గోప్యతా విధానం

అమల్లోకి వచ్చేది: 26 ఫిబ్రవరి, 2024

Snap Inc. గోప్యతా విధానానికి స్వాగతం. ఈ విధానం మేము మీ డేటాను ఎలా సేకరిస్తాము మరియు ఉపయోగిస్తాము మరియు మీరు మీ సమాచారాన్ని ఎలా నియంత్రించవచ్చు అనేదానిని వివరిస్తుంది. మా గోప్యతా విధానాలపై ఒక సంక్షిప్త సారాంశం కోసం వెతుకుతున్నారా? ఈ పేజీ లేదా ఈ వీడియో చూడండి. ఒకవేళ మీరు ఒక నిర్ధారిత ఉత్పత్తికి సంబంధించిన గోప్యతా సమాచారానికై వెదుకుతున్నట్లయితే, ఉదాహరణకు, మేము మీ చాట్స్ మరియు Snap ను ఎలా ప్రాసెస్ చేస్తాము, అనేదానికై మా ఉత్పత్తికి గోప్యత పేజీని చూడండి. ఈ డాక్యుమెంట్లకు అదనంగా, మా ఉత్పత్తులు మరియు సేవల గురించి మీకు మరింత సమాచారం అందించే ఇన్-యాప్ నోటీసులను కూడా మేము చూపించాము.

పారదర్శకత అనేది Snapలోని ప్రధాన విలువలలో ఒకటి. మేము డేటాను సేకరించడం మరియు ఉపయోగిస్తాము అనేవాటిగురించి ఏవిధమైన అనూహ్యమైనవి ఉండకూడదని మేము విశ్వసిస్తాము - అందువల్లనే మేము దానిని ఎలా ప్రాసెస్ చేస్తామో మీకు ముందుగానే తెలియజేస్తాము. ఉదాహరణకు, మీ అనుభవానికి అత్యంత సముచితమైన కంటెంట్ మరియు సమాచారాన్ని మీకు చూపించడం మరియు మరింత సముచిత ప్రకటనలను చూపించడంతోసహా, మీకు మరింత పర్సనలైజ్ చేయబడిన అనుభవాన్ని అందించేందుకు మేము మీ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము. మీ ఆసక్తులు మరియు ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం మీకు మరింత ఉత్తమమైన ఉత్పత్తి అనుభవాన్ని అందించేందుకు మాకు సహాయపడుతుంది.

అంతేకాకుండా, పర్సనలైజ్ చేయబడిన అనుభవం, మీ గోప్యతను పణంగాపెట్టడం ద్వారా పొందకూడదని మేము విశ్వసిస్తాము. నిజజీవితంలో మాదిరిగానే, కొన్ని క్షణాలను మీరు మీ సన్నిహిత ఫ్రెండ్స్‌తో పంచుకొంటారు, మరియు మరికొన్నింటిని బహిరంగంగా ఇతరులతో షేర్ చేస్తారు. అందువల్లనే మొదటిరోజునుండి, డీఫాల్ట్‌ గా కంటెంట్‌ను డెలిట్ చేయడం మరియు ఎవరితో షేర్ చేయాలి లేదా ఎప్పుడు సేవ్ చేయాలి వంటి వాటితోసహా వారి కంటెంట్‌తో ఏం జరుగుతోందో నిర్ణయించడానికి అనుమంతించేలా Snap చాటర్లకు తగిన సాధనాలు అందించాలన్నది మా సిధ్ధాంతం.

ఈ విధానం, మా Snapchat యాప్ మరియు మా ఇతర ఉత్పత్తులు, సేవలు మరియు Bitmoji, Spectacles మరియు మా అడ్వర్టైజింగ్ మరియు వాణిజ్యపరమైన ఆవిష్కరణలవంటి ఫీచర్లను కవర్ చేస్తుంది. మీరు ఈ విధానంలో "సేవలు" అని చదివినప్పుడు, మేము వాటన్నింటి గురించి మాట్లాడతాము. అంతేగాక, మేము మా "నిబంధనలను" రిఫర్ చేయండి అని చెప్పినప్పుడు, అవి మా సేవలకై మీరు సైనప్ చేసినప్పుడు అంగీకరించిన సేవా నిబంధనలు అని అర్థం. చివరిగా, ఒకవేళ మీరు Snap చాటర్ అనే పదం చూస్తే, అది మా సేవలను ఉపయోగించే ఏ వినియోగదారుడినైనా సూచించేందుకు మేము ఉపయోగించే ఒక చిన్ని సంకేతమని గమనించండి.

మీ సమాచారంపై మీరు కలిగివున్న నియంత్రణలతో ప్రారంభిద్దాం పదండి:

మీ సమాచారం మీద నియంత్రణ

మీ సమాచారం మరియు సెట్టింగ్‌లపై నియంత్రణ అనేది Snapchat అనుభవంలో ప్రధాన భాగం. ఇక్కడ, అందుబాటులో ఉన్న సెట్టింగ్‌ల రకాలపై మేము మీకు మరిన్ని వివరాలను ఇస్తాము, మా డేటా డౌన్‌లోడ్ సాధనానికి లింక్, మరియు మీ డేటా లేదా అకౌంట్ ఎలా తొలగించాలో సూచనలు అందిస్తాము.

మీరు మీ సమాచారాన్ని నియంత్రించాలని మేము కోరుకుంటాము, కాబట్టి మేము మీకు ఈ క్రిందివాటితో సహా ఒక సాధనాల శ్రేణిని అందిస్తాము:

 • మీ సమాచారాన్ని యాక్సెస్ చేసుకొని అప్‌డేట్ చేయండి. మీరు మా సేవలయందే మీ ప్రాథమిక అకౌంట్ సమాచారములో అత్యధిక భాగాన్ని ప్రాప్యత చేసుకొని మరియు సవరించవచ్చు. కేవలం మీ సెట్టింగ్‌లకు నావిగేట్ చేయండి మరియు మీకు అందుబాటులో ఉన్న ఎంపికలను మీరు చూస్తారు.

 • మీ సమాచారాన్ని తొలగించండి. ఒకవేళ మీరు మీ అకౌంట్ తొలగించాలనుకుంటే, ఎలాగో ఇక్కడతెలుసుకోండి. మీరు మా సేవల లోపున కూడా కొంత సమాచారాన్ని తొలగించవచ్చు, మీరు మెమొరీస్ కి సేవ్ చేసిన కంటెంట్, My AI తో మీరు పంచుకున్న కంటెంట్, స్పాట్‌లైట్ సమర్పణలు లాగా, మరింకెన్నో.

 • మీ కంటెంటును ఎవరు చూడవచ్చునో నియంత్రించండి. మీరు ఎవరితో మీ కంటెంటును పంచుకుంటారో మీరు ఎంచుకునేలా చేయడానికి మేము అనేక సాధనాలను నిర్మించాము. కొన్ని ఉదంతాల్లో మీరు మీ స్నేహితులతో కంటెంటును పంచుకోవాలనుకోవచ్చు, మరియు ఇతర సందర్భాల్లో దానిని మీరు బహిరంగంగా పంచుకోవాలనుకోవచ్చు. మరింత తెలుసుకోవడానికి, ఇక్కడవెళ్ళండి.

 • మిమ్మల్ని ఎవరు సంప్రదించవచ్చునో నియంత్రించండి. Snapchat ఆప్తమిత్రులు మరియు కుటుంబానికి ఉద్దేశించబడింది, అందుకనే మిమ్మల్ని ఎవరు సంప్రదించవచ్చునో నిర్ణయించుకోవడానికి సహాయపడే నియంత్రణలను మేము నిర్మించాము. ఒకవేళ మీరు అవాంఛిత కమ్యూనికేషన్‌లను అందుకుంటే, మీరు ఎల్లప్పుడూ ఆవ్యక్తిని బ్లాక్ చేయవచ్చు మరియు రిపోర్టు చేయవచ్చు. మరింత తెలుసుకోవడానికి ఇక్కడికి వెళ్ళండి.

 • మీ అనుమతులను మార్చండి. అత్యధిక సందర్భాల్లో, మీరు ఎప్పుడైనా మీ అనుమతులను మార్చవచ్చు. ఉదాహరణకు, సులభంగా స్నేహితుల్ని చేసుకోవడానికి మీరు మీ ఫోన్ కాంటాక్టులకు ప్రాప్యతను ఇచ్చి ఉంటే, మీరు దానిని ఆ తర్వాత మీ సెట్టింగ్‌లలో మార్చుకోవచ్చు. వాస్తవానికి, ఒకవేళ మీరు అలా చేస్తే, మీ కాంటాక్ట్ బుక్ లో స్నేహితుల్ని కనుగొనడం వంటి కొన్ని ఫీచర్లు మరియు సేవలు పని చేయవు.

 • ప్రోత్సాహక సందేశాలను నిలిపివేయండి. SMS లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పంపించబడిన ప్రోత్సాహక ఇమెయిల్స్ మరియు సందేశాలను వదిలివేసేందుకు లేదా అన్‌సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు ఎంపిక ఉంటుంది. అలా చేయడానికి, ఒక అన్‌సబ్స్క్రైబ్ లింక్ లేదా అటువంటి ఫంక్షనాలిటీ వంటి సందేశం లోని సూచనలను అనుసరించండి.

 • మీ డేటా డౌన్‌లోడ్ చేయండి. బహుశ ఒక పోర్టబుల్ ఫార్మాట్‌లో Snapchat లో అందుబాటులో ఉండని సమాచారము యొక్క కాపీని పొందడానికి మీరు మా డౌన్‌లోడ్ మై డేటా సాధనాన్ని ఉపయోగించవచ్చు, కాబట్టి మీరు దానిని కోరుకున్న ఏ చోటుకైనా తరలించవచ్చు లేదా స్టోర్ చేయవచ్చు.

 • ప్రాసెసింగ్‌కు అభ్యంతరం చెప్పడం. మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేదాన్నిబట్టి మరియు మేము ప్రాసెస్ చేస్తున్న నిర్దిష్ట డేటాపై ఆధారపడి, ఆ సమాచారం యొక్క మా ప్రాసెసింగ్‌కు అభ్యంతరం చెప్పడానికి మీకు హక్కు ఉండవచ్చు. ఇది కొంత సాంకేతికంగా ఉండవచ్చు, కాబట్టి దానిని మేము మరింత విపులంగా ఇక్కడవివరించాము.

 • అడ్వర్టైజింగ్ ప్రాధాన్యతలను సెట్ చేయండి. మీ ఆసక్తుల పట్ల సముచితమైనవని మేము భావించే యాడ్స్ మీకు చూపించడానికి మేము ప్రయత్నిస్తాము, అయితే మీకు తక్కువ వ్యక్తిగతీకృత అనుభవం కావాలనుకుంటే, మీరు Snapchat యాప్ లో మీ అడ్వర్టైజింగ్ సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు. ఇక్కడ మరింత తెలుసుకోండి.

 • ట్రాకింగ్. మీరు iOS 14.5 లేదా అంతకు మించిన ఒక ఐఫోన్ ఉపయోగిస్తే, కొన్ని నిర్దిష్ట అవసరాలు వర్తించవచ్చు, వాటిని మేము ఇక్కడపేర్కొన్నాము.

మేము సేకరించే సమాచారం

మేము ఏ సమాచారం సేకరిస్తామో దాని గురించి ఈ విభాగం మీకు వివరాలను అందిస్తుంది. మేము దీనిని కొన్ని కేటగిరీలలో నిర్వహించాము: మీరు మాకు అందించే సమాచారం, మా సేవల యొక్క మీ వాడకం ఆధారంగా మేము ఉత్పన్నం చేసే సమాచారం, మరియు ఇతరుల నుండి మేము అందుకునే సమాచారం. కొన్నిసార్లు, మేము మీ అనుమతితో అదనపు సమాచారాన్ని కూడా సేకరించవచ్చు.

మీరు Snapchat వంటి మా సేవలను ఉపయోగించినప్పుడు, మీరు మాకు అందించే సమాచారాన్ని మేము సేకరిస్తాము, మీరు మా సేవలను ఉపయోగించినప్పుడు సమాచారాన్ని ఉత్పన్నం చేస్తాము, మరియు కొన్ని సందర్భాల్లో ఇతరుల నుండి డేటా అందుకుంటాము. ఇక వీటిని మరింత వివరంగా విడదీసి చూద్దాం.

మీరు అందించే సమాచారం

మా అనేక సేవలకు మీరు ఒక అకౌంట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని చేయడానికి, మేము అకౌంట్ వివరాలు (పేరు, యూజర్ నేమ్, ఇమెయిల్ అడ్రస్, పుట్టిన రోజు, మరియు ఫోన్ నెంబర్ వంటి మీ గురించిన సమాచారం) అందించమని మిమ్మల్ని అడుగుతాము. మీరు ప్రొఫైల్ ఏర్పాటు చేసినప్పుడు, మీరు మాకు ప్రొఫైల్ వివరాలు (Bitmoji మరియు ప్రొఫైల్ పిక్చర్ వంటివి) కూడా అందిస్తారు. ఆ తాజా స్నీకర్స్ వంటి ఏదైనా కొనుగోలు చేయడానికి ఒకవేళ మీరు మా వాణిజ్య ఉత్పత్తులను ఉపయోగించుకుంటే, మేము చెల్లింపు మరియు సంబంధిత సమాచారం కోసం మిమ్మల్ని అడగవచ్చు (మీ భౌతిక చిరునామా వంటివి, తద్వారా మేము ఉత్పత్తిని మీకు రవాణా చేయవచ్చు, చెల్లింపు సమాచారం, తద్వారా మేము చెల్లింపు మరియు లావాదేవీ హిస్టరీని ప్రాసెస్ చేయవచ్చు).

బహుశా, మా సేవల ద్వారా లేదా వాటి లోపున మీరు పంపించే లేదా సేవ్ చేసే సమాచారాన్ని కూడా మీరు మాకు అందిస్తారు.
మేము ఈ సమాచారంలో కొంత భాగాన్ని ప్రైవేటు కంటెంట్ మరియు కమ్యూనికేషన్లు గా ఉండాలని పరిగణించాము (ఫ్రెండ్స్ తో Snaps మరియు చాట్స్, ఫ్రెండ్స్ కు సెట్ చేయబడిన నా స్టోరీ, ప్రైవేట్ స్టోరీస్, వాయిస్ మరియు వీడియో కాల్స్ మరియు నా కళ్లు మాత్రమే లో సేవ్ చేయబడిన కంటెంట్ వంటివి). వర్ణవిశ్లేషణ యొక్క మరో వైపున, మా సేవల ద్వారా లేదా వాటి లోపున మీరు పంపించే లేదా సేవ్ చేసే కొంత సమాచారం అందరికీ అందుబాటులో ఉండే పబ్లిక్ కంటెంట్ అయి ఉండవచ్చు (పబ్లిక్ స్టోరీలు కంటెంట్, ప్రతి ఒక్కరికీ సెట్ చేయబడిన నా స్టోరీ తో సహా, షేర్ చేయబడిన స్టోరీస్, మరియు కమ్యూనిటీ స్టోరీస్, స్పాట్‌లైట్ లేదా Snap మ్యాప్ సమర్పణలు, మరియు పబ్లిక్ ప్రొఫైల్ సమాచారం). మీ Snaps, చాట్ లు మరియు ఏదైనా ఇతర కంటెంట్ ని వీక్షించే Snapచాటర్లు ఎల్లప్పుడూ Snapchat యాప్ బయట ఆ కంటెంట్ ని స్క్రీన్ షాట్ చేయవచ్చు, సేవ్ చేయవచ్చు, లేదా దానిని కాపీ చేయవచ్చు. కాబట్టి మరొకరు ఎవరైనా సేవ్ చేయకూడదని లేదా షేర్ చేయకూడదని మీరు కోరుకునే సందేశాలను లేదా కంటెంటును దయచేసి మీరు సేవ్ చేయవద్దు లేదా షేర్ చేయవద్దు.

చివరిగా, మీరు మద్దతు ను సంప్రదించండి (మద్దతు తో షేర్ చేయబడిన కంటెంట్ మరియు కమ్యూనికేషన్స్) లేదా మా భద్రతా బృందాన్ని సంప్రదించినప్పుడు, లేదా మా పరిశోధన ప్రయత్నాల ద్వారా సహా ఏ ఇతర విధంగానైనా మాతో కమ్యూనికేట్ చేసినప్పుడు (సర్వేలకు సమాధానాలు, వినియోగదారు ప్యానల్స్ లేదా ఇతర పరిశోధన ప్రశ్నలకు ప్రతిస్పందించడ వంటివి) మేము మీరు అందించే లేదా మేము మీ ప్రశ్నను పరిష్కరించడానికి అవసరం అయిన ఏ సమాచారమునయినా సేకరిస్తాము.

మీరు మా సేవలను ఉపయోగించునప్పుడు మేము ఉత్పన్నం చేసే సమాచారం

మీరు మా సేవలను ఉపయోగించేటప్పుడు, ఆ సేవలలో వేటిని మీరు ఉపయోగించుకున్నారు మరియు వాటిని ఎలా ఉపయోగించుకున్నారనే దాని గురించి మేము సమాచారము సేకరిస్తాము. ఇది మా కమ్యూనిటీ మా సేవలను ఉపయోగించుకునే మార్గాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది, తద్వారా మేము మెరుగుదలలను చేసుకోవచ్చు.

ఇందులో వాడుక సమాచారము (మా సేవలతో మీరు ఎలా పరస్పర చర్య చేసుకుంటారో దాని గురించి సమాచారం - ఉదాహరణకు, మీరు వీక్షించే మరియు వర్తింపజేసుకునే లెన్సెస్, మీరు చూసే స్టోరీస్, మరియు ఇతర Snapచాటర్లతో మీరు ఎంత తరచుగా కమ్యూనికేట్ చేస్తారో ఆ సమాచారం) మరియు కంటెంట్ సమాచారం చేరి ఉంటుంది (మీరు సృష్టించే లేదా అందించే కంటెంట్ గురించి సమాచారం, కెమెరా మరియు క్రియేటివ్ టూల్స్ తో మీ నిమగ్నత, My AI తో మీ పరస్పర చర్య, మరియు మెటాడేటా - ఉదాహరణకు, కంటెంట్ గురించి, అది పోస్ట్ చేయబడిన తేదీ మరియు సమయం మరియు దానిని ఎవరు వీక్షించారనే దాని గురించి సమాచారం). కంటెంట్ సమాచారము యందు చిత్రం, వీడియో, లేదా ఆడియో యొక్క కంటెంట్ ఆధారంగా సమాచారము చేరి ఉంటుంది - కాబట్టి మీరు గనక ఒక బాస్కెట్‌బాల్ ఆట యొక్క స్పాట్‌లైట్ పోస్ట్ చేసినట్లయితే, మేము బాస్కెట్‌బాల్ గురించిన స్పాట్‌లైట్ పై మరింత కంటెంట్ చూపించడానికి మేము ఆ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.

ఇందులో పరికరం సమాచారము కూడా చేరి ఉంటుంది (మీ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లేదా సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, పరికరం మెమరీ, అడ్వర్టైజింగ్ ఐడెంటిఫైయర్‌లు, ఇన్స్టాల్ చేసిన యాప్స్, బ్రౌజర్ రకం, మీ పరికరం లేదా కంపాస్‌లు మరియు మైక్రోఫోన్ల చలనమును కొలిచే పరికరం సెన్సార్ల నుండి సమాచారం వంటివి, opopoమీరు హెడ్‌ఫోన్‌లు కనెక్ట్ చేసుకుని ఉన్నా, మరియు మీ వైర్లెస్ మరియు మొబైల్ కనెక్షన్స్ గురించి సమాచారంతో సహా), లొకేషన్ సమాచారం (IP చిరునామా), కుకీస్ మరియు అలాంటి టెక్నాలజీల ద్వారా సేకరించిన సమాచారం, మీ సెట్టింగ్‌లను బట్టి ఆధారపడి ఉంటుంది, (కుకీలు, వెబ్ బీకాన్స్ (ఒక వినియోగదారు ఒక వెబ్ సైట్ ను ఎంత తరచుగా మరియు ఎలా సందర్శించారు వంటి వినియోగదారు యాక్టివిటీ ని గుర్తించే చిన్న గ్రాఫిక్ డేటా), వెబ్ స్టోరేజ్, విశిష్ట అడ్వర్టైజింగ్ ఐడెంటిఫైయర్‌లు), మరియు లాగ్ సమాచారం (మీరు మా సేవలను ఎలా ఉపయోగించారు, యాక్సెస్ సమయాలు, వీక్షించిన పేజీలు, IP చిరునామా మరియు కుకీస్ వంటి విశిష్ట ఐడెంటిఫైయర్లు గురించి వివరాలు).

మీకు అతి స్పష్టంగా పరికరం-స్థాయి అనుమతులు మంజూరు చేసియున్నట్లయితే, పరికరం సమాచారము కూడా మీ పరికరం ఫోన్ బుక్ గురించి సమాచారాన్ని (కాంటాక్టులు మరియు సంబంధిత సమాచారం), మీ పరికరం యొక్క కెమెరా, ఫోటోలు మరియు మైక్రోఫోన్ నుండి చిత్రాలు మరియు ఇతర సమాచారం (ఫోటోలు, వీడియోలు తీయడానికి సామర్థ్యం, స్టోర్ చేయబడిన ఫోటోలు మరియు వీడియోలను వీక్షించే, మరియు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఆడియో రికార్డ్ చేయడానికి మైక్రోఫోన్ యాక్సెస్ చేసుకోవడం), మరియు లొకేషన్ సమాచారం (GPS సిగ్నల్స్ వంటి పద్ధతుల ద్వారా ప్రశస్తమైన లొకేషన్ వంటివి) చేరి ఉండవచ్చు.

ఇతరుల నుండి మేము అందుకునే డేటా

మేము సేకరించే డేటా యొక్క చివరి కేటగరీ అనేది, మేము ఇతర వినియోగదారులు, మా అనుబంధీకులు, మరియు తృతీయ పక్షాల వంటి ఇతరుల నుండి మేము అందుకునే మీ గురించిన సమాచారం. ఇందులో లింక్ చేయబడిన తృతీయ పక్షం సేవ డేటా చేరి ఉంటుంది (మీరు Snapchat అకౌంట్ ను మరొక సేవ కు లింక్ చేసినప్పుడు మేము పొందే సమాచారం), అడ్వర్టైజర్ల నుండి డేటా (అడ్వర్టైజర్లు, యాప్ డెవలపర్స్, ప్రచురణకర్తలు మరియు ఇతర తృతీయ పక్షాల నుండి యాడ్స్ యొక్క పనితీరును లక్ష్యంగా చేసుకోవడానికి లేదా కొలిచేందుకు సహాయపడేందుకై మేము పొందుతున్న సమాచారం), ఇతర Snapchatters లేదా తృతీయ పక్షాల నుండి సంప్రదింపు సమాచారం (మీ సమాచారాన్ని కలిగి ఉండే తన సంప్రదింపు జాబితాను మరొక Snapచాటర్లు అప్లోడ్ చేస్తే, మీరు ఎవరితో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో బాగా అర్థం చేసుకోవడానికి మేము మీ గురించి కలిగి ఉన్న సమాచారంతో దానిని మిళితం చేయవచ్చు. లేదా, మీరు మాకు మీ సంప్రదింపు సమాచారాన్ని అందిస్తే, మేము SMS, ఇమెయిల్ లేదా ఇతర మెసేజింగ్ సేవల వంటి ఇతర మార్గాల్లో మీతో కమ్యూనికేట్ చేయగలమో లేదో నిర్ధారించడానికి మేము దానిని ఉపయోగించుకోవచ్చు), మరియు మా నిబంధనలు యొక్క సంభావ్య ఉల్లంఘనలకు సంబంధించిన డేటా (మేము మా సేవా నిబంధనలు కమ్యూనిటీ మార్గదర్శకాలు యొక్క సంభావ్య ఉల్లంఘనల గురించి వెబ్ సైట్ ప్రచురణకర్తలు, సామాజిక నెట్వర్క్ ప్రొవైడర్లు, చట్టం అమలు చేయు అధికారులు మరియు ఇతరులతో సహా, మూడవ పక్షాల నుండి సమాచారాన్ని అందుకోవచ్చు).

మీ అనుమతితో, ఇతర సమాచారము

అదనంగా, మీరు మా సేవలతో పరస్పర చర్య చేసినప్పుడు అదనపు సమాచారాన్ని సేకరించడానికి మేము మీ అనుమతిని కోరే సందర్భాలు ఉండవచ్చు. ఉదాహరణకు, మీ పరికరం యొక్క కెమెరా రోల్ లేదా కాంటాక్ట్ బుక్ ప్రాప్యత చేసుకోవడానికి ముందు.

మేము సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము

మేము సేకరించే సమాచారాన్ని మేము ఎలా ఉపయోగిస్తామో ఈ విభాగం వివరిస్తుంది. ఇతర విషయాలతోపాటు, మేము వ్యక్తిగతీకరించిన ఉత్పత్తులు మరియు సేవలను వృద్ధి చేయడానికి మరియు మెరుగుపరచడానికై కష్టించి పనిచేసి మీకు అందించడానికి మేము సేకరించిన సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఈ దిగువన, మేము సమాచారాన్ని ఉపయోగించే ప్రతి ఉద్దేశ్యం గుండా వెళుతూ విపులంగా వివరిస్తాము. మేము ఏ ప్రయోజనాల కోసం డేటా సేకరిస్తామో ఆ డేటా మ్యాపింగ్ ను మీరు చూడాలనుకుంటే, మేము ఇక్కడఒక పట్టిక కలిగి ఉన్నాము.

కీప్ థింగ్స్ అప్ మరియు రన్నింగ్ (అంటే, మా సేవలను ఆపరేట్ చేయడం, అందజేయడం మరియు నిర్వహించడం)

మా సేవలను ఆపరేట్ చేయడానికి, అందజేయడానికి మరియు నిర్వహించడానికి గాను, మేము సేకరించిన సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీరు ఒక ఫ్రెండ్ కు పంపించాలని మీరు అనుకునే ఒక Snap అందజేయడం, మీరు స్నాప్ మ్యాప్‌లో మీ లొకేషన్‌ను షేర్ చేస్తే, మీ పరిసరాల్లో మీరు ఇష్టపడే స్థలాలు, ఇతరులు మ్యాప్‌లో పోస్ట్ చేసిన కంటెంట్ లేదా, ఒకవేళ మీ స్నేహితులు తమ స్థానాన్ని మీతో షేర్ చేస్తుంటే. మా ఉత్పత్తులను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచడానికి సహాయపడేందుకు కూడా మేము మీ కొంత సమాచారాన్ని ఉపయోగిస్తాము, ఉదాహరణకు మా సేవలు అత్యంత తాజా ఆపరేటింగ్ సిస్టమ్స్ మరియు పరికరాలతో పని చేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి.

మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించండి మరియు సందర్భం అందించండి

మేము Snapచాటర్లకు వ్యక్తిగతీకృతమైన సేవలను అందిస్తాము. మేము దీనిని చేసే మార్గాలలో ఒకటి, మీకు సముచితమైన కంటెంట్ చూపించడం లేదా మీరు మాతో షేర్ చేసుకున్న మీ సమాచారం ఆధారంగా మీరు ఆనందించవచ్చునని మేము భావించేది. అలా చేయడానికై, మీ Snapchat అనుభవానికి సందర్భాన్ని జోడించడానికి గాను సేవల యొక్క వివిధ రంగాల వ్యాప్తంగా మీ గురించిన సమాచారాన్ని మేము ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మేము కంటెంట్, మీ లొకేషన్, లేదా రోజు యొక్క సమయం ఆధారంగా లేబుల్స్ తో స్వయంచాలకంగా కంటెంట్ ని ట్యాగ్ చేస్తాము. కాబట్టి ఒకవేళ ఫోటో లో ఒక శునకం ఉంటే, దానిని "శునకం," అనే పదం ద్వారా మెమోరీస్ లో శోధించవచ్చు, మీరు మెమోరీని సృష్టించిన లొకేషన్ వద్ద మ్యాప్ పై చూపించవచ్చు, మరియు మీరు శునకాల కోసం వెతుకుతున్నారని మాకు తెలియజేయవచ్చు, తద్వారా మేము స్పాట్‌లైట్ వంటి మా సేవల యొక్క ఇతర భాగాలలో మీకు సరదాగా శునకాల వీడియోలు మరియు శునకాల ఆహారం యాడ్స్ ని ఉపరితలంపై చూపించగలము.

వ్యక్తిగతీకరణ కూడా, ఫ్రెండ్స్ ని సూచించడం లేదా మీరు ఎక్కువగా ఎవరితో Snap చేస్తారో దాని ఆధారంగా Snap పంపించడానికి ఒక కొత్త ఫ్రెండ్ ని సిఫార్సు చేయడానికి సహాయపడగలుగుతుంది. మేము Snap మ్యాప్ పై సిఫార్సు చేయబడిన స్థలాలను చూపించవచ్చు, స్టికర్లు ఉత్పన్నం చేయవచ్చు, లేదా ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి AI ఉపయోగించి Snaps మరియు ఇతర కంటెంట్ ను కూడా ఉత్పన్నం చేయవచ్చు, మీ కంటెంట్ లేదా యాక్టివిటీ ఆధారంగా మీ ప్రయోజనాలను చేరవేయవచ్చు, లేదా యాడ్స్ తో మేము మీకు చూపించే కంటెంట్ ను అనుకూలీకరించవచ్చు. ఉదాహరణకు, మీరు స్పాట్‌లైట్ పై బరిస్టా కంటెంట్ చూస్తే, మీ అభిమాన ఎస్ప్రెస్సో మెషిన్ గురించి My AI తో మాట్లాడితే, లేదా మీ మెమొరీస్ లో కాఫీ సంబంధిత Snaps చాలా వాటిని సేవ్ చేస్తే, మీరు ఒక కొత్త నగరాన్ని సందర్శించినప్పుడు లేదా మీకు ఆసక్తికరమైన లేదా సముచితమైన కాఫీ గురించి మీకు కంటెంట్ చూపించినప్పుడు మేము Snap మ్యాప్ పైన కాఫీ షాపులను హైలైట్ చేయవచ్చు. లేదా, మీరు అనేక మ్యూజిక్ వేదికలతో ఇంటరాక్ట్ అయితే, మేము పట్టణంలో రాబోతున్న ప్రదర్శనల కొరకు మీకు యాడ్స్ చూపించడానికి మేము దానిని ఉపయోగించవచ్చు. మీ ఫ్రెండ్స్ ఏమి చేస్తున్నారో దాని ఆధారంగా మీ అనుభవాన్ని రూపొందించడం, మీ ఫ్రెండ్స్ సృష్టించే కంటెంటును మీకు చూపించడం లేదా స్పాట్‌లైట్ పై ఆనందించడం లేదా మీ ఫ్రెండ్స్ తో ప్రాచుర్యం పొందిన సిఫార్సులను చూపించడం సహా మీ అనుభవాన్ని రూపొందించడం కూడా వ్యక్తిగతీకరణలో చేరి ఉంటుంది.

మీకు నిరంతరంగా మరింత సముచితమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం మా లక్ష్యం.

ఉదాహరణకు, ఒకవేళ మీరు ఎంతో ఎక్కువ స్పోర్ట్స్ కంటెంట్ ను వీక్షిస్తూ, ఐతే జుట్టు మరియు మేకప్ చిట్కాలతో కూడిన కంటెంట్ ని వదిలేసినట్లయితే, మా సిఫార్సు అల్గోరిథంలు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తాయి, కానీ ఆ మేకప్ చిట్కాలకు కాదు. మేము Snapచాటర్ల ప్రాధాన్యతలను ఎలా అర్థం చేసుకుంటామో మరియు కంటెంట్ ని ఎలా ర్యాంక్ చేసి ఆధునీకరిస్తామో దాని గురించి మీరు ఇక్కడమరింత తెలుసుకోవచ్చు.

మా Snapచాటర్ల గోప్యత యొక్క ఆకాంక్షలతో వ్యక్తిగతీకరణ యొక్క ప్రయోజనాలను సమతుల్యం చేయడం కూడా కీలకమని మేము నమ్ముతాము. ఉదాహరణకు, మెమొరీస్ లోపల ఉన్న కంటెంట్ ఆధారంగా దానికి మీరు సేవ్ చేసిన Snaps ని మేము స్వయంచాలకంగా ట్యాగ్ చేయవచ్చు (ఉదా.,ఒక డాగ్ కలిగియున్న Snap) మరి ఆ తర్వాత మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి, సిఫార్సులను చేయడానికి, లేదా మీకు యాడ్స్ (డాగ్స్ కలిగియున్న స్పాట్‌లైట్ Snaps మీకు చూపించడం వంటిది) చూపించడానికి ఆ ట్యాగ్ ను ఉపయోగించవచ్చు. మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి, సిఫార్సులను చేయడానికి, లేదా మీకు యాడ్స్ చూపించడానికి మీరు పంపించిన ప్రైవేట్ కంటెంట్ మరియు కమ్యూనికేషన్లను మేము ఉపయోగించము.

సంబంధిత యాడ్స్ ఇవ్వడం

మేము వ్యక్తిగతీకృతమైన సేవ అందించే మరొక మార్గం, మేము చూపించే యాడ్స్ ద్వారా ఉంటుంది. యాడ్స్ ను వ్యక్తిగతీకరించడానికి, లక్ష్యంగా చేసుకోవడానికి మరియు కొలిచేందుకు మేము సేకరించిన సమాచారం నుండి మీ ఆసక్తులు మరియు ప్రాధాన్యతలను మేము ఉపయోగిస్తాము. యాడ్స్ సంబంధితంగా ఉన్నప్పుడు అవి ఉత్తమమైనవని మేము భావిస్తాముు. అందుకనే మేము సరియైన యాడ్స్ ను ఎంపిక చేయడానికి మరియు సరైన సమయంలో మీకు వాటిని చూపించడానికి ప్రయత్నిస్తాము. ఉదాహరణకు, మీరు వీడియో గేమ్స్ కోసం యాడ్స్ తో సంప్రదించినట్లయితే, మీరు వీడియో గేమ్స్ ఇష్టపడతారని మేము భావిస్తాము, మరియు మీకు అటువంటి యాడ్స్ చూపిస్తాము, కానీ మీరు కేవలం ఈ యాడ్స్ మాత్రమే కాకుండా వేరేవి కూడా చూస్తారు. మా కంటెంట్ వ్యూహముతో పోలిన విధంగా, మీరు వివిధరకాల యాడ్స్ అందుకునేలా చూసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము. మీకు బహుశా ఆసక్తి ఉండని యాడ్స్ చూపించకుండా ఉండటానికి కూడా మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీరు ఇంతకు ముందు ఒక సినిమా కోసం టిక్కెట్లు కొన్నట్లుగా ఒక టికెటింగ్ సైట్ మాకు చెబితే - మేము మీకు దాని కోసం యాడ్స్ చూపించడం ఆపివేయవచ్చు. మీరు ఏ యాడ్స్ అందుకుంటారో దాని గురించి మరియు అడ్వర్టైజింగ్ యొక్క వివిధ రకాలు మరియు మీ ఎంపికల గురించి మీరు ఇక్కడతెలుసుకోవచ్చు.

అడ్వర్టైజింగ్ ప్రయోజనాల కోసం మేము మీ సమాచారాన్ని ఎలా సేకరిస్తాము, ఉపయోగిస్తాము, మరియు షేర్ చేస్తామో అనేదాని గురించి మీరు ఇక్కడమరింత తెలుసుకోవచ్చు.

కుకీస్ మరియు ఇతర టెక్నాలజీల ద్వారా సేకరించిన సమాచారంగురించి ఒక గమనిక: మా భాగస్వాములలో ఒకరి ద్వారా మేము అందించే సేవలతో మీరు సంభాషించినప్పుడు సమాచారాన్ని సేకరించడానికి మేము ఈ టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీకు మరింత సముచితమైన ప్రకటనలను చూపించడానికి ఒక అడ్వర్టైజర్ యొక్క వెబ్ సైట్ పై సేకరించిన సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. అత్యధిక వెబ్ బ్రౌజర్లు డిఫాల్ట్ గా కుకీలను స్వీకరించేలా అమర్చబడి ఉంటాయి. ఒకవేళ మీరు ప్రాధాన్యత ఇస్తే, మీరు మీ బ్రౌజర్ లేదా ఉపకరణంపై సెట్టింగ్స్ ద్వారా మామూలుగా బ్రౌజర్ కుకీలను తొలగించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అయినా, కుకీస్ తొలగించడం లేదా తిరస్కరించడం అనేది మా సేవల లభ్యత మరియు ఫంక్షనాలిటీపై ప్రభావం చూపవచ్చునని మనసులో ఉంచుకోండి. మా సేవలు మరియు మీ ఎంపికలపై మేము మరియు మా భాగస్వాములు కుకీస్ ను ఎలా ఉపయోగిస్తామో అనేదాని గురించి మరింత తెలుసుకొనేందుకు మా కుకీ విధానమును చూడండి.

ఫీచర్లు, అల్గోరిథంలు మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అభివృద్ధి మరియు మెరుగుపరచడం

మా సేవలను మెరుగుపరచడానికి అనువైన ఫీచర్లు మరియు మార్గాల కోసం మా బృందాలు కొత్త ఆలోచనలతో నిరంతరం ముందుకు వస్తున్నాయి. దీనిని చేయడానికి గాను, జెనరేటివ్ AI ఫీచర్లు (జెనరేటివ్ మోడల్స్ ఉపయోగించి వచనం, చిత్రాలు, లేదా ఇతర మీడియాను ఉత్పన్నం చేయగల కృత్రిమ మేధస్సు) ద్వారా సహా మా ఫీచర్లు మరియు సేవలు పని చేసేలా చేసే అల్గోరిథంలు మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ (నమూనాలను కనుగొనడానికి లేదా ఊహాత్మక అంచనాలు చేయడానికి గణనీయమైన మొత్తంలో డేటా ద్వారా సమ్మిళితం అయ్యే అల్గోరిథం యొక్క వ్యక్తీకరణ) ని కూడా మేము అభివృద్ధి చేస్తాము. జెనరేటివ్ AI నమూనాలు వాటి ఇన్పుట్ శిక్షణ డేటా యొక్క నమూనాలు మరియు నిర్మాణమును నేర్చుకుంటాయి మరి ఆ తర్వాత అలాంటి లక్షణాలు ఉన్న కొత్త డేటాను ఉత్పన్నం చేస్తాయి). మేము వ్యక్తిగతీకరణ, అడ్వర్టైజింగ్, భద్రత మరియు రక్షణ, సమంజసత మరియు చేకూర్పుదనం, ఆగ్మెంటేడ్ రియాలిటీ కోసం మరియు దురుపయోగం లేదా సేవా నిబంధనలు ఉల్లంఘనలను నివారించడానికి అల్గోరిథంలు మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ను ఉపయోగిస్తాము. ఉదాహరణకు, My AI నుండి ప్రతిస్పందనలను మెరుగుపరచడానికి Snapచాటర్లు My AI తో జరిపిన సంభాషణలను మా అల్గోరిథంలు మరియు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ లెక్కలోనికి తీసుకుంటాయి.

మేము ఏ రకమైన మెరుగుదలలను తయారు చేయాలి అని నిర్ణయించడానికి మీ సమాచారం మాకు సహాయపడుతుంది, అయితే మేము ఎల్లప్పుడూ గోప్యత పై దృష్టి సారిస్తాము - మరియు మా ఫీచర్లు మరియు మోడల్స్ అభివృద్ధి చేయడానికి అవసరమైన దానికన్నా ఎక్కువగా వ్యక్తిగత సమాచారమును ఉపయోగించకూడదని మేము కోరుకుంటాము.

విశ్లేషణలు

ఏది నిర్మించాలి లేదా మా సేవలను ఎలా అభివృద్ధి చేయాలి అని అర్థం చేసుకోవడానికి గాను, మేము మా ఫీచర్ల కోసం పోకడలు మరియు డిమాండ్‌ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, మేము ఒక గ్రూప్ యొక్క గరిష్ట పరిమాణం వంటి ఫీచర్ యొక్క భాగాలను మార్చాలో లేదో నిర్ణయించడానికి సహాయపడేందుకు మేము గ్రూప్ చాట్ వాడకం గురించి మెటాడేటా మరియు పోకడలను పర్యవేక్షిస్తాము. Snapచాటర్ల నుండి డేటా అధ్యయనం చేయడం వల్ల ప్రజలు సేవలను ఉపయోగించే మార్గాలలో పోకడలను చూడడానికి మాకు సహాయపడగలుగుతుంది. ఇది భారీ స్థాయిలో Snapchat ని మెరుగుపరచడానికి మాకు స్ఫూర్తిని అందిస్తుంది. పోకడలు మరియు వాడకమును గుర్తించడానికి, పర్యవేక్షించడానికి మరియు విశ్లేషించడానికి గాను మేము విశ్లేషణలను నిర్వహిస్తాము. ఈ సమాచారం ఆధారంగా, మేము ఇతర విషయాలతో పాటుగా, డిమాండ్ ను అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడటానికై మా వినియోగదారుల గురించి సమాచారాన్ని రూపొందిస్తాము.

పరిశోధన

సాధారణ వినియోగదారు ఆసక్తులు, పోకడలు, మరియు మీచే మరియు మా కమ్యూనిటీలోని ఇతరులచే మా సేవలు ఎలా ఉపయోగించబడుతున్నాయో మరింత బాగా అర్థం చేసుకోవడానికి మేము పరిశోధన నిర్వహిస్తాము. ఈ సమాచారం, విశ్లేషణలతో పాటుగా (మేము పైన వివరించినట్లుగా), మా కమ్యూనిటీ గురించి మరియు మా సేవలు మా కమ్యూనిటీలో ఉన్నవారి జీవితాలకు ఎలా సరిపోతున్నాయో మేము మరింతగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది. మేము కొత్త పద్ధతులు మరియు టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి కూడా పరిశోధన మరియు అభివృద్ధిలో నిమగ్నమవుతాము (ఉదా, కొత్త మెషీన్ లెర్నింగ్ మోడ్యూల్స్ లేదా హార్డ్‌వేర్, Spectacles వంటివి). మా పరిశోధన యొక్క ఫలితాలు కొన్నిసార్లు Snapchat పై ఫీచర్లలో ఉపయోగించబడతాయి, మరియు మేము కొన్నిసార్లు సమగ్రమైన ప్రవర్తనలు మరియు వినియోగదారు పోకడలు వంటి విషయాల గురించి పత్రాలను ప్రచురిస్తాము (అవి వినియోగదారు బేస్ అంతటా క్రోడీకరించబడిన డేటా మాత్రమే కలిగి ఉంటాయి, మరియు మీ గురించి ప్రత్యేకంగా ఎటువంటి ప్రైవేటు సమాచారాన్ని కలిగి ఉండవు).

మా సేవల భద్రత మరియు భద్రతను పెంపొందించుట

మా సేవల భద్రత మరియు రక్షణను పెంపొందించడానికి, Snapచాటర్ల గుర్తింపును వెరిఫై చేయడానికి, మరియు మోసం లేదా ఇతర అనధికార లేదా చట్టవిరుద్ధమైన చర్యను నివారించడానికి మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీ అకౌంట్‌ను సంరక్షించుటలో సహాయపడేందుకు మేము రెండు-అంచెల ప్రామాణీకరణ విధానాన్ని అందిస్తాము మరియు మేము ఏదైనా అనుమానాస్పద చర్యను గమనిస్తే, మీకు ఇమెయిల్ లేదా వచన సందేశాలు పంపించవచ్చు. ఒక వెబ్‌పేజీ హానికరమైనదా లేదా అని తెలుసుకోవడానికి మేం Snapchat‌లో పంపిన URLలను స్కాన్ చేసి, దాని గురించి మిమ్మల్ని హెచ్చరించగలం.

మిమ్మల్ని సంప్రదించడం

కొత్తవి లేదా ఇప్పటికే ఉన్న ఫీచర్లను ప్రోత్సహించడానికి మేము కొన్నిసార్లు మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటాము. ఇందులో, అనుమతించబడిన చోట, Snapchat, ఇమెయిల్, SMS, లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్ ద్వారా Snapచాటర్లకి కమ్యూనికేషన్‌లను పంపించడం చేరి ఉంటుంది. ఉదాహరణకు, మా సేవలు మరియు మీరు ఆసక్తి చూపిస్తారని మేము భావించే ప్రోత్సాహక ఆఫర్ల గురించి సమాచారాన్ని షేర్ చేయడానికి మేము Snapchat యాప్, ఇమెయిల్, SMS, లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ను ఉపయోగించవచ్చు.

ఇతర సమయాల్లో, సమాచారం, హెచ్చరికలు, లేదా మా వినియోగదారులు తమ అభ్యర్ధన మేరకు మమ్మల్ని పంపించమని అడిగే సందేశాలను అందించడానికి మేము మీతో కమ్యూనికేట్ చేయవలసి ఉంటుంది. ఇందులో, Snapchat, ఇమెయిల్, SMS, లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కమ్యూనికేషన్‌లను పంపించడం చేరి ఉండవచ్చు, అనుమతించబడిన చోట అకౌంట్ స్థితి నవీకరణలు, భద్రతా హెచ్చరికలు, మరియు చాట్ లేదా స్నేహపూర్వక రిమైండర్లు అందజేయబడవచ్చు; ఇందులో Snapచాటర్స్ యేతర వ్యక్తులకు ఆహ్వానాలు లేదా Snapchat కంటెంట్ పంపించడానికి మా యూజర్ అభ్యర్ధన ను నెరవేర్చడం కూడా ఇమిడి ఉండవచ్చు.

మద్దతు

మీరు సహాయం కోసం అడిగినప్పుడు, మీరు వీలైనంత త్వరగా మద్దతు పొందాలని మేము కోరుకుంటాము. మా సేవలతో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన సహాయంతో మీకు, Snapచాటర్ కమ్యూనిటీ మరియు మా వ్యాపార భాగస్వాములకు సహాయం అందించడానికి గాను, మేము ప్రతిస్పందించడానికి మేము సేకరించిన సమాచారాన్ని తరచుగా ఉపయోగించాల్సి ఉంటుంది.

మా నిబంధనలు మరియు విధానాలను అమలు చేయడం

మేము సేకరించిన డేటా ను నిబంధనలు మరియు చట్టాన్ని అమలు చేయడానికి మేము ఉపయోగిస్తాము. ఇందులో మా నిబంధనలు, విధానాలు, లేదా చట్టాన్ని ఉల్లంఘించే ప్రవర్తనను అమలు చేయడం, పరిశోధించడం మరియు నివేదించడం, చట్టం అమలు నుండి అభ్యర్థనలకు ప్రతిస్పందించడం, మరియు చట్టపరమైన అవసరాలతో సమ్మతి వహించడం చేరి ఉంటాయి. ఉదాహరణకు, మా సేవలపై చట్టవిరుద్ధమైన కంటెంట్ పోస్ట్ చేయబడినప్పుడు, మేము మా నిబంధనలు మరియు ఇతర విధానాలను అమలు చేయవలసిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, చట్ట అమలు అభ్యర్థనలతో సహకరించడానికి, చట్ట అమలు అధికారులు, పరిశ్రమ భాగస్వాములు, లేదా ఇతరులకు భద్రతా సమస్యలను తెలియజేయడానికి, లేదా మా చట్టపరమైన బాధ్యతలు తో సమ్మతి వహించడానికి కూడా మేము మీ సమాచారాన్ని ఉపయోగించవచ్చు లేదా షేర్ చేయవచ్చు. మరింత తెలుసుకోడానికి మా పారదర్శకత నివేదిక ను చూడండి.

మేము సమాచారాన్ని ఎలా పంచుకుంటాము

ఈ విభాగం, మేము ఎవరితో సమాచారాన్ని షేర్ చేస్తాము, ఆ సమాచారములో ఏమి చేరి ఉండవచ్చు మరియు ఆ సమాచారమును పంచుకోవడానికి కారణాలు, సేకరించిన దేశం నుండి దానిని ఎప్పుడు వెలుపలికి బదిలీ చేయవలసి ఉంటుందనే దానితో సహా విపులంగా వివరిస్తుంది.

స్వీకర్తలు మరియు షేర్ చేయడానికి కారణాలు
 • Snapchat. మీకు మరియు మా కమ్యూనిటీకి మా సేవలను అందించడానికి గాను, మేము మీ ఫ్రెండ్స్ తో Snapchat పైన లేదా ఇతర Snapచాటర్లతో సమాచారాన్ని షేర్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు అనుమతించినట్లయితే, స్టోరీస్ కు మీరు పోస్ట్ చేసిన కంటెంట్‌ని మీ ఫ్రెండ్స్ చూడవచ్చు. మీ సమాచారం ఎవరు చూస్తున్నారు మరియు ఏమిటి ఇంకా ఎప్పుడు అనే మీ నియంత్రణల కోసం మీ సమాచారంపై నియంత్రణ విభాగాన్ని మరియు మీ సెట్టింగ్‌లను చూడండి.

 • ఫ్యామిలీ సెంటర్ పాల్గొనేవారు. మీరు ఫ్యామిలీ సెంటర్ ఎనేబుల్ చేసినప్పుడు, అకౌంట్ ఎలా ఉపయోగించబడుతుందో అనే దాని గురించి గ్రాహ్యత కల్పించడానికి మేము సమాచారాన్ని షేర్ చేస్తాము, ఉదాహరణకు, Snapchat పై మీ ఫ్రెండ్స్ ఎవరు. మేము మెసేజ్ కంటెంట్‌ను షేర్ చేయము. మరింత తెలుసుకోండి.

 • బహిరంగం. Snapchat పై అతధిక ఫీచర్‌లు ప్రైవేటు మరియు ఫ్రెండ్స్ కోసం మాత్రమే ఉంటాయి, అయితే మీరు ప్రపంచానికి చూపించుకోగలిగిన స్పాట్‌లైట్, Snap మ్యాప్, కమ్యూనిటీ స్టోరీస్ లేదా మీ పబ్లిక్ ప్రొఫైల్ వంటి మీ ఉత్తమ Snaps ప్రదర్శించడానికి మీరు ఎంచుకోగలిగిన బహిరంగ ఫీచర్లను కూడా మేము అందజేస్తాము. మీరు దీనిని చేసినప్పుడు, Snapchat వెలుపల కూడా ఆ Snaps కనుక్కోదగినవిగా ఉంటాయి, ఉదాహరణకు వెబ్ పైన. మీ యూజర్ నేమ్ మరియు Bitmoji వంటి కొంత సమాచారం బహిరంగంగా కనిపిస్తుంది.

 • తృతీయ-పక్షం యాప్స్. కొన్నిసార్లు తృతీయ-పక్షం యాప్‌లతో మీరు కనెక్ట్ కావడానికి అనుమతించే ఫీచర్లను మేము అందిస్తాము. మీరు Snapchat అకౌంట్ ను ఒక తృతీయ-పక్ష యాప్ తో కనెక్ట్ చేయడానికి నిర్ణయించుకుంటే, మీరు మాకు నిర్దేశించే ఏదైనా అదనపు సమాచారాన్ని మేము షేర్ చేస్తాము.

 • సేవా ప్రదాతలు. మా తరపున మీ సమాచారాన్ని ప్రాసెస్ చేసే సేవా ప్రదాతలతో మీ కార్యాచరణకు గురించిన ఆ సమాచారాన్ని మేము షేర్ చేస్తాము. ఉదాహరణకు, చెల్లింపులను సానుకూలపరచడానికి లేదా యాడ్స్ యొక్క పనితీరును కొలిచేందుకు లేదా ఆప్టిమైజ్ చేయడానికి మేము అట్టి సేవ ప్రొవైడర్లపై ఆధారపడతాము. మేము వారితో ప్రైవేట్ కమ్యూనికేషన్‌లను షేర్ చేయము. మేము సేవ ప్రొవైడర్‌ల యొక్క కేటగరీల జాబితాను ఇక్కడనిర్వహిస్తాము.

 • బిజినెస్ మరియు ఇంటిగ్రేటెడ్ భాగస్వాములు. సేవలను అందించడానికి గాను మేము మీ కార్యకలాపాల గురించిన సమాచారాన్ని బిజినెస్ మరియు ఇంటిగ్రేటెడ్ భాగస్వాములతో పంచుకుంటాము. ఉదాహరణకు, ఒక టేబుల్‌ను రిజర్వ్ చేయడానికి మీరు Snapchat లోపున OpenTable ను ఉపయోగించవచ్చు. ఇది ప్రైవేట్ కమ్యూనికేషన్‌లను చేరి ఉండదు. మేము ఈ భాగస్వాముల జాబితాను ఇక్కడనిర్వహిస్తాము.

 • మోస-వ్యతిరేక భాగస్వాములు. మోసమును నివారించుటకు గాను పని చేస్తున్న పరిశ్రమ భాగస్వాములతో ఉపకరణం మరియు వాడకం సమాచారం వంటి మీ యాక్టివిటీ గురించి మేము సమాచారాన్ని పంచుకుంటాము.

 • చట్టపరమైన, భద్రత మరియు రక్షణ భాగస్వాములు. ఈ క్రింది చట్టబద్ధత, భద్రత మరియు రక్షణ కారణాల కోసం అవసరమైన విధంగా మీ యాక్టివిటీ గురించి మేము సమాచారాన్ని పంచుకుంటాము:

  • ఏదైనా చెల్లుబాటు అయ్యే చట్టపరమైన ప్రక్రియ, ప్రభుత్వ అభ్యర్థన లేదా వర్తించే చట్టం, నియమం లేదా నిబంధనతో సమ్మతి వహించుట.

  • సంభావ్య సేవా షరతులు మరియు కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనలను దర్యాప్తు చేయుట, పరిష్కరించుట లేదా అమలు చేయుట.

  • మా యొక్క, మా వినియోగదారుల లేదా ఇతరుల హక్కులు, ఆస్తి లేదా భద్రతను పరిరక్షించుట.

  • ఏదైనా మోసం లేదా భద్రతా సమస్యలను కనిపెట్టుట మరియు పరిష్కరించుట.

 • అనుబంధీకులు. Snap Inc. మా స్వంతమైన విభిన్న అనుబంధసంస్థలను కలిగి ఉంటుంది.  మా సేవలను చేపట్టడానికి అవసరమైన విధంగా మేము అంతర్గత అనుబంధ సంస్థల లోపున మేము మీ సమాచారాన్ని పంచుకుంటాము.

 • ఒక విలీనం లేదా స్వాధీనత యొక్క ఆవశ్యకతల కొరకు. మా వ్యాపారాన్ని ఒక కొనుగోలుదారునికి లేదా సాధ్యత గల కొనుగోలుదారునికి అమ్మడానికి లేదా అమ్మకపు చర్చలు జరపడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటే, ఆ లావాదేవీ యొక్క భాగంగా, మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఒక వారసుడు లేదా అనుబంధ సంస్థకు బదిలీ చేయవచ్చు.

ఇంటిగ్రేటెడ్ భాగస్వాములు

మా సేవల యందు, మా ఇంటిగ్రేటెడ్ భాగస్వాముల ద్వారా అందించబడే కంటెంట్ మరియు ఇంటిగ్రేషన్స్ ఉండవచ్చు. ఉదాహరణలలో లెన్సెస్ లో ఇంటిగ్రేషన్స్, కెమెరా ఎడిటింగ్ సాధనాలు, స్కాన్ ఫలితాలను అందించడం, మరియు తృతీయ-పక్ష డెవలపర్ ఇంటిగ్రేషన్స్ చేరి ఉంటాయి. ఈ ఇంటిగ్రేషన్స్ ద్వారా, మీరు ఇంటిగ్రేటెడ్ భాగస్వామికి అదేవిధంగా Snap కు సమాచారాన్ని అందిస్తూ ఉండవచ్చు. ఆ భాగస్వాములు మీ సమాచారాన్ని ఎలా సేకరిస్తాయో లేదా ఎలా ఉపయోగిస్తాయో అనేదానికి మేము బాధ్యులు కాదు. ఎప్పటి లాగానే, మా సర్వీసుల ద్వారా మీరు ఇంటరాక్ట్ చేసే ఆ తృతీయ పక్షాలతో సహా మీరు సందర్శించే లేదా ఉపయోగించే ప్రతి తృతీయ-పక్షపు సేవ‌ యొక్క గోప్యతా విధానాలను మీరు సమీక్షించాల్సిందిగా మేం ప్రోత్సహిస్తాము. Snapchat లో మా ఇంటిగ్రేషన్స్ గురించి మీరు ఇక్కడమరింత తెలుసుకోవచ్చు.

లెన్సెస్ యొక్క నాణ్యతను మెరుగుపరిచేందుకు మేము iOS పైన ఆపిల్ యొక్క ట్రూ డెప్త్ కెమెరాను ఉపయోగిస్తాము. అయినప్పటికీ, ఈ సమాచారం వాస్తవ సమయంలో ఉపయోగించబడిందని గమనించండి - మేము మా సర్వర్‌లపై ఈ సమాచారాన్ని స్టోర్ చేయము లేదా తృతీయ పక్షాలతో షేర్ చేయము.

అంతర్జాతీయ డేటా బదిలీలు

మా సేవలు మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ తో అనుసంధానం చేస్తాయి. దానిని సుసాధ్యం చేయడానికి, యునైటెడ్ స్టేట్స్ లేదా మీరు నివసించే ఇతర దేశాల బయటివైపు నుండి మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చు, దానిని బదిలీ చేయవచ్చు, మరియు నిల్వ చేయవచ్చు మరియు ప్రక్రియ జరుపవచ్చు. మీరు నివసిస్తున్న చోటుకు వెలుపల మేము సమాచారాన్ని షేర్ చేసినప్పుడల్లా, మీరు నివసిస్తున్న చోట చట్టముచే అవసరమైన డేటాను రక్షించడానికి గాను మేము సంరక్షణలను అమలులో ఉంచుతాము. మీరు దీని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, మరిన్ని వివరాల కోసం ప్రాంత నిర్దిష్ట సమాచారం విభాగాన్ని చూడండి.

మేము మీ సమాచారాన్ని ఎంతకాలం ఉంచుకుంటాము

ఈ విభాగంలో మేము మీ సమాచారాన్ని ఎంత కాలం ఉంచుకుంటాము, ఎందుకు మేము మీ సమాచారాన్ని ఉంచుకుంటామనే సమాచారాన్నిమీకు అందజేస్తాము, మరియు చట్టాలు, కోర్టులు మరియు బాధ్యతలతో సమ్మతి వహించడానికి సమాచారాన్ని ఎలా ఉంచుకోవాల్సి ఉంటుందో కూడా మేము హైలైట్ చేస్తాము.

ఒక సాధారణ నియమంగా, మీరు మాకు చెప్పినంత కాలమూ మీ సమాచారాన్ని ఉంచుకుంటాము, మరి లేదంటే మా సేవలను అందించడానికి లేదా చట్టముచే అవసరమైనంత కాలమూ మేము దానిని ఉంచుకుంటాము. ఉదాహరణకు, ఒకవేళ మీరు మెమోరీస్ లో ఏదైనా స్టోర్ చేస్తే, మీకు అది అవసరమైనంత కాలమూ మేము దానిని ఉంచుతాము, అయితే మీరు ఒక ఫ్రెండ్ తో చాట్ చేసినప్పుడు, మీరు పంపిన చాట్‌లను మీ ఫ్రెండ్ చదువుకున్న తర్వాత 24 గంటల లోపున తొలగించబడే విధంగా మా సిస్టమ్స్ రూపొందించబడి ఉన్నాయి (లేదా మీ సెట్టింగ్‌ల మీద ఆధారపడి - చూసిన తర్వాత వెంటనే తమంత తాముగా). మేము డేటాను ఉంచుకుంటామో లేదో అనేది, నిర్దిష్ట ఫీచర్, మీ సెట్టింగ్‌లు, మరియు మీరు సేవలను ఎలా ఉపయోగించుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీ సమాచారాన్ని ఎంత కాలం ఉంచుకోవాలో మేము నిర్ణయించేటప్పుడు మేము పరిగణించే మరి కొన్ని కారకాంశాలు ఇక్కడ ఉన్నాయి:

 • మా సేవలను ఆపరేట్ చేయడానికి లేదా అందించడానికి మాకు సమాచారం అవసరమైతే. ఉదాహరణకు, మేము మీ అకౌంట్ నిర్వహించడానికి అవసరమైన - మీ పేరు, ఫోన్ నంబర్, మరియు ఇమెయిల్ చిరునామా వంటి మీ ప్రాథమిక అకౌంట్ వివరాలు ను మేము నిల్వ చేస్తాము.

 • మా సేవల నుండి మీరు ఆశించే పనులను చేయడానికి మరియు ఈ గోప్యతా విధానం లోపున మేము వివరించినట్లుగా చేయడానికి. ఉదాహరణకు, మిమ్మల్ని మీరు వ్యక్తపరచడానికి ఫ్రెండ్స్ కీలకం కాబట్టి మీరు తొలగించమని మమ్మల్ని అడిగే వరకూ మేము మీ ఫ్రెండ్స్ జాబితాను నిర్వహిస్తాము. దీనికి విరుద్ధంగా, మీరు మీ డీఫాల్ట్ సెట్టింగ్‌లను మార్చకపోయి ఉంటే లేదా ఏదైనా సేవ్ చేయాలని నిర్ణయించుకొని ఉంటే తప్ప, Snapchat లో పంపించబడిన Snaps మరియు చాట్‌లను స్వీకర్తలందరూ ఓపెన్ చేశారని మేము గుర్తించిన తర్వాత 24 గంటల లోపున, లేదా వాటి గడువు ముగిసిపోయిన తర్వాత మా సర్వర్ల నుండి అవి డీఫాల్ట్ గా తొలగించబడతాయి, ఆ ఉదంతంలో మీ ఎంపికలను మేము గౌరవిస్తాము.

 • సమాచారమే స్వయంగా. ఉదాహరణకు, స్థానపు సమాచారము ఎంత ప్రశస్తమైనది మరియు మీరు ఏ సేవలను ఉపయోగించుకుంటున్నారు అనేదానిని బట్టి మేము దానిని వివిధ కాలవ్యవధులపాటు భద్రపరుస్తాము. ఒకవేళ స్థానపు సమాచారం గనక Snap తో ముడిపడి ఉంటే - Memories కు సేవ్ చేయబడిన లేదా Snap Map లేదా Spotlight ‌కు పోస్ట్ చేయబడినట్లుగా - మేము Snap ని నిల్వ చేసుకున్నంత కాలమూ మేము ఆ స్థానమును నిలుపుకుంటాము.
  ఉపయోగకర చిట్కా: మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడంద్వారా మీ గురించి మేము నిలుపుకున్న లొకేషన్ డేటాను మీరు చూడొచ్చు.

 • కొన్ని నిర్దిష్ట చట్టపరమైన బాధ్యతలతో సమ్మతి వహించడానికి మేము ఎంతకాలం సమాచారాన్నినిలుపుకోవాల్సి ఉంటుంది.

 • హానిని నివారించడం, మా సేవా నిబంధనలు లేదా ఇతర పాలసీల యొక్క సాధ్యతా ఉల్లంఘనలను పరిశోధించడం, దురుపయోగపు రిపోర్టులను దర్యాప్తు చేయడం, లేదా మమ్మల్ని లేదా ఇతరులను రక్షించుకోవడం వంటి ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం మాకు అది అవసరమైతే.

 • ఉత్పత్తుల కొరకు నిర్దిష్ట నిలుపుదల వ్యవధులపై వివరాల కోసం మా ఉత్పత్తి చే గోప్యత పేజీ మరియు మద్దతు పేజీ ని చూడండి.

మీ సమాచారములో కొంత భాగం స్వయంచాలకంగా డిలీట్ చేయబడే విధంగా మా సిస్టమ్‌లు రూపొందించబడినప్పటికీ, ఒక నిర్దిష్ట సమయం నాటికి తొలగింపు జరుగుతుందని మేము వాగ్దానం చేయలేము.

కొన్ని సందర్భాల్లో మీ సమాచారాన్ని తొలగించడం నుండి మమ్మల్ని ఆపే చట్టపరమైన ఆవశ్యకతలతో మేము సమ్మతి వహించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు, ఒకవేళ మీ కంటెంటు యొక్క ఒక కాపీని ఉంచుకోవాలని అడుగుతూ మాకు ఒక కోర్ట్ నుండి ఒక నోటీసు అందినట్లయితే. మేము మీ డేటా యొక్క ఒక కాపీని ఉంచుకోవడానికి అవసరమైన ఇతర కారణాలు ఏమిటంటే, మేము రిపోర్టులు లేదా ఇతర నిబంధనలు లేదా పాలసీ ఉల్లంఘనల యొక్క నివేదికలు, లేదా మీ అకౌంట్ దురుపయోగమును తెలుసుకోవడం, మీ ద్వారా సృష్టించబడిన కంటెంట్ లేదా ఇతర Snapచాటర్లతో సృష్టించబడిన కంటెంట్ ఇతరులచే ఫ్లాగ్ చేయబడినట్లుగా తెలుసుకోవడం లేదా దురుపయోగం కొరకు మా సిస్టమ్స్ లేదా ఇతర నిబంధనలు లేదా పాలసీ ఉల్లంఘనలు జరిగినట్లుగా తెలుసుకోవడం. అంతిమంగా, మేము కొంత నిర్దిష్ట సమాచారమును పరిమిత కాలవ్యవధి పాటు లేదా చట్టముచే ఆవశ్యకమైనట్లుగా బ్యాకప్‌లో కూడా ఉంచుకోవచ్చు.

విభిన్న రకాల కంటెంట్ ని మేము ఎంతకాలం స్టోర్ చేస్తాము అనే దాని గురించి తాజా సమాచారం కోసం, మా సపోర్ట్ సైట్చూడండి.

ప్రాంత నిర్దిష్ట సమాచారం

మీరు ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై ఆధారపడి, మీకు అదనపు హక్కులు ఉండవచ్చు, ఈ విభాగం ప్రాంత నిర్దిష్ట సమాచారంపై మరిన్ని వివరాలను అందిస్తుంది.

మా విధానాలను సాధ్యమైనంత సులువుగా ఉంచడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాము, అయితే మీరు ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై ఆధారపడి మీకు కొన్ని అదనపు హక్కులు ఉండవచ్చు లేదా మీరు తెలుసుకొని తీరవలసిన కొంత నిర్దిష్ట సమాచారం ఉండవచ్చు. ఒకవేళ మీకు ఏవైనా వర్తిస్తాయేమో చూడడానికి దయచేసి ఈ దిగువ జాబితా చూడండి!

నిర్దిష్ట ప్రయోజనాల కోసం డేటా ప్రాసెసింగ్ చేయడానికై కొన్ని అధికార పరిధులకు మేము మా చట్టపరమైన ఆధారాన్ని పేర్కొనవలసి ఉంటుంది. మీరు ఆ సమాచారాన్ని ఇక్కడకనుగొనవచ్చు.

మా ఆడియన్స్

మా సేవలు 13 సంవత్సరాలు మరియు ఆపై వయసు గల వ్యక్తులకు నిర్దేశించబడ్డాయి.

మా సేవలు 13 సంవత్సరాల లోపు పిల్లలకు నిర్దేశించబడలేదు, మరియు అకౌంట్ ను సృష్టించడానికి మరియు సేవలను ఉపయోగించడానికి గాను మీరు తప్పనిసరిగా 13 సంవత్సరాలు లేదా ఆపై వయస్సు గలవారని నిర్ధారించాలి. మీరు 13 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నట్లుగా వాస్తవంగా మాకు తెలిసి ఉంటే (లేదా ఒక వ్యక్తి మీ రాష్ట్రము, ప్రావిన్స్ లేదా దేశములో తల్లిదండ్రుల సమ్మతి లేకుండా సేవలను ఉపయోగించుకోగలిగిన కనీస వయస్సు, ఇంకా ఎక్కువ కలిగియుంటే) మేము మీకు సేవలను అందించడం ఆపివేస్తాము మరియు మీ అకౌంట్ మరియు డేటాను తొలగిస్తాము.

అదనంగా, 18 సంవత్సరాల లోపు వయస్సు గల కొందరు Snapచాటర్ల యొక్క కొంత సమాచారాన్ని సేకరించడం, ఉపయోగించడం మరియు నిల్వ చేయడాన్ని కూడా మేము పరిమితం చేయవచ్చు. కొన్ని ఉదంతాల్లో, దీని అర్థం ఏమిటంటే, మేము 18 సంవత్సరాల లోపు వ్యక్తులకు నిర్దిష్ట ఫంక్షనాలిటీని అందించలేకపోతాము.

గోప్యతా విధానానికి ఆధునీకరణలు

మేము సమయానుగుణంగా ఎప్పటికప్పుడు మా గోప్యతా విధానాన్ని ఆధునీకరించవచ్చు, మరియు మీరు తెలుసుకోవాల్సియున్నదని మేము భావించే ఏవైనా మార్పులను మేము చేసినప్పుడు మీకు ఒక హెడ్స్ అప్ ఇస్తాము.

మేము ఈ గోప్యత పాలసీని సమయానుగుణంగా మార్చవచ్చు. అయితే, మేము అలా చేసేటప్పుడు, మేము మీకు ఏదో ఒక విధంగా తెలియజేస్తాము. కొన్నిసార్లు, మా వెబ్‌సైట్ మరియు మొబైల్ అప్లికేషన్ పై ఉండే గోప్యత పాలసీ యొక్క పైభాగములోని తేదీని సవరించడం ద్వారా మేము మీకు తెలియజేస్తాము. ఇతర సమయాలలో, మేము మీకు అదనపు నోటీసు ఇవ్వవచ్చు (మా వెబ్‌సైట్ యొక్క హోమ్ పేజీలకు ఒక స్టేట్‌మెంట్ జోడించడం లేదా మీకు యాప్-లోపలి నోటిఫికేషన్ ఇవ్వడం వంటిది).

మమ్మల్ని సంప్రదించండి

ఇక్కడి సమాచారం గురించి ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? మీరు మమ్మల్ని ఇక్కడసంప్రదించవచ్చు.