒకేవిధంగా మరియు తగినవిధంగా వర్తింపజేస్తాము. మేము దానిని సరిగ్గా పొందుతున్నాయని ధ్రువీకరించుకొనేందుకు, నమూనాలను మా నాణ్యతా హామీ చర్యలద్వారా అమలుపరచి పరీక్షిస్తాము.

పిల్లల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన విషయం, మాదకద్రవ్య సంబంధిత కంటెంట్ మరియు ఇతర రకాల హానికరమైన కంటెంట్‌ను మేము చురుగ్గా స్కాన్ చేసి, ఆ రకమైన కంటెంట్‌ను తొలగించి, హానికారకాలైన ఖాతాలను నిర్వీర్యం చేయడంతోపాటు, డివైజ్-బ్లాక్ చేసి, చట్టం అమలు పరచేవారికొరకు సాక్ష్యాలను భద్రపరుస్తాము మరియు ఆ విధమైన కంటెంట్‌పై తగిన చర్యలు తీసుకొనే విధంగా సంబంధిత అధారిటీలకు రిపోర్ట్ చేస్తాము.

గత సంవత్సరం మేము నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్‌కు మేము 6,90,000 నివేదికలను తయారుచేశాము, వీటివల్ల 1,000కు పైగా అరెస్టులు చేయబడ్డాయి. మేము 22 లక్షల మాదకద్రవ్య సంబంధ కంటెంట్‌ను కూడా తొలగించాము మరియు 7,05,000 సంబంధిత అకౌంట్లను బ్లాక్ చేశాము.

ఎంతో కఠినంగా ఉండే మాగోప్యతా సెట్టింగులు, కంటెంట్ మోడరేషన్ ప్రయత్నాలు, చురుకైన శోధన మరియు చట్టం అమలుకు సహకారాలు ఉన్నప్పటికీ, ప్రజలు ఆన్‌లైన్ సేవలను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని చెడు పనులు జరుగుతాయి. అందువల్లనే పదమూడు సంవత్సరాల వయస్సులోపు పిల్లలు Snapchatపై కమ్యూనికేట్ చేయడానికి ఇంకా సిద్ధంగా లేరని మేము విశ్వసిస్తాము.

iPhone మరియు Androidలపై డివైజ్-స్థాయి తల్లిదండ్రుల నియంత్రణలు కలిగివుండేలా మేము తల్లిదండ్రులను గట్టిగా ప్రోత్సహిస్తాము. మేము మా స్వంత ఇంట్లోకూడా దీనిని అమలు పరుస్తాము మరియు పదమూడు సంవత్సరాల మా బిడ్డ చేసే డౌన్‌లోడ్ చేసే ప్రతి యాప్‌ను నాభార్య ఆమోదిస్తుంది.

మరింత విజిబులిటీ మరియు నియంత్రణలను కోరుకొనే తల్లిదండ్రులకు, మేము Snapchatలో ఫ్యామిలీ సెంట‌ర్‌ను నిర్మించాము, దీనిలో యుక్తవయస్సులోని మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారో చూడవచ్చు, గోప్యతా సెట్టింగులు సమీక్షించి, కంటెంట్ పరిమితులను సెట్ చేయవచ్చు.

కిడ్స్ ఆన్‌లైన్ భద్రతా చట్టం మరియు కూపర్ డేవిస్ చట్టంవంటి శాసనాలపై ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులతో మేము ఎన్నో సంవత్సరాలు పనిచేశామని మరియు వారికి మద్దతుగా నిలిచినందుకు మేము గర్విస్తున్నాము. ఆన్‌లైన్‌లో పిల్లలను రక్షించే చట్టానికి విస్తృత పరిశ్రమ మద్దతును అందించేందుకు నేను ప్రోత్సహించదలచుకొన్నాను.

ఏ చట్టంకూడా పరిపూర్ణం కాదు, కాని దీనిలోని కొన్ని నియమాలు ఏవీలేని దానికంటే ఉత్తమం.

పరిశ్రమ, ప్రభుత్వం, లాభాపేక్ష లేని సంస్థలు, NGOలు మరియు ప్రత్యేకించి, చట్టాన్ని అమలు చేసేవారు మరియు ప్రజలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి తమ జీవితాలను అంకితం చేసే మొట్టామొదటి ప్రతిస్పందించే మా భాగస్వాముల మద్దతు లేకుండా మా సేవను ఉపయోగించే వ్యక్తులను రక్షించడానికి మేము చేస్తున్న కృషిలో చాలావరకు పని సాధ్యం కాదు.

నేరస్తులు, తమ నేరాలను కొనసాగించేందుకు ఆన్‌లైన్ సేవలను ఉపయోగించకుండా నిరోధించేందుకు మన దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న చర్యలపట్ల నేను ఎంతో కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాను.

నాకు మరియు నా కుటుంబానికి ఈ దేశం ఇచ్చిన అవకాశాలపట్ల నేను వినయపూర్వకమైన కృతజ్ఞతా భావాన్ని కలిగువున్నాను. దీనికి ప్రతిగా తిరిగి ఇవ్వడానికి మరియు సానుకూల మార్పును తీసుకురావడాన్ని నేను బాధ్యతగా భావిస్తున్నాను మరియు ఎంతో ఈ ముఖ్యమైన ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు నేను కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాను.

ఆన్‌లైన్ భద్రతకు సంబంధించిన పరిష్కారంలో మేము భాగమయ్యేందుకు నేను అంకితమవుతున్నానని కమిటీ సభ్యులకు తెలియజేస్తున్నాను.

మా లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకొనేందుకు మేము నిజాయితీగా నిరంతరం కృషి చేస్తాము.

ఈ అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు మరియు మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.

తిరిగి వార్తలకు