Snapఛాటర్లకు వారి నిజమైన ఫ్రెండ్స్‌తో సురక్షితంగా కమ్యూనికేట్ చేయడానికి సహాయపడటం

17 జనవరి, 2024

ప్రారంభం నుండి, ప్రజలు ఇతర ప్లాట్‌ఫార్మ్స్‌పై ఎదుర్కొన్న ఎన్నోరకాలైన ఒత్తిళ్ళు లేకుండా, దగ్గరి ఫ్రెండ్స్ మరియు కుటుంబంతో కనెక్ట్ అయ్యేందుకు, సంప్రదాయ సామాజిక మాధ్యమాలనుండి భిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మేము Snapchat రూపొందించాము. చాలామంది యువత, Snapchatను అంతగా సన్నిహితంగా ఉండని పరిచయాల నెట్‌వర్క్ నిర్మించడం లేదా తమ అభిప్రాయాలను పంచుకోవడం కాకుండా, సన్నిహితంగా ఉండే చిన్నవైన ఫ్రెండ్స్ బృందాలతో సంభాషించేందుకు ఒక మెసేజింగ్ సేవగా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, USలోని యువత సగటున కేవలం ఐదుగురు ఫ్రెండ్స్‌తో కమ్యూనికేట్ చేసేందుకు Snapchatను ఉపయోగిస్తున్నారు.

Snapచాటర్లకు - ప్రత్యేకించి, మా కమ్యూనిటీలోని 13-17 సంవత్సరాల వయస్సుండే అతి పిన్నవయస్కులైన సభ్యులకు ఒక ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమనేది మా లక్ష్యం. భద్రత మరియు గోప్యతలకు మేము అనుసరించే విధానం, యుక్తవయస్సులోని Snapచాటర్లకు అదనపు భద్రతా చర్యలు ఉండేలా రూపొందించబడిన విభిన్నమైన మా ప్లాట్‌ఫార్మ్‌తో ప్రారంభమవుతుంది.

అనివార్యమైన ఆన్‌లైన్ ఇబ్బందులు రావడం కొనసాగుతుండటంతో, ఈ రక్షణలను మేము నిరంతరం సమీక్షిస్తూ, బలోపేతం చేస్తుంటాము, వీటిలో క్రిందివి ఉంటాయి:

  • అవాంఛిత పరిచయానికి వ్యతిరేకంగా రక్షణలు. ఒక యుక్త వయస్కుడు, Snapchat పై వేరొక వ్యక్తితో సంభాషించేటప్పుడు, అవతలి వ్యక్తి వీరికి తెలిసిన వారై ఉండాలని మేము కోరుకుంటాము, అందువల్ల ఒక కొత్తవ్యక్తి వీరిని కనుక్కోవడాన్ని మేము కఠినతరం చేస్తాము. దీనిని చేసేందుకు మేము:

    • ఇద్దరు వ్యక్తులు నేరుగా కమ్యూనికేట్ చేయడం ప్రారంభించడానికి ముందు, వారు ఒకరినొకరు ఫ్రెండ్స్‌గా అంగీకరించవలసి ఉంటుంది లేదా ఇప్పటికే వారు ఫోన్‌లో కాంటాక్టును కలిగివుండాలి.

    • యుక్తవయస్కులు, ఇద్దరూ ఒకే ఫ్రెండ్స్ లేదా కాంటాక్టులను కలిగివున్నట్లయితే మినహాయించి, వేరొకవ్యక్తికి శోధన ఫలితాలలో యాదృఛ్ఛికంగా కనిపించడాన్ని నివారించడం.

    • ఇద్దరూ ఒకే ఫ్రెండ్స్ కలిగిలేని వేరెవరైనా వ్యక్తి, ఒకవేళ యుక్తవయస్సు వారితో చాట్ చేయడానికి ప్రయత్నించినట్లయితే, వారికి ఒక పాప్-అప్ హెచ్చరిక చూపించడం.

  • ప్రజా సామాజిక పోలిక ఫీచర్లను పరిమితం చేయడం. నిజజీవితంలో వారు పరస్పరం ఉండే విధంగా, తమ ఫ్రెండ్స్‌తో ఉన్నట్లు సౌకర్యవంతంగా వెల్లడించడానికి సహాయపడేందుకు Snapchat ఉంది. అందువల్లనే Snapchat అంతులేని ఫీడ్‌ను తెరవదు మరియు వ్యక్తులు వ్యక్తిగతంగా లేదా ఫోన్‌లో మాట్లాడే విధానాన్ని అనుకరించే సందేశాలు డిఫాల్ట్‌గా డిలీట్ చేస్తుంది. దీనికి అదనంగా, మేము:

    • మీరు మీ ఫ్రెండ్స్‌తో కమ్యూనికేట్ చేసేటప్పుడు, బహిరంగ వ్యాఖ్యలు లేదా లైక్స్ అందించము.

    • హానికరమైన ప్రవర్తనల ద్వారా అనుకోకుండా వచ్చే ప్రమాదాన్ని తగ్గించేందుకు, పబ్లిక్ గ్రూపులను సిఫారసి చేయము.

    • పబ్లిక్ ఫ్రెండ్ జాబితాలను అందచేయము.

  • కంటెంట్ యొక్క బలిష్టమైన మోడరేషన్ Snapchatపై ఏది పోస్ట్ చేయవచ్చు లేదా విస్తరించవచ్చు అనేదాని గురించి మేము కఠినమైన నియమాలను కలిగివున్నాము. ఉదాహరణకు, కంటెంట్ స్పాట్‌లైట్‌పై ఆడియన్స్‌కు చేరుకోవడానికిముందు, అది మానవపరంగా మరియు ఆటోమేట్ చేయబడిన విధానంలో సమీక్షకు గురవుతుంది. మేము యాప్‌పై లైవ్ స్ట్రీమింగ్ అందించము, మరియు తప్పుడు సమాచారం లేదా హానికరమైన కంటెంట్ విస్తరించబడటానికి అనుకూలంగా మేము మా అల్గోరిథంలను ప్రోగ్రాం చేయము. యుక్తవయస్కులు అసంబద్ధ పబ్లిక్ కంటెంట్‌కు బహిర్గతం చేయబడకుండా ఉండేందుకు మేము ఇది కూడా చేస్తున్నాము:

    • మా విధానాలనుఉల్లంఘించే కంటెంట్‌ తొలగించడం.

    • యుక్తవయస్కులకు మంచిదైన మరియు సున్నితమైన కంటెంట్ ఫిల్టర్ చేయడం.

    • మా ఫ్యామిలీ సెంటర్ సాధనాలను ఉపయోగించి, తల్లిదండ్రులు యుక్తవయస్సులోని పిల్లలకు మరింత కఠినమైన కంటెంట్ నియంత్రణలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించడం.

  • Snapచాటర్లకు మద్దతిచ్చేందుకు సత్వర చర్యలు చేపట్టడం. ఎవరైనా వేరొకరి అకౌంట్‌ను తక్షణమే బ్లాక్ చేయడానికి మరియు సంబంధిత కంటెంట్ లేదా అక్కౌంట్లు మాకు రిపోర్ట్ చేయడానికి మేము Snapచాటర్లకు సులభమైన సాధనాలను అందిస్తాము. మేము స్వీకరించే ప్రతి నివేదికను సమీక్షించేందుకు మరియు సత్వర చర్య తీసుకొనేందుకు వీలుగా మేము నిరంతరం పనిచేసే ఒక గ్లోబల్ బృందాన్ని కలిగివున్నాము. దీనికితోడు, ఇంకా తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం:

    • Snapchatపై సంభాషణలు, డిఫాల్ట్‌గా డిలీట్ చేయబడిన కూడా, మేము డేటాను పొందగలిగి, చట్టాన్ని అమలుపరచే సంస్థలకు మద్దతు ఇవ్వగలుగుతున్నాము. ఉదాహరణకు, చట్టవిరుద్ధమైన ప్రవర్తనను కలిగివున్న కంటెంట్‌ను మేము తొలగించినప్పుడు, మేము దాన్ని పొడిగించిన కొంతకాలం వరకు మావద్దనే ఉంచుకుంటాము.

    • రిపోర్టింగ్ అనేది నిజంగా ముఖ్యమైనది - ఇది సంబంధిత కంటెంట్‌ను సత్వరమే సమీక్షించడానికి మాకు వీలు కల్పిస్తుంది. ఒకవేళ అది మా విధానాలను ఉల్లంఘిస్తోందని మేము కనుగొంటే, మేము దానిని తొలగిస్తాము. మాకు ఒక నివేదిక పంపడానికి మీరు ఒక Snapchat అకౌంట్ కలిగివుండాల్సిన అవసరం లేదు - తల్లిదండ్రులతో సహా ఎవరైనా ఉపయోగించడానికి వీలుగా, మేము ఆన్‌లైన్ సాధనాలను అందిస్తున్నాము.

    • ఎవరి ప్రాణమైనా ప్రమాదంలో ఉన్నట్లయితే, దానిని మా అంత మేమే సంబంధిత అధికారులకు తక్షణమే తెలియజేస్తాము.

  • తల్లిదండ్రులకు సాధనాలు మరియు వనరులు. వాస్తవ ప్రపంచ మానవ ప్రవర్తనలకు మద్దతుగా Snapchat రూపొందించబడినట్లే, తల్లిదండ్రులు నిజ జీవితంలో భద్రత గురించి సంభాషణలు చేయడానికి అలవాటుపడిన విధానాన్ని ప్రతిబింబించేలా మేము ఇన్-యాప్ సాధనాలను అందిస్తాము మా ఫ్యామిలీ సెంటర్ తల్లిదండ్రులకు వీటికి అనుమతిస్తుంది:

    • యుక్తవయస్సులోని తమ పిల్లల ఫ్రెండ్స్ ఎవరు మరియు వారు ఎంత తరచుగా మాట్లాడుతున్నారో చూసేందుకు వీలవుతుంది, కాని వాస్తవ సందేశాలు మరియు సంభాషణలు చూసేందుకు వీలుకాదు.

    • ఈ సాధనాల ద్వారా నేరుగా వారు ఆందోళన చెందుతున్న వేరొక Snapచాటర్ గురించి రిపోర్ట్ చేయడం.

    • తమ పిల్లల గోప్యత మరియు భద్రత సెట్టింగ్‌లు చూడండి.


మనమంతా మన జీవితాలలోని ఒక ముఖ్యమైన భాగాన్ని ఇప్పుడు ఆన్‌లైన్‌లో జీవిస్తున్నాము, మరియు యుక్తవయస్కులు మరియు తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో సంభవించే బెదిరింపుల గురించి తెలుసుకొని, వాటితో సరిగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యేందుకు మేము సహాయపడతాము. మా పని ఎప్పటికీ పూర్తికాదు, మరియు మా సంరక్షణ చర్యలు, సాధనాలు మరియు వనరుల గురించి మాకు తెలియజేస్తూ ఉండే ఎంతోమంది నిపుణులు, భద్రతా బృందాలు, మరియు తల్లిదండ్రులకు మేము ఎంతో కృతజ్ఞులమై ఉంటాము.

తిరిగి వార్తలకు